ప్రస్తుతం ఉదయభాను కూతుళ్లకి ఇప్పుడు 9ఏళ్లు. ప్రస్తుతం ఫోర్త్ క్లాస్ చదువుతున్నారని చెప్పొచ్చు. అయితే ఆ వివరాలు తెలియాల్సి ఉంది. కరీంనగర్‌కి చెందిన ఉదయభాను.. నటిగా రాణించాలని సినిమాల్లోకి వచ్చింది. నటిగా అడపాదడపా సినిమాలు చేసింది. కానీ అందులో ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. కానీ బుల్లితెర ఆమెకి గుర్తింపుని తీసుకొచ్చింది. స్టార్‌ని చేసింది. యాంకర్‌గా విశేషంగా అలరించింది ఉదయభాను. ఆమె యాంకర్‌గా చేసిన వాటిలో `డాన్స్`, `ఛాలెంజ్`, `వన్స్ మోర్ ప్లీజ్`, `సాహసం చేయరా డింబకా`, `జానవులే నెరజానవులే`, `నువ్వు నేను`, `లక్స్ డ్రీమ్ గర్ల్`, లక్కీ లక్ష్మీ``, `ఛాంగురే బంగారు లేడీ`, `డాన్సింగ్ స్టార్స్`, `గోల్డ్ రష్`, `తీన్ మార్`, `రేలా రే రేలా`, `రంగం`, `ఢీ`, `పిల్లలు పిడుగులు`, `అంతఃపురం`, `నీతోనే డాన్స్` వంటి షోస్ ఉన్నాయి.