స్టార్‌ హీరోల సినిమాల్లో కనీసం లవ్‌ ట్రాక్‌లు కూడా ఉండట్లేదు.. ఓజీ హీరోయిన్‌ ఆవేదన.. కలెక్షన్లపై హాట్‌ కామెంట్‌

Published : Sep 24, 2025, 02:44 PM IST

ఓజీ హీరోయిన్‌ ప్రియాంక అరుల్ మోహన్‌.. స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు దక్కుతున్న ప్రయారిటీ గురించి ఆవేదన వ్యక్తం చేసింది. కనీసం లవ్‌ ట్రాక్‌లు, పాటలు కూడా ఉండటం లేదని చెప్పింది. 

PREV
16
`ఓజీ`తో సందడి చేయబోతున్న ప్రియాంక మోహన్‌

ఇప్పుడు సినీ లవర్స్ అంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తోన్న మూవీ `ఓజీ`. పవన్‌ కళ్యాణ్‌ హీరోగా వస్తోన్న మూవీ కావడంతో ఆ హైప్‌ వేరే లెవల్‌ అని చెప్పొచ్చు. ఇందులో ప్రియాంక అరుల్‌ మోహన్‌ హీరోయిన్‌. `గ్యాంగ్‌ లీడర్‌`, `సరిపోదా శనివారం` మూవీస్‌తో మెప్పించిన ప్రియాంక ఇప్పుడు `ఓజీ` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తోంది. బలమైన పాత్ర ఉంటేనే ఆమె మూవీస్‌ చేస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు `ఓజీ`లో పవన్‌కి జోడీగా కణ్మని పాత్రలో కనిపించబోతుంది. మరికొన్ని గంటల్లో ఆమె వెండితెరపై తనదైన స్టయిల్‌లో రచ్చ చేయబోతుంది.

26
స్టార్‌ హీరోల సినిమాల్లో కనీసం లవ్‌ ట్రాక్‌లు కూడా ఉండట్లేదు

ఇదిలా ఉంటే ఇప్పుడు పెద్ద హీరోల సినిమాల్లో హీరోయిన్లకి ఇస్తున్న ప్రయారిటీ గురించి, హీరోయిన్ల పాత్రలకు దక్కుతున్న స్థానం గురించి ప్రియాంక మోహన్‌ స్పందించింది. ఏషియానెట్‌ తెలుగు రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకి ఆమె స్పందిస్తూ ఆసక్తికర సమాధానం చెప్పింది. తన ఆవేదన వ్యక్తం చేసింది. ఒకప్పుడు స్టార్‌ హీరోల సినిమాల్లో హీరోయిన్లతో లవ్‌ ట్రాక్‌లు, పాటలు ఉండేవి. వీటికితోడు కొన్ని ఫ్యామిలీ సీన్లు ఉండేవి. కానీ ఇప్పుడు అవి కూడా ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేసింది ప్రియాంక. ఇప్పుడు చాలా వరకు యాక్షన్‌ సినిమాలే వస్తున్నాయి. అందులో ఎక్కువగా యాక్షనే ఉంటుంది. ఇక లవ్‌ ట్రాక్‌లకు స్కోప్‌ ఉండటం లేదు, డ్యూయెట్లు కూడా తగ్గిపోయానని ఆవేదన వ్యక్తం చేసింది.

36
హీరోయిన్లకి లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలే దిక్కు

ఇప్పుడు హీరోయిన్లకి బలమైన పాత్రలు దక్కాలంటే లేడీఓరియెంటెడ్‌ మూవీస్‌ చేయాల్సిందే అని వెల్లడించింది. అయితే కొన్ని సినిమాల్లో మాత్రం మంచి ప్రయారిటీనే ఉంటుందని, రైటర్స్ కొందరు తమ కోసం బలమైన పాత్రలను రాస్తున్నారని, సీన్లు కూడా బలంగానే ఉంటున్నాయని చెప్పింది. లక్కీగా తనకు మంచి ప్రయారిటీ ఉన్న పాత్రలే దక్కాయని వెల్లడించింది ప్రియాంక. ఇక సినిమాల కలెక్షన్ల గురించి, ఆ పోటీ గురించి చెబుతూ, తన దృష్టిలో అది రాంగ్‌ వే అని చెప్పింది.

46
కలెక్షన్లపై ప్రియాంక మోహన్‌ షాకింగ్‌ కామెంట్‌

సినిమా అనేది ఒక ఆర్ట్ అని, దాన్ని రెస్పెక్ట్ చేయాలని, కానీ ఇప్పుడు అంతా కలెక్షన్ల వెంట పరిగెడుతున్నారని తెలిపింది. ఒకప్పుడు సినిమా బాగుందా లేదా అనేదే చూసేవాళ్లం. కానీ ఎందుకు ఇప్పుడు ఇది ఇంత కలెక్ట్ చేసింది? అది అంత కలెక్ట్ చేసిందనేదానికి ప్రయారిటీ ఇస్తున్నారో అర్థం కావడం లేదు. కొంత మంది ఫేక్‌ కలెక్షన్లు చూపించి, ఇంతా, అంతా అంటుంటారు. కానీ మూవీలో కంటెంట్‌ ఉండదు, క్వాలిటీ ఉండదు. మళ్లీ మనం బ్యాక్‌ వెళ్లాలని, సినిమాని, ఆర్ట్ ని, క్రాఫ్ట్ ని రెస్పెక్ట్ చేయాలని కోరుకుంటున్నా. సినిమా అనేది మార్కెటింగ్‌ అండ్‌ బిజినెస్‌ ఇండస్ట్రీ కాదు, ఇది ఎంటర్టైన్‌మెంట్‌ ఇండస్ట్రీ, దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. క్రాఫ్ట్ ని గౌరవించాలి. కానీ ఇలా ఎందుకు జరుగుతుందో, ఇది ఎటు వెళ్తుందో తెలియదు.  దీన్నుంచి బయటపడాలని కోరుకుంటున్నా` అని తెలిపింది ప్రియాంక మోహన్‌.

56
`ఓజీ` కథ, తాను నటించిన కణ్మని పాత్ర గురించి

`ఓజీ` సినిమా గురించి ప్రియాంక చెబుతూ, `ఈ సినిమాతో దాదాపు రెండున్నరేళ్ల ప్రయాణం నాది. ఈ ప్రయాణాన్ని ఎప్పటికీ మరిచిపోలేను.  ఓజీ సినిమాలో కణ్మని పాత్ర చేయడం   అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పటిదాకా నేను చేసిన పాత్రల్లో కణ్మని నాకు చాలా ఇష్టమైన పాత్ర. ఈ పాత్రకి నా మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానముంటుంది. పవన్ కళ్యాణ్ గారితో పని చేయడం అనేది ప్రతిరోజూ అదృష్టమే. ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నాను. ఆయన జెంటిల్ మేన్. అందరినీ సమానంగా చూస్తారు. ఆన్ స్క్రీన్ లో, ఆఫ్ స్క్రీన్ లో ఆయన రియల్ హీరో. `ఓజీ` 1980-90లలో జరిగే కథ. పాత్రను మలిచిన తీరు కానీ, ఆహార్యం కానీ అప్పటికి తగ్గట్టుగానే ఉంటుంది. కణ్మని ఒక ఇన్నోసెంట్ స్వీట్ గర్ల్. గంభీర పాత్రతో గాఢమైన ప్రేమలో ఉంటుంది. గంభీర జీవితాన్ని మలుపు తిప్పే పాత్ర కణ్మని. ఫ్యామిలీ డ్రామా ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో యాక్షన్ అనేది ఒక భాగం మాత్రమే. బలమైన కథ ఉంది. ఫ్యామిలీ డ్రామా కూడా ఉంది` అని తెలిపింది ప్రియాంక మోహన్‌.

66
సెప్టెంబర్‌ 25న గ్రాండ్‌గా `ఓజీ` విడుదల

పవన్‌ కళ్యాణ్‌, ప్రియాంక మోహన్‌ జంటగా నటించిన `ఓజీ` మూవీకి సుజీత్‌ దర్శకుడు. ఇందులో ఇమ్రాన్‌ హష్మీ విలన్‌గా చేశారు. శ్రియా రెడ్డి, అర్జున్‌ దాస్‌, ప్రకాష్‌ రాజ్‌, రాహుల్‌ రవీంద్రన్‌ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించారు. ఈ చిత్రం నేటి రాత్రి నుంచి బెనిఫిట్‌ షోస్‌ ప్రదర్శిస్తున్నారు. రేపు గురువారం(సెప్టెంబర్‌ 25న) గ్రాండ్‌గా రిలీజ్‌ అవుతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories