నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా

Published : Dec 11, 2025, 07:49 PM IST

అనిల్ రావిపూడి నయనతారని చిరంజీవి మూవీ కోసం ఒప్పించే క్రమంలో నాగార్జున సినిమా గురించి చెప్పి థ్రిల్ చేశారట. అసలు నాగార్జున సినిమా ప్రస్తావన ఎందుకు వచ్చింది ? చిరంజీవి మూవీ కోసం నయనతార తన రూల్ ఎందుకు బ్రేక్ చేసింది అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
మన శంకర వరప్రసాద్ గారు మూవీ 

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రంలో నటిస్తున్నారు. సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. అనిల్ రావిపూడి, చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి చిత్రం ఇది. ఈ చిత్ర ప్రారంభోత్సవం నుంచి బజ్ మొదలయింది. టైటిల్, టీజర్, ఇటీవల విడుదలైన 2 పాటలు అభిమానులని ఆకట్టుకున్నాయి. 

25
రూల్ బ్రేక్ చేసిన నయనతార 

ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా నయనతార సినిమా ప్రమోషన్స్ కి దూరంగా ఉంటారు. అది ఆమె రూల్. ఎంత పెద్ద సినిమా అయినా సరే షూటింగ్ పూర్తయ్యాక నయనతార కనిపించరు. ప్రమోషన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆమె హాజరు కారు. కానీ మన శంకర వరప్రసాద్ గారు చిత్రానికి నయనతార ప్రారంభం నుంచే ప్రమోషన్స్ మొదలు పెట్టారు. 

35
అనిల్ రావిపూడి ఎలా ఒప్పించారు ?

షూటింగ్ లో హాజరైన రోజే నయనతార ఈ మూవీ కోసం స్పెషల్ వీడియో చేసింది. నయనతార తన రూల్ పక్కన పెట్టి ఈ మూవీ కోసం ఎందుకు ప్రమోషన్స్ చేస్తోంది అని అంతా ఆశ్చర్యపోయారు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. నయనతార అసలు ప్రమోషన్స్ కి రాదు.. వీడు ఎలా ప్రమోషన్స్ చేయించాడు అనేది టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. కనై నేను చేసింది ఏమీ లేదు.. నయనతార గారి దగ్గరకు పాజిటివ్ అప్రోచ్ తో వెళ్ళాను. ఆమె చేశారు అంతే. ఇందులో ఇక సీక్రెట్స్ ఏమీ లేవు అని అనిల్ రావిపూడి అన్నారు. 

45
బలంగా కోరుకున్నా 

 మనం అడిగే విధానం బట్టి వేరేవాళ్ళ రియాక్షన్ ఉంటుంది. నేను అడిగిన విధానం నయనతార గారికి నచ్చి ఉండొచ్చు. ఆమె చేస్తే బావుంటుంది అని బలంగా కోరుకున్నా. అదే జరిగింది అని అనిల్ రావిపూడి అన్నారు. అనిల్ రావిపూడి నయనతారకి మరో స్వీట్ షాక్ కూడా ఇచ్చారట. మన శంకర వరప్రసాద్ గారు కథ మొత్తం చెప్పారట. ఆమెకి కథ నచ్చి సినిమా చేయడానికి అంగీకరించారు. 

55
నాగార్జున సినిమాతో థ్రిల్ చేసిన అనిల్ 

ఇక్కడ నయనతారకి సర్ప్రైజ్ ఏంటి అంటే.. అనిల్ రావిపూడి నయనతార, నాగార్జున నటించిన బాస్ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. కానీ ఆ విషయం ఆమెకి గుర్తు లేదు. ప్రతిసారి నయనతారని లొకేషన్ కి పిలిచేది నేనే. కథ చెప్పిన తర్వాత ఆ విషయం నయనతారకి చెప్పాను. ఆమె థ్రిల్ అయ్యారు అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. నాగార్జునతో నయనతార నటించిన బాస్ మూవీ నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. 

Read more Photos on
click me!

Recommended Stories