ఫ్యామిలీ మ్యాన్ 3 ఫేమ్ రోహిత్ బాస్ఫోర్ అనుమానాస్పద మృతి, అడవిలో శవమై కనిపించిన నటుడు

Published : Apr 29, 2025, 10:29 AM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ఫ్యామిలీ మెన్ 3 నటుడు రోహిత్ బాస్ఫోర్ అనుమానాస్పద పరిస్థితుల్లో  మృతిచెందాడు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్ళిన ఆయన  అడవిలో శవమై కనిపించడం కలకలం రేపింది. 

PREV
14
ఫ్యామిలీ మ్యాన్ 3 ఫేమ్ రోహిత్ బాస్ఫోర్ అనుమానాస్పద మృతి, అడవిలో శవమై కనిపించిన నటుడు
నటుడు రోహిత్ బాస్ఫోర్ మృతి

హిందీ నటుడు రోహిత్ బాస్ఫోర్ అనుమానాస్పద రీతిలో మరణించడం కలకలం రేపింది. మనోజ్ బాజ్‌పాయ్‌తో కలిసి 'ఫ్యామిలీ మ్యాన్ 3' వెబ్ సిరీస్‌లో కీలక పాత్ర పోషించనున్న రోహిత్ మృతి అనేక ప్రశ్నలకు దారితీసింది. ఏప్రిల్ 27 ఆదివారం సాయంత్రం అస్సాంలోని కర్బాంగ్ అడవిలోని ఒక జలపాతం వద్ద ఆయన మృతదేహం కనుగొనబడింది. ఆయన శరీరంపై అనేక గాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. 

24
స్నేహితులతో విహారయాత్రకు వెళ్ళిన రోహిత్

రోహిత్ ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటలకు స్నేహితులతో విహారయాత్రకు వెళ్ళాడని, కాని  సాయంత్రం కల్లా వారితో సంబంధాలు తెగిపోయాయని పోలీసు అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఒక స్నేహితుడు రోహిత్ కుటుంబానికి ఈ విషయం తెలియజేశాడు. వెంటనే ఆయన బంధువులు రాష్ట్ర విపత్తు నివారణ దళాన్ని (SDRF) సంప్రదించగా..  అడవిలో సెర్చ్ నిర్వహించిన అదికారులు.. అక్కడి  నుండి ఆయన మృతదేహాన్ని కనుకొన్నారు. ఫారెస్ట్ నుంచి బాడీని వెలికితీసి ఆసుపత్రికి తరలించారు.

 

34
రోహిత్‌ని చంపింది స్నేహితులేనా?

ఇక ఈ మరణంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ లోగా, రోహిత్‌ని ఆయన నలుగురు స్నేహితులే హత్య చేశారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇది ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిన కుట్ర అని వారు ఆరోపిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం పార్కింగ్ విషయంలో రోహిత్‌కు ఒక సమస్య వచ్చిందని, ఆ తర్వాత ముగ్గురు వ్యక్తులు ఆయనను చంపేస్తామని బెదిరించారని వారు చెబుతున్నారు.

రంజిత్ బాస్ఫోర్, అశోక్ బాస్ఫోర్, ధర్మ బాస్ఫోర్ అనే ముగ్గురిని రోహిత్ కుటుంబ సభ్యులు నిందిస్తున్నారు. అంతేకాకుండా, రోహిత్‌ను బయటకు తీసుకెళ్ళిన ఫిట్‌నెస్ శిక్షకుడు అమర్ దీప్ కూడా ఈ కుట్రలో భాగస్వామి అని వారు ఆరోపించారు. ప్రస్తుతం ఈ నలుగురూ పరారీలో ఉన్నారు.

44
రోహిత్ శరీరంపై అనేక గాయాలు

రోహిత్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, పోస్ట్‌మార్టం నిర్వహించారు. సోమవారం జరిగిన పోస్ట్‌మార్టంలో ఆయన ముఖం, తల, శరీరంపై ఇతర భాగాలలో గాయాలు ఉన్నట్లు తేలింది. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తూ, నిందితుల కోసం గాలిస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ 3 వెబ్ సిరీస్‌లో నటించనున్న నటుడు మృతి చెందడం బాలీవుడ్‌లో కలకలం రేపింది.

 

Read more Photos on
click me!

Recommended Stories