సీనియర్ నటి రాశి గురించి పరిచయం అవసరం లేదు. 90వ దశకంలో రాశి హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టింది. తెలుగులో చాలా మంది అగ్ర హీరోలతో రాశి నటించింది. రాశి ఎక్కువగా శ్రీకాంత్, జగపతి బాబు లాంటి హీరోలతో సినిమాలు చేసింది. పవన్ కళ్యాణ్ తో గోకులంలో సీత చిత్రంలో రాశి నటించింది. శుభాకాంక్షలు, గోకులంలో సీత, మనసిచ్చి చూడు, ప్రేయసి రావే, దేవుళ్ళు, పెళ్లి పందిరి లాంటి గొప్ప చిత్రాల్లో రాశి నటించింది.
DID YOU KNOW ?
రంగస్థలం మిస్ చేసుకున్న రాశి
రాంచరణ్ రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్రలో నటించే అవకాశం ముందుగా రాశికి దక్కింది. కానీ ఆ పాత్ర నచ్చకపోవడంతో రాశి రిజెక్ట్ చేసింది. దీనితో ఆ గోల్డెన్ ఛాన్స్ అనసూయకి దక్కింది.
25
పెళ్లి తర్వాత సినిమాలకు దూరం
వివాహం తర్వాత కుటుంబం, కుమార్తె బాధ్యతలతో రాశి సినిమాలకు దూరం అయింది. ఇప్పుడు తిరిగి సినిమాల్లో బిజీ అయ్యేందుకు రాశి ప్రయత్నిస్తోంది. ఇటీవల రాశి ఉసురే అనే చిత్రంలో నటించింది. ఆగష్టు 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో రాశి హీరోయిన్ తల్లి పాత్రలో నటించారు. రాశి ఈ చిత్రాన్ని తన కంబ్యాక్ మూవీగా భావిస్తున్నారు.
35
కూతురితో కలిసి ఉసురే మూవీ చూసిన రాశి
ఈ చిత్రాన్ని రాశి తన కుమార్తె, ఇతర చిత్ర యూనిట్ తో కలిసి ప్రత్యేకంగా వీక్షించారు. ఈ సందర్భంగా రాశి తన కుమార్తెని తొలిసారి కెమెరా ముందు మీడియాకి, ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఉసురే మూవీలో మీ అమ్మ క్యారెక్టర్ ఎలా ఉంది అని ప్రశ్నించగా.. రాశి కుమార్తె మొహమాటం లేకుండా ఈవిల్ అని కామెంట్ చేసింది. తనకి తన తల్లి పాత్ర ఏమాత్రం నచ్చలేదని ముఖం మీదే చెప్పేసింది.
మా అమ్మ బ్యాడ్ క్యారెక్టర్స్ లో నటిస్తే తనకు నచ్చదని, తక్కువ నెగిటివిటీ ఉన్న క్యారెక్టర్స్ లో నటించాలని కోరుకుంటున్నట్లు రాశి కుమార్తె పేర్కొంది. తనకి సినిమాలపై అప్పుడే ఆసక్తి లేదని అమ్మ కోసమే ఈ మూవీ చూడడానికి వచ్చినట్లు రాశి కూతురు పేర్కొంది. రాశి మాట్లాడుతూ భవిష్యత్తులో ఎలాంటి పాత్రలు వచ్చినా చేస్తానని.. కాకపోతే కథలో తన పాత్ర కీలకం కావాలని రాశి తెలిపారు. కుటుంబం కోసమే సినిమాలకు గ్యాప్ తీసుకున్నా. ఇప్పుడు నా కూతురు తన పనులు తాను చేసుకోగలుగుతోంది. కాబట్టి ఇకపై తాను సినిమాలపై ఫోకస్ చేస్తానని అన్నారు.
55
పవన్ కళ్యాణ్ పై రాశి వ్యాఖ్యలు
పవన్ కళ్యాణ్ పై కూడా రాశి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గోకులంలో సీత చిత్రంలో మీరు కలిసి నటించిన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కదా అని ప్రశ్నించినప్పుడు రాశి స్పందించారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడం సంతోషించదగ్గ విషయం. ఆయన డిప్యూటీ సీఎం కావడంతో ఇంకా చాలా ఆనందంగా ఉంది అని రాశి పేర్కొన్నారు.