మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న పెద్ది చిత్ర ఢిల్లీ షెడ్యూల్ పూర్తయింది. ఈ మేరకు చిత్ర యూనిట్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఆ వివరాలు ఈ కథనంలో చూడండి.
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై దాదాపు 350 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాంచరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
25
దూసుకుపోతున్న చికిరి సాంగ్
ఇటీవల ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన చికిరి చికిరి అనే సాంగ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. రాంచరణ్ స్టెప్పులపై కొన్ని వేల రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతలా ఈ పాట ఆడియన్స్ కి నచ్చేసింది.
35
ఢిల్లీ షెడ్యూల్ కంప్లీట్
ఇటీవల చిత్ర యూనిట్ అత్యంత కీలకమైన షెడ్యూల్ కోసం ఢిల్లీ వెళ్లారు. రత్నవేలు ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎర్రకోట వద్ద అత్యంత కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు. తాజాగా చిత్ర యూనిట్ ఢిల్లీ షెడ్యూల్ పూర్తి అయినట్లు ప్రకటించింది.
అందుతున్న సమాచారం మేరకు ఢిల్లీ షెడ్యూల్ లో డైరెక్టర్ బుచ్చిబాబు గూస్ బంప్స్ తెప్పించే కొన్ని సన్నివేశాలని చిత్రీకరించారట. ఈ మేరకు డైరెక్టర్ బుచ్చిబాబు, రత్నవేలు మంచులో కూడా షూటింగ్ చేస్తున్న దృశ్యాలని పోస్ట్ చేశారు.
55
స్పోర్ట్స్ నేపథ్యంలో
ఈ చిత్రం స్పోర్ట్స్ నేపథ్యంలో రూరల్ డ్రామాగా తెరకెక్కుతోంది. రంగస్థలం తర్వాత అంతకన్నా మంచి గుర్తింపు, విజయం ఈ చిత్రంతో దక్కుతుందని రాంచరణ్ ముందు నుంచి నమ్మకంతో ఉన్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానుంది.