అందుకే పవన్ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది.. యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

Published : Jan 08, 2026, 07:25 PM IST

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం యంగ్ హీరోయిన్ సాక్షి వైద్యను సంప్రదించారట మేకర్స్. అయితే ఆ తర్వాత ఏం జరిగిందంటే.. వివరాలు ఇలా ఉన్నాయి. 

PREV
15
ఉస్తాద్ భగత్ సింగ్ వివరాలు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ కలయికలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. వీరిద్దరి కాంబోలో వస్తోన్న రెండో చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో విడుదల కానుంది. అంతేకాకుండా ఈ మూవీలో ఓ యంగ్ హీరోయిన్ నటించనుందని ఓ వార్త అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

25
పవన్ సినిమాపై రూమర్..

‘ఉస్తాద్ భగత్‌సింగ్’ మూవీలో హీరోయిన్ సాక్షి వైద్య కీలక పాత్రలో కనిపించనున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని హీరోయిన్ సాక్షి వైద్యను అడగ్గా.. ఆ వైరల్ వార్తలు నిజమేనని క్లారిటీ ఇచ్చింది. దానిపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

35
అందుకే వదులుకోవాల్సి వచ్చింది..

నాకు ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్’ చిత్రంలో కీలక పాత్రలో నటించే అవకాశం వచ్చింది. అయితే ఆ సమయంలో నా కుటుంబంలో క్లిష్ట పరిస్థితి ఎదురైంది. దాని వల్ల వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది. అదే సమయంలోనే మూవీ టీం నాకు ఫోన్ చేసి రేపటి నుంచి షూటింగ్ ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. దీంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక మంచి అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చింది.

45
తొలగించారని వార్తలు వచ్చాయి..

నా గత సినిమాలు వరుసగా ఫ్లాప్‌లు అయినందున.. నన్ను ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్’ నుంచి తొలగించారని వార్తలు వచ్చాయి. అది ప్రేక్షకుల పాయింట్ నుంచి రైట్ అనుకోవచ్చు.. కానీ ఆ రూమర్స్ గురించి పట్టించుకోను. నా పని నేను చేసుకుంటూపోతా. అలాంటివి నన్ను, నా కెరీర్‌ను ప్రభావితం చేయవు.

55
నారీనారీ నడుమ మురారీపైనే ఆశలు..

గతంలో ఈ అమ్మడు తెలుగులో నటించిన ఏజెంట్, గాండీవధారి అర్జున సినిమాలు బాక్సాఫీసు దగ్గర భారీ డిజాస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సాక్షి వైద్య ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించనుంది. ఇందులో శర్వానంద్‌ హీరోగా నటిస్తుంటే.. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. జనవరి 14న థియేటర్స్‌లోకి రాబోతుంది.

Read more Photos on
click me!

Recommended Stories