Mad Square Movie Review: `మ్యాడ్‌ 2` మూవీ రివ్యూ, రేటింగ్‌

Mad Square Movie Review: `మ్యాడ్‌` మూవీ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. దానికి సీక్వెల్‌గా `మ్యాడ్‌ 2` వచ్చింది. ఈ మూవీ నేడు శుక్రవారం విడుదలైంది. ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

Mad Square movie review in telugu arj
Mad Square movie review, mad 2 review

Mad Square Movie Review: రెండేళ్ల క్రితం వచ్చిన `మ్యాడ్‌` మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. కాలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా వచ్చి ఆద్యంతం ఆకట్టుకుంది. నవ్వులు పూయించింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌ని తీసుకొస్తున్నారు నిర్మాత నాగవంశీ. సంగీత్‌ శోభన్‌, నార్నే నితిన్‌, రామ్‌ నితిన్‌, విష్ణు ఓఐ హీరోలుగా నటించిన మూవీ ఇది. కళ్యాణ్‌ శంకర్‌ దర్శకుడు. నాగవంశీ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌, శ్రీకరా స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హారిక, సాయి సౌజన్య నిర్మాతలు. ఈ చిత్రం నేడు శుక్రవారం(మార్చి 28)న విడుదలైంది. మరి `మ్యాడ్‌` మ్యాజిక్‌ రిపీట్‌ అయ్యిందా? సినిమా ఆడియెన్స్ ని నవ్వించడంలో సక్సెస్‌ అయ్యిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

Mad Square movie review in telugu arj
Mad Square movie review, mad 2 review

కథః 
`మ్యాడ్‌` స్టోరీకి మూడేళ్ల తర్వాత మ్యాడ్‌ గ్యాంగ్‌ ఏం చేశారనేది ఈ మూవీ. డీడీ(సంగీత్‌ శోభన్‌) ఊర్లో సర్పంచ్‌గా పోటీ చేసేందుకు ప్రయత్నాల్లో ఉంటాడు. కానీ పిచ్చి పిచ్చి పనులు చేసి అందరి చేత తిట్లు తింటాడు. సడెన్‌గా ఆయనకు ఓ ఫోన్‌ వస్తుంది. అశోక్‌(నార్నేనితిన్‌) వద్దకు వెళ్తాడు. అశోక్‌ తన ఆస్తులు కేసులో కోర్ట్ చుట్టూ తిరుగుతుంటాడు. వీరిద్దరు కలిసి పబ్‌కి వెళ్తారు.

అందులో మనోజ్‌(రామ్‌ నితిన్‌)ని చూసి షాక్‌ అవుతారు. అతను లవ్‌ఫెయిల్యూర్‌ అయి పబ్‌కి వెళ్లి అక్కడే సెటిల్‌ అవుతాడు. వీరి ముగ్గురు తమ గాథలు చెప్పుకునే క్రమంలో లడ్డు(విష్ణు) ప్రస్తావన వస్తుంది. అతను పెళ్ళి చేసుకుంటున్నాడని తెలుస్తుంది. తమకు చెప్పకుండా పెళ్లిచేసుకోవడమేంటి? అని వాళ్లే ఆ పెళ్లికి వెళ్తారు. వీళ్ల రాకతో లడ్డులో భయం స్టార్ట్ అవుతుంది. పెంట పని చేసి ఎక్కడ తన పెళ్లి చెడగొడతారో అని టెన్షన్‌ పడుతుంటాడు. ఆ పెళ్లిలో వీళ్లు రచ్చ రచ్చ చేస్తారు. తీరా పెళ్లి పీఠలెక్కే సమయానికి అమ్మాయి వేరే వాడితో లేచిపోతుంది.

దీంతో పెళ్లి ఆగిపోతుంది. అక్కడ ఉన్న ఎవరితోనైనా పెళ్లి చేయాలనుకున్నా, ఎవరూ ముందుకు రారు, బట్టతల వాడిని మేం పెళ్లి చేసుకోమని అమ్మాయిలు పారిపోతారు. ఆ బాధలో ఉండగా, గోవా వెళ్లి ఎంజాయ్‌ చేద్దామని ఐడియా ఇస్తాడు అశోక్‌. దీంతో గోవా వచ్చేస్తారు. అక్కడ అన్నీ మర్చిపోయి ఎంజాయ్‌ చేస్తారు. లడ్డుకి  లైలా(ప్రియాంక జవాల్కర్‌)ని సెట్‌ చేస్తారు.

కానీ ఆమె హ్యాండిస్తుంది. గోవాలో అదే సమయంలో పురాతన నెక్లెస్‌ దొంగతనం జరుగుతుంది. మాక్స్(సునీల్‌) గ్యాంగ్‌ ఆ పనిచేస్తుంది. కానీ అది మిస్‌ అవుతుంది? దీంతో వారి కోసం మ్యాక్స్ వెతుకుతుండగా, మ్యాడ్‌ గ్యాంగ్‌ ఆ పనిచేశారని తెలుస్తుంది. అదే టైమ్‌లో గోవాకి లడ్డు నాన్న(మురళీధర్‌ గౌడ్‌) వస్తాడు. ఆయన్ని కిడ్నాప్‌ చేస్తారు మ్యాక్స్. మరి ఆ నెక్లెస్‌ వెతకడం కోసం ఈ గ్యాంగ్‌ ఏం చేసింది? మ్యాక్స్ కి ఉన్న వీక్‌నెస్‌ ఏంటి? అశోక్‌ పాత్రలోని ట్విస్ట్ ఏంటి? అనుదీప్‌ పాత్ర ఏంటి? ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన కథ.  


Mad Square movie review, mad 2 review

విశ్లేషణః
రెండేళ్ల క్రితం వచ్చిన `మ్యాడ్‌` మూవీ హిలేరియస్‌గా నవ్వించింది. పెద్ద హిట్‌ అయ్యింది. ఆ స్టోరీకి మూడేళ్ల తర్వాత ఈ మనోజ్‌, లడ్డు, డీడీ, అశోక్‌ కలిసి ఏం చేశారనేది ఇందులో చూపించారు. దాన్ని మించిన కామెడీతో ఈ సినిమాని ప్లాన్‌ చేశారు. ముందు నుంచి నిర్మాత నాగవంశీ చెబుతున్నట్టు సినిమాలో కథ లేదు. సందర్భానుసారంగా వచ్చే కామెడీని బేస్‌ చేసుకుని ఈ సినిమాని రూపొందించారు.

ఇంకా చెప్పాలంటే కామెడీ సీన్లని రాసుకుని సినిమాని తీసినట్టుగా ఉంది. కేవలం హిలేరియస్‌గా నవ్వుకుని వెళ్లడానికి మాత్రమే మూవీ తెరకెక్కించినట్టు ఉంటుంది. కథ , కథనం, లాజిక్‌లు వెతకొద్దు అనేలా ఈ మూవీ సాగుతుంది. ఇక సినిమా ప్రారంభంలో డీడీ ఊర్లో సర్పంచ్‌ కోసం పడే పాట్లు, చీవాట్లు నవ్వులు పూయిస్తారు. ఆ తర్వాత ముగ్గురు కలిసి లడ్డు పెళ్లికి వచ్చి అక్కడ లడ్డుతో చేసే కామెడీ హిలేరియస్‌గా ఉంటుంది.

పెళ్లి ఎక్కడ ఆగిపోతుందో అని అతను టెన్షన్‌ పడటం, దీనికితోడు పెళ్లి ఆపేద్దామని వాళ్లు అనడం నవ్వులు పూయిస్తుంది. ఆ ఎపిసోడ్‌ మొత్తం బాగా వర్కౌట్‌ అయ్యింది. పెళ్లి కూతురు లేచిపోయే సీన్‌, ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా నవ్వించేలా ఉంటాయి. అందరు కలిసి గోవా ప్లాన్‌ చేయడం, పెళ్లికి ముందే అక్కడే హనీమూన్‌ప్లాన్‌ చేయడం అలా సాగిపోతుంటాయి.

గోవాలో సత్యం రాజేష్‌ పాత్ర ఎంట్రీ ఇస్తుంది. ఆయన పోలీస్‌ అధికారిగా కనిపిస్తాడు. ఆయన ఫూలీష్‌ పనులు కూడా బాగా వర్కౌట్‌ అయ్యాయి. సునీల్‌ ఎంట్రీతో సినిమా మరో స్థాయికి వెళ్తుంది. 

Mad Square movie review, mad 2 review

సెకండాఫ్‌ మొత్తం గోవాలోనే సాగుతుంది. అక్కడ గ్లామర్‌ పాళ్లు బాగా దట్టించారు. యూత్‌ని టార్గెట్‌ చేస్తూ ఆయా సన్నివేశాలను తెరకెక్కించారు. మరోవైపు లడ్డు తండ్రి వచ్చాక చోటు చేసుకునే సన్నివేశాలు కూడా నవ్విస్తాయి. సెకండాఫ్‌ మిడ్‌లో కొంత డల్‌ అవుతుంది. మళ్లీ ఆంటోనీ ఎంట్రీ తర్వాత మరింత హిలేరియస్‌గా మారిపోతుంది.

సినిమా డౌన్‌ అవుతున్న సమయంలో ఏదో ఒక ట్రాక్‌ యాడ్‌ చేసి నవ్వించే ప్రయత్నం చేశారు. అనుదీప్‌ పాత్ర కూడా కాసేపు అలరిస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ కావాలని పెట్టినట్టు ఉంది. కానీ ఫర్వాలేదని చెప్పొచ్చు. అయితే ఫస్ట్ సినిమాలో నేచురల్‌ కామెడీ బాగా వర్కౌట్‌ అయ్యింది. ఇందులో కొంత ఫోర్స్ గా పెట్టినట్టు ఉంది. కొన్ని సీన్లు అంతగా పండలేదు.

దీంతో రొటీన్‌ అనే ఫీలింగ్‌ కలుగుతుంది. పంచ్‌ డైలాగ్‌లు, స్పాంటినిటీ పంచ్‌లు సినిమాకి పెద్ద అసెట్‌. పాటలు ఊపుతెచ్చేలా ఉన్నాయి. ఓవరాల్‌గా మూవీ రెండు గంటలు సరదాగా నవ్వుకుని పోయే మూవీ అవుతుంది. లాజిక్‌లు, కథ, కథనం పట్టించుకోకుండా చూస్తే ఎంజాయ్‌ చేసే మూవీ అవుతుంది. 

Mad Square movie review, mad 2 review

నటీనటులుః 
మ్యాడ్‌ బాయ్స్ ఇన్నోసెంట్‌ ఫన్‌, కొంటె పనులు, రొమాంటిక్‌ చేష్టలు ఆద్యంతం నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా సంగీత్‌ శోభన్‌ మరోసారి తనదైన కామెడీ టైమింగ్‌తో రచ్చ చేశాడు. పంచ్‌ డైలాగ్‌లతో హిలేరియస్‌గా నవ్వించారు. డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌లతో ఆకట్టుకున్నాడు. ఇక నార్నే నితిన్‌ మొదటి సినిమాలో పెద్దగా ఓపెన్‌ కాలేదు. ఇందులో బాగానే ఓపెన్‌ అయ్యాడు. నవ్వించే ప్రయత్నం చేశాడు. నటుడిగా చాలా బెటర్‌ అయ్యాడు.

రామ్‌ నితిన్‌ ప్లేబాయ్‌ తరహా పాత్రలో ఆకట్టుకున్నాడు. తన మార్క్ రొమాంటిక్‌ విషయాలతో అలరించాడు. ఇక లడ్డుగా విష్ణు కామెడీ హైలైట్‌గా నిలుస్తుంది. సినిమా మొత్తం ఈ పాత్ర చుట్టే తిరుగుతుంది. ఇందులో విష్ణు అదే రేంజ్‌లో అలరించారు. నవ్వులు పూయించారు. ఆయన తండ్రి పాత్రలో మురళీధర్‌ గౌడ్‌ సైతం రెచ్చిపోయారు.

ఇందులోనూ ఆయన కామెడీ డోస్‌ పెరిగిందని చెప్పొచ్చు. సత్యం రాజేష్‌ కొత్తగా ఎంట్రీ ఇచ్చి తన మార్క్ కామెడీ చేశాడు. సీరియస్‌గా నవ్వించేలా చేశాడు. మరోవైపు ఆంటోనీ ఎంట్రీ వేరే లెవల్‌లో ఉంటుంది. అనుదీప్‌ పాత్ర సైతం కాసేపు నవ్విస్తుంది. ఇలా అంతా కలిసి  ఎంటర్‌టైన్‌ చేశారని చెప్పొచ్చు.

Mad Square movie review, mad 2 review

టెక్నీషియన్లు ః 
భీమ్స్ సిసిరోలియో సంగీతం సినిమాకి అసెట్‌. మొదటి పార్ట్ లాగే ఇందులో కూడా మంచి పాటలు ఇచ్చారు. హుషారు తెప్పించేలా పాటలున్నాయి. బీజీఎం థమన్‌ అందించారు. ఆయన మార్క్  బీజీఎం కనిపిస్తుంది. సినిమా స్థాయిని పెంచింది. శ్యామ్‌ దత్‌ ఐఎస్‌సి కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ కలర్‌ఫుల్‌గా ఉంటాయి. నవీన్‌ నూలి ఎడిటింగ్‌ బాగుంది. షార్ప్ గా ఉంది.

ఇక దర్శకుడు కళ్యాణ్‌ శంకర్‌ మరోసారి నవ్వించేందుకు ప్రయత్నం చేశాడు. అయితే మొదటి పార్ట్ అంత స్థాయిలో ఇది అనిపించలేదు. అందులో సహజమైన కామెడీ కనిపిస్తుంది. ఇందులో కొంత బలవంతంగా పెట్టిన ఫీలింగ్‌ కలుగుతుంది. కొన్ని చోట్ల మాత్రమే నేచురల్‌ కామెడీ వర్కౌట్‌ అవుతుంది.

డైలాగులు సినిమాకి పెద్ద అసెట్‌. తనదైన స్టయిల్‌లో నవ్వులు పూయించడంలో దర్శకుడు చాలా వరకు సక్సెస్‌ అయ్యాడని చెప్పొచ్చు. నిర్మాణ విలువలకు కొదవలేదు. నాగవంశీ ఎంత్తైనా పెడతాడు. అలానే తెరకెక్కించాడు. 

ఫైనల్‌గాః  మొదటి పార్ట్ అంత స్థాయిలో లేకపోయినా టైమ్‌ పాస్‌కి హాయిగా నవ్వుకునే మూవీ. 
రేటింగ్‌ః  3
 

Latest Videos

vuukle one pixel image
click me!