'మన శంకర వరప్రసాద్ గారు' సెన్సార్ రివ్యూపై నిర్మాత కామెంట్స్..ఆ సినిమాల వల్లే థియేటర్ల సమస్య

Published : Jan 08, 2026, 06:53 PM IST

మన శంకర వరప్రసాద్ గారు చిత్రం జనవరి 12న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో నిర్మాత సాహు గారపాటి సెన్సార్ రివ్యూ, థియేటర్ల సమస్య, టికెట్ ధరలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

PREV
15
మన శంకర వరప్రసాద్ గారు మూవీ 

మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం జనవరి 12 నుంచి థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా నయనతార నటించింది. అనిల్ రావిపూడి ఈ చిత్రంతో ఆడియన్స్ కి వింటేజ్ మెగాస్టార్ ని గుర్తు చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకున్నాయి. మీసాల పిల్లా అనే సాంగ్ 100 మిలియన్లకి పైగా వ్యూస్ సాధించింది. 

25
నిర్మాతగా మారిన చిరు కుమార్తె 

ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ లో సందడి చేశారు. ఈ చిత్రాన్ని నిర్మాత సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల కలిసి నిర్మించారు. ఈ చిత్రం గురించి నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సెన్సార్ సమయంలో జరిగిన ఆసక్తికర సంఘటనని సాహు గారపాటి బయటపెట్టారు.  

35
సెన్సార్ రివ్యూ 

సెన్సార్ కోసం ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు సెన్సార్ సభ్యులు విపరీతంగా నవ్వుకున్నట్లు సాహు గారపాటి తెలిపారు. ఈ చిత్రం చిన్న పిల్లలతో కలసి చూసేలా ఉంది అని అభినందించినట్లు రివీల్ చేశారు. చిరంజీవి, వెంకటేష్ మధ్య సన్నివేశాలు అద్భుతంగా అలరిస్తాయి. వీరిద్దరి మధ్య స్నేహం ఉండడం వల్ల ఆ సీన్స్ ఇంకా బాగా వచ్చాయి. 

45
థియేటర్ల సమస్య 

మా సినిమా అన్ని సినిమాల కంటే ముందు నుంచే సంక్రాంతి బరిలో ఉంది. ఆ తర్వాత మూడు సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. ఇలా ఒకేసారి పలు చిత్రాలు సంక్రాంతి బరిలో నిలవడం వల్ల థియేటర్ల సమస్య వచ్చింది. ఇలా థియేటర్ల కొరత రావడం అనేది అన్ని సినిమాలకు ఇబ్బందికర పరిణామమే. కానీ మాకు వచ్చిన నష్టం ఏమీ లేదు అని సాహు గారపాటి అన్నారు. 

55
టికెట్ ధరలు 

సినిమా టికెట్ ధరల గురించి కూడా సాహు గారపాటి మాట్లాడారు. టికెట్ ధరల పెంపు కోసం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నట్లు సాహు తెలిపారు. మన శంకర వరప్రసాద్ గారు చిత్రానికి సీక్వెల్  చేసే ఆలోచన లేదని అన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories