Actress Pragathi: టాలీవుడ్ నటి ప్రగతి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు కీలక కామెంట్స్ చేసింది. పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిందామె. పెళ్లి చేసుకోవడానికి వయస్సు ఉంటే సరిపోదు.. కావాల్సింది అదేనని పేర్కొంది.
టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. అనేక చిత్రాల్లో తల్లి పాత్రల్లో నటించి మెప్పించిన ఈ బ్యూటీ.. తెలుగులోనే కాదు తమిళ, కన్నడతో సహా ఇతర భాషల్లోనూ సినిమాలు చేసి.. తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఆమె ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కీలక కామెంట్స్ చేసింది.
25
పెళ్లిపై కామెంట్స్..
తాజాగా పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నటి ప్రగతి. పెళ్లి చేసుకోవడానికి వయస్సుతో పన్లేదు. కేవలం వయస్సు ఉంటే సరిపోదు.. పెళ్లి చేసుకోవాలంటే చాలా మెచ్యూరిటీ ఉండాలని పేర్కొంది. ముఖ్యంగా ఒకరిపై ఒకరికి నమ్మకం, ఒకరిపై ఒకరికి నమ్మకం, అవగాహన ఉండాలని నటి ప్రగతి పేర్కొంది. పెళ్లి విషయంలో ఈ మూడు చాలా ముఖ్యం అని చెప్పింది.
35
బంధం ఏదైనా ఇవి ముఖ్యం..
గౌరవం, నమ్మకం లేని చోట ఏ బంధం కూడా నిలబడదని నటి ప్రగతి తెలిపింది. బంధం నిలబడాలంటే ఒకరిపై ఒకరికి గౌరవం ఉండటం ముఖ్యమని చెప్పింది. ఒకరి ఆలోచనలను మరొకరు అర్ధం చేసుకోవాలి. ఇద్దరిలోనూ ఆ గుణం ఉండటం చాలా ఇంపార్టెంట్ అని ప్రగతి పేర్కొంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇటీవల పవర్ లిఫ్టింగ్‌లో ప్రపంచ స్థాయిలో పతకాలు సాధించి దేశ గౌరవాన్ని పెంచింది నటి ప్రగతి. టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు పతకాలు సాధించింది. అటు సినిమాల్లోనే కాదు.. బయట కూడా తన సత్తా చాటి తన ప్రతిభను నిరూపించుకుంది నటి ప్రగతి.
55
వేణుస్వామితో పూజలు..
పతకాలను గెలవకముందు నటి ప్రగతి ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు నిర్వహించింది. ఆపై దేశం తరపున పతకాలు గెలవడంతో.. వేణుస్వామి పూజల వల్లే నటి ప్రగతి పతకాలు గెలిచిందంటూ పలు కామెంట్స్ ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. అయితే దీనిపై స్పందించిన ప్రగతి.. అవన్నీ అవాస్తవం అని.. ఇలాంటివి స్ప్రెడ్ చేసేవారు.. వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని పేర్కొంది.