ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్

Published : Dec 11, 2025, 09:05 PM IST

Actress: నటి మిర్చి మాధవి తన సినీ ప్రస్థానంలో ఎదురైన ఇబ్బందులు, సవాళ్లను ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. కాస్టింగ్ కౌచ్ అనుభవాలు, సెట్స్‌లో క్రమశిక్షణా చర్యలు లాంటివి ఇప్పుడు తెలుసుకుందామా.. 

PREV
15
మిర్చి మాధవి కీలక వ్యాఖ్యలు..

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆర్టిస్ట్ మిర్చి మాధవి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను ఇండస్ట్రీలో ఎదుర్కున్న ఇబ్బందులు, క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు పంచుకుంది. ఆఫర్ల కోసం కమిట్‌మెంట్ అడిగేవారే ఇండస్ట్రీలో ఎక్కువమంది ఉన్నారని చెప్పింది.

25
కమిట్‌మెంట్ అడిగారు..

13 సంవత్సరాల క్రితం తాను క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కున్నానని.. ఒక సినిమాలో నటించే అవకాశం కోసం ఐదుగురికి "కమిట్‌మెంట్" ఇవ్వమని అడిగారని మిర్చి మాధవి తెలిపింది. ఇది తన కెరీర్‌లో ఒకే ఒక్కసారి ఎదురైన సంఘటన అని, మళ్లీ అలాంటి పరిస్థితులు ఎప్పుడూ తలెత్తలేదని ఆమె పేర్కొంది. ఇలాంటి రకమైన సవాళ్ళు ఎదురైనప్పుడు భయపడకుండా, తన జర్నీపైనే దృష్టి సారించానని ఆమె చెప్పింది.

35
నా వృత్తి నాకు ఉద్యోగం..

తన తండ్రి బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారని.. అలాగే తన వృత్తిని కూడా ఓ ఉద్యోగంలా భావిస్తానని నటి మిర్చి మాధవి తెలిపింది. తనకు పెద్ద పెద్ద అవకాశాలు రాకపోయినా.. నిరాశ చెందకుండా ముందుకు వెళ్తుంటానని చెప్పింది. ఇండస్ట్రీ అలా మారాలి.. ఇలా మారాలి అనే ఆశలు ఏవి లేవని.. తన కుటుంబం, తన చుట్టూ ఉన్న వ్యక్తుల బాగోగులు చూసుకుంటే చాలని ఆమె పేర్కొంది.

45
బాలకృష్ణతో ఆ సీన్..

ఎన్టీఆర్ కథానాయకుడు మూవీ, లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాలలో నందమూరి బాలకృష్ణపై గాజులు పగలగొట్టే సన్నివేశం గురించి మాట్లాడుతూ.. 'ఆ సమయంలో చాలా భయపడ్డాను, అయితే బాలకృష్ణ స్వయంగా వచ్చి ధైర్యం చెప్పి, 'నువ్వు బాగా చేస్తేనే సీన్ బాగా వస్తుంది' అని ప్రోత్సహించారని మిర్చి మాధవి తెలిపింది.

55
భవిష్యత్తు ప్రణాళికలు ఇలా..

రాబోయే ఐదారు సంవత్సరాలలో సినిమాలు, సీరియల్స్ కొనసాగిస్తూనే, తాను రాసిన రెండు స్క్రిప్ట్‌లతో దర్శకురాలిగా తొలి ప్రయత్నం చేయాలని భావిస్తున్నట్టు మిర్చి మాధవి చెప్పింది. అంతేకాకుండా, జీవితాంతం తనకు ఆదాయాన్ని అందించే ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచన కూడా ఉందని ఆమె వెల్లడించింది.

Read more Photos on
click me!

Recommended Stories