1000 రోజులకు పైగా ఆడిన బాలయ్య సినిమా
కడప, కర్నూల్ జిల్లాల్లో 'లెజెండ్' సినిమాకు ఎవరూ ఊహించని విధంగా రెస్పాన్స్ లభించింది. అంతే కాదు కడప జిల్లాలోని ఒక థియేటర్‌లో ఈసినిమా 1100 రోజులకు పైగా ఆడింది. అంతేనా కర్నూల్ జిల్లాలోని ఎమ్మిగనూరు టౌన్ లో లెజెండ్ సినిమా 421 రోజులు నిరవధికంగా ప్రదర్శించబడింది. ఇది బాలయ్య అభిమానులు కాలర్ ఎగరేసి గర్వపడే రికార్డు.
ఎమ్మిగనూరులో బాలయ్య సినిమా ఏది రిలీజ్ అయినా అది ఏదో ఒక రికార్డ్ అందుకుంటూనే ఉంటుంది. బాలయ్యకు ఇక్కడ ఉన్న ఆదరణ ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది. ఇప్పటి వరకూ ఇక్కడ బాలకృష్ణకు సబంధించిన 11 సినిమాలు 100 రోజులకు పైగా ప్రదర్శించబడ్డాయి. వాటిలో 'పెద్దన్నయ్య', 'సమర సింహారెడ్డి', 'నరసింహనాయుడు', 'చెన్నకేశవరెడ్డి', 'లక్ష్మీ నరసింహ', 'సింహా', 'లెజెండ్', 'డిక్టేటర్', 'గౌతమి పుత్ర శాతకర్ణి', 'జై సింహా' సినిమాలు ముఖ్యమైనవి. వాటిలో ‘సమరసింహా రెడ్డి’ 177 రోజులు, ‘నరసింహ నాయుడు’ 176 రోజులు ప్రదర్శించబడి రికాడ్స్ సాధించాయి.