చనిపోయే ముందు శ్రీదేవి నన్ను కలిసింది.. అప్పుడు అందరం కలిసి గెట్ టుగెదర్.!

Published : Dec 25, 2025, 09:28 PM IST

Jayamalini: నటి జయమాలిని శ్రీదేవితో ఉన్న తన అనుబంధాన్ని, ఆమె మరణం గురించి మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. కృష్ణ, శోభన్ బాబు, ఎంజీఆర్ లాంటి దిగ్గజాలతో తన సినీ ప్రయాణాన్ని కూడా గుర్తు చేసుకుంది. మరి ఆమె ఏం అన్నారో.. ఈ స్టోరీలో తెలుసుకుందామా.. 

PREV
15
కృష్ణతో బంధం..

ప్రముఖ నటి జయమాలిని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి, అలాగే దిగ్గజ నటీనటులతో తనకున్న అనుబంధం గురించి అభిమానులతో పంచుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురైంది. తాను ఫాస్ట్‌గా డ్యాన్స్ చేసిన ప్రతీసారి.. హీరో కృష్ణ.. 'ఈ పిల్ల చిలకలా గెంతుతోంది, నా వల్ల కాదు' అని అనేవారని గుర్తు చేసుకుంది. శోభన్ బాబు లాంటివారు కూడా తనతో సరదాగా ఉండేవారని చెప్పింది.

25
ఎంజీఆర్‌తో అనుబంధం..

ఎంజీఆర్ లాంటి దిగ్గజ నటుడితో తనకున్న అనుబంధాన్ని నటి జయమాలిని గుర్తు చేసుకుంది. ఓసారి ఎంజీఆర్ పిక్చర్‌కు పూజ కోసం పిలిచినప్పుడు, ఆయన గురించి పెద్దగా తెలియక తాను రాను అనేశానని, తన తల్లిదండ్రులు వెళ్లినప్పుడు 'జయ రాలేదా?' అని ఎంజీఆర్ అడిగారని వాళ్లు చెప్పినట్టుగా తెలిపింది. ఎంజీఆర్ తనతో నేరుగా నటించనప్పటికీ, తన నృత్య ప్రదర్శనకు ముఖ్య అతిథిగా వచ్చి, ఒక గంట పాటు చూసి, ఆశీర్వదించారని, అది తనకు చాలని చెప్పుకొచ్చింది.

35
సినీ జీవితం ఎప్పుడూ ఆనందమే..

తన సినీ జీవితం ఎప్పుడూ ఆనందంగా సాగిందని, డ్రెస్సులు, ట్రోల్స్, పాత్రల విషయంలో తనకెప్పుడూ ఎలాంటి కష్టం రాలేదని జయమాలిని పేర్కొంది. 'ఎవరు అడిగినా కూడా చెప్తారు, కరెక్ట్ టైంకి ఆ అమ్మాయి వస్తుంది, తన పని చేస్తుంది, సైలెంట్ గా వెళ్ళిపోతుంది, మాకేం ఇబ్బంది లేదు' అని తన గురించి అందరూ చెప్పేవారని వివరించింది. 

45
సిల్క్ స్మిత గురించి బాధపడతాను..

'సిల్క్ స్మిత తన పెళ్లి సమయంలో బొకేతో వచ్చి కారులో కూర్చుంది. ఇప్పటికీ సిల్క్ స్మిత గురించి బాధపడతానని.. అందరూ ఉన్నా.. ఆమె ఒంటరి అయి చనిపోయిందని' బాధపడింది జయమాలిని. ఇక తన వివాహం పెద్దలు నిశ్చయించిందని చెప్పింది. 1994లో తిరుపతిలో జరిగింది. 1995లో బాబు పుట్టాడని తెలిపింది.

55
చనిపోయే ముందు శ్రీదేవి కలిసింది..

తనను కోడలిగా స్వీకరించేందుకు మొదట మా అత్త ఇష్టపడకపోయినా, నా ప్రవర్తన, గుడికి తరచూ వెళ్లడం లాంటి వాటిని చూసి.. ఆమె తనను ఇష్టపడ్డారని జయమాలిని తెలిపింది. ఒకసారి అందరూ కలిసి గెట్-టుగెదర్‌ జరుపుకోవాలని అనుకున్నాం.. హీరోయిన్ శారద.. శ్రీదేవిని కూడా పిలవాలని అనడం ఆమె రావడం జరిగింది. ఆ తర్వాత ఆరు నెలల్లోనే ఆమె మరణించడం తనను ఎంతగానో కలచివేసిందని చెప్పింది. కృష్ణ, విజయనిర్మల దంపతుల మరణం కూడా తనకు చాలా బాధ కలిగించిందని తెలిపింది.

Read more Photos on
click me!

Recommended Stories