సుహాసిని మణిరత్నం అంత పెద్ద వ్యాధితో బాధపడిందా? రహస్యంగా ఉంచడానికి కారణం ఏంటి?

సీనియర్ నటి, మాజీ హీరోయిన్  సుహాసిని భయంకరమైన వ్యాధితో బాధపడిందా? చాలా కాలంగా ఆమె వ్యాధితో బాధపడితే ఈ విషయం రహస్యంగా ఎందుకు ఉంచారు? అనారోగ్యంనుంచి కోలుకున్నానని చెప్పిన సుహాసిని. చాలా ఏళ్లుగా ఈ విషయాన్ని ఎందుకు బయటకు చెప్పలేదో కూడా వివరించింది.
 

Actress Suhasini Maniratnam Reveals Tuberculosis Battle

 సావిత్రితరహా హీరోయిన్ల లిస్ట్ లో సుహాసిన కూడా ఉన్నారు.  సినిమాలో ఏ మాత్రం గ్లామర్ చూపించకుండా  స్టార్ హీరోయిన్ గా ఎదిగారు సుహాసిని. కమల్ హాసన్ అన్న చారుహాసన్ కూతురు  సుహాసిని. 1980లలో అగ్ర కథానాయికగా ఆమె ఉన్నారు. రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ ,నాగార్జున లాంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించారు సుహాసిని. 

Also Read: చిరంజీవి ముద్దు పేరుతో పిలుచుకునే హీరోయిన్ ఎవరో తెలుసా? మెగాస్టార్ తో చనువున్న ఏకైక నటి?

మణిరత్నంతో ప్రేమలో

హీరోయిన్‌గా ఉన్నప్పుడే కథ, డైలాగ్ రైటింగ్‌పై ఎక్కువ ఆసక్తి చూపిన సుహాసిని, మణిరత్నం దర్శకత్వం వహించిన సినిమాల్లో పనిచేసేటప్పుడు ఆయనతో ప్రేమలో పడ్డారు. ఈ ప్రేమకు తల్లిదండ్రులు అంగీకరించడంతో పెళ్లి చేసుకున్నారు. 1988లో దర్శకుడు మణిరత్నంను పెళ్లాడిన సుహాసిని నటనపై దృష్టి సారించారు. 

Also Read: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్ ఎవరు? రోజు ఫస్ట్ కిస్ ఇచ్చేది ఎవరికో తెలుసా?


కొడుకు నందన్

ఈ దంపతులకు నందన్ అనే కొడుకు కూడా ఉన్నాడు. సుహాసిని, మణిరత్నం ఇద్దరూ సినీ పరిశ్రమకు చెందిన వారే అయినప్పటికీ, వారి కుమారుడు నందన్ మాత్రం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. భవిష్యత్తులో అతను దర్శకుడు లేదా నటుడు కావాలనుకుంటే అది అతని ఇష్టమని, అందులో తాము జోక్యం చేసుకోమని ఇదివరకే చెప్పారు.

Also Read: నయనతార కు షాక్, మూకుతి అమ్మన్ 2 నుండి ఆమె అవుట్? క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ

దర్శకురాలు కూడా

ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీగా ఉన్న సుహాసిని, నటనతో పాటు దర్శకురాలిగా కూడా మారారు. తన భర్త మద్రాస్ టాకీస్ నిర్మాణ సంస్థలో నిర్వాహకుల్లో ఒకరిగా ఉన్నారు. 1995లో విడుదలైన ఇందిర సినిమాను ఆమె డైరెక్ట్ చేశారు. 

Also Read: ఎన్టీఆర్ ‌- ఏఎన్నార్ లకు చుక్కలు చూపించిన హీరోయిన్ ? ఆమె మీద కోపంతో ఏం చేశారంటే..?

సుహాసినికి క్షయ వ్యాధి:

సుహాసిని రీసెంట్ గా ఒక భయంకరమైన నిజాన్ని వెల్లడించారు. తను పెద్ద వ్యాధితో బాధపడ్డానన్నారు.  తనకు  క్షయ వ్యాధి ఉందని మొదటిసారిగా వెల్లడించారు. తనకు 6 ఏళ్ల వయసు నుంచే క్షయ వ్యాధి ఉందని ఆమె అన్నారు. ఆ తర్వాత చికిత్స తీసుకున్న తర్వాత చిన్న వయసులోనే తగ్గిపోయింది. ఆ సమస్యతో అంతా అయిపోయిందని అనుకున్న సమయంలో తనకు 36 ఏళ్లు ఉన్నప్పుడు మళ్లీ క్షయ వ్యాధి బారిన పడ్డట్టు వెల్లడించారు. 

Also Read: సావిత్రిని టికెట్ లేదని ట్రైన్ నుంచి దిగిపొమ్మన్న టీసి. మహానటిని కాపాడిన హీరోయిన్ ఎవరు?

గౌరవం తగ్గుతుందని

దీంతో నా బరువు బ్యాలన్స్ తప్పింది.  ఆప్రభాంతో చెవులు సరిగ్గా వినబడలేదు. దాదాపు 6 నెలలు చికిత్స తీసుకున్న తర్వాత క్షయ వ్యాధి నుంచి బయటపడ్డాను. అప్పుడు ఈ విషయం బయటకు చెబితే నా గౌరవం తగ్గుతుందని అనుకున్నాను. అందుకే బయటకు చెప్పలేదు. ఇప్పుడు ఈ విషయం సమాజానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే బయటకు చెబుతున్నాను అని ఆమె అన్నారు.  ఈ విషయం ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

Also Read:రూ. 700 కోట్ల ఆస్తులు, సినిమాలు లేకపోయినా మహారాణిలా లైఫ్ లీడ్ చేస్తోన్న హీరోయన్ ఎవరు?

Latest Videos

vuukle one pixel image
click me!