Sivaji: ప్రతి మాటకు ఓ కారణం ఉంటుంది.. ప్లీజ్‌ పర్సనల్‌ విషయాల జోలికి వద్దంటూ శివాజీ హెచ్చరిక

Published : Dec 26, 2025, 06:40 PM IST

నటుడు శివాజీ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాడు. ఆయన హీరోయిన్లని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన నేపథ్యంలో ఇప్పుడు తన పర్సనల్‌ విషయాల జోలికి రావద్దంటూ తెలిపారు. 

PREV
15
హాట్‌ టాపిక్‌గా మారిన శివాజీ కామెంట్స్

నటుడు శివాజీ ఇటీవల మహిళలపై చేసిన కామెంట్స్ వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో పెద్ద రచ్చ అయ్యాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చనీయాంశం అవుతుంది. ఏ న్యూస్‌ ఛానెల్‌ చూసినా దీని మీదనే డిబేట్లు పెడుతున్నాయి. శివాజీ అనుచితంగా కామెంట్‌ చేయడం, అనసూయ, చిన్మయి, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్‌ వంటి వారు స్పందించడం, దీనికి శివాజీ కౌంటర్లు ఇవ్వడం, ఆ తర్వాత ఆయన క్షమాపణలు చెప్పడం నడుస్తూనే ఉంది. అయితే చాలా మంది మహిళలు శివాజీని సపోర్ట్ చేయడం గమనార్హం.

25
దండోరా మూవీకి పాజిటివ్‌ టాక్‌

తాజాగా శివాజీ ఈ పరిణామాలపై స్పందించారు. ఆయన `దండోరా` మూవీలో ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. నందు, బిందు మాధవి, నవదీప్‌, రవికృష్ణ వంటి వారు ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ గురువారం విడుదలైంది. దీనికి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. కులం అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలందుకుంది. ఈ క్రమంలో శుక్రవారం థ్యాంక్స్ మీట్‌ ఏర్పాటు చేసింది టీమ్‌. ఇందులో శివాజీ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

35
నోట్లో నుంచి ఎప్పుడు ఏం వస్తుందో తెలియదు

సినిమాలో బిందు మాధవి, శివాజీ మధ్య లవ్‌ ట్రాక్‌ ఉంటుంది. అయితే ఆ ట్రాక్‌ని పెద్దగా చూపించలేదు. ఎప్పుడు మీ మధ్య ప్రేమ పుట్టిందనే ప్రశ్న ఎదురైంది. దీనికి శివాజీ స్పందిస్తూ, మనిషి జీవితంలో ఒంటరైనప్పుడు ఒక కంపెనీ కావాలి. ఆ కంపెనీ కోసం వాడు ఖర్చుపెట్టుకుని వెళ్లాడు. ఎక్కడో ఓ చోట ఏదో కనెక్షన్‌ దొరికింది. ఈ జీవితంలో ఎవరు ఎందుకు కలుస్తారో, ఎవరికీ తెలియదు. నోట్లో నుంచి ఎప్పుడు ఎందుకు వస్తుందో తెలియదు. కానీ నేచరల్‌లో ప్రతిదానికి ఓ కారణం ఉంటుంది` అని తెలిపారు శివాజీ. అంటే ఆయన ఎందుకు అలా మాట్లాడాడో, దానికి ఒక కారణం ఉంటుందని ఆయన చెప్పకనే చెప్పారు.

45
నా వ్యక్తిగత విషయాల జోలికి వద్దంటూ శివాజీ వార్నింగ్‌

ఇక తన వివాదం గురించి స్పందిస్తూ, తన వ్యక్తిగత జీవితం జోలికి వెళ్లొద్దని తెలిపారు. `ప్లీజ్ నా వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లకండి. వాటి గురించి కాకుండా `దండోరా` సినిమాని ప్రమోట్ చేయండి. లేదంటే ఆ నింద నేను మోయాల్సి వస్తుంది. కావాలంటే నేను థియేటర్‌కు వస్తాను. ఏం మాట్లాడాలన్నా నేను అక్కడ మాట్లాడతాను` అని తెలిపారు శివాజీ. పరోక్షంగా ఇక దీనిపై రచ్చ వద్దని  చెప్పడం గమనార్హం.

55
రెండు గంటలే పడుకున్ననని శివాజీ వెల్లడి

దండోరా మూవీ గురించి శివాజీ మాట్లాడుతూ, సినిమాని రెండు రోజుల ముందు ప్రీమియర్స్ వేస్తే వేరే లెవల్‌లో ఉండేదని తెలిపారు. సెన్సార్‌ వల్ల డిలే అయ్యిందని తెలిపారు. ఈ సినిమా చూసి హనుమాన్ ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూట్‌ చేయ‌డం ఫస్ట్ టైమ్‌. నా దర్శకుడు నీల‌కంఠ‌ అయితే త‌రాల‌కొక‌సారే ఇలాంటి సినిమా వ‌స్తుంద‌ని అన్నారు. `ఈ సినిమా గురించి 2026 మొత్తం మాట్లాడుకుంటారు. మ‌ల‌యాళ సినిమా డైరెక్ట‌ర్స్‌, మారి సెల్వ‌రాజ్ వంటి డైరెక్ట‌ర్‌తో పోల్చి ముర‌ళీకాంత్ గురించి మాట్లాడుతున్నారంటే చాలా గ‌ర్వంగా ఉంది. ఈ సినిమా షూటింగ్ చేస్తునన్ని రోజులు నేను రోజుకి 2 గంట‌లే ప‌డుకునేవాడిని. ఇందులో నాకు కొడుకు, కూతురు.. పాత్ర‌లుంటాయి. వాటిని బ్యాలెన్స్ చేయాలంటే పాత్ర‌లో ఆ లుక్ క‌నిపించాలి. డైరెక్ట‌ర్ అడ‌గ‌క‌పోయినా నేను క‌ష్ట‌ప‌డ్డాను. అంద‌రూ ప్రాణం పెట్టి చేసిన సినిమా ఇది. ఆదరించాల`ని తెలిపారు శివాజీ.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories