Madhavi Latha: నటి మాధవీలత మహిళల వస్త్రధారణపై కీలక వ్యాఖ్యలు చేసింది. సమాజం స్కిన్ షోను ఎలా ప్రోత్సహిస్తుందో ఆమె వివరించింది. అందంగా, స్టైలిష్‌గా డ్రెస్సులు ధరించాలని.. అయితే అసభ్యకరంగా ఉండకూడదని సూచించింది.
నటి మాధవీలత మహిళల వస్త్రధారణ, సామాజిక పోకడలు, తన సినీ కెరీర్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలు ఏ బట్టలు వేసుకోవాలి, ఎలా ఉండాలి అనే విషయాలపై మగవారు, ముఖ్యంగా సినీ హీరోలు కామెంట్స్ చేయడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆడవాళ్ల శరీర అవయవాలను సరుకు సామాన్లతో పోల్చడాన్ని తీవ్రంగా ఖండించింది.
25
స్టైలిష్‌గా, అందంగా దుస్తులు ధరించవచ్చు..
మహిళలు స్టైలిష్‌గా, అందంగా దుస్తులు ధరించవచ్చు. స్లీవ్‌లెస్, టోర్న్ జీన్స్ లాంటివి వేసుకోవచ్చని, కానీ అవి అసభ్యకరంగా ఉండకూడదని ఆమె స్పష్టం చేసింది. దుస్తులు తమ వ్యక్తిత్వానికి సరిపోవాలని, అందాన్ని పెంచేవిగా ఉండాలని, అసహ్యంగా కనిపించకూడదని మాధవీలత అభిప్రాయపడింది.
35
సమాజం స్కిన్ షో ప్రోత్సహిస్తోంది.?
సమాజం "స్కిన్ షో"ను ఎలా ప్రోత్సహిస్తుందో కూడా మాధవీలత తెలిపింది. కొంతమంది మహిళలు స్కిన్ షో చేస్తూ, సోషల్ మీడియాలో లైకులు, ఫాలోవర్లను పెంచుకోవడం ద్వారా వెబ్ సిరీస్‌లు, టీవీ, సినిమా ఆఫర్లను పొందుతున్నారని ఆమె పేర్కొంది. దీనికి సమాజంలోని ప్రజలు కూడా సహకరిస్తున్నారని, రిపోర్ట్ చేయకుండా లేదా బ్లాక్ చేయకుండా వారిని ప్రోత్సహిస్తున్నారని విమర్శించింది.
ఒక అమ్మాయిని మాత్రమే నిందించడం సరికాదని, ఈ పోకడకు సమాజం కూడా బాధ్యత వహించాలని నొక్కి చెప్పింది. కొందరు మొదట చీరలు కట్టుకొని, ఆ తర్వాత గ్లామర్ చూపించి ఫాలోవర్లు, కొలాబరేషన్లు, షాప్ ఓపెనింగ్ అవకాశాలు పొందుతున్నారని, పొట్టకూటి కోసం కొందరు ఇలా చేస్తుంటారని ఆమె తెలిపింది.
55
రాజకీయ ప్రస్థానం ఇలా..
తన రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుతూ.. తాను 2018లో బీజేపీలో చేరానని, 2019లో ఎన్నికలలో పోటీ చేశానని తెలిపింది. పార్టీ కార్యక్రమాలకు భౌతికంగా దూరమైనా, సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉంటానని చెప్పింది. హిందుత్వం తన పుట్టుకతో వచ్చిందని, పార్టీ వేరు, హిందుత్వం వేరని స్పష్టం చేసింది. ఇక సినీ కెరీర్ విషయానికొస్తే.. 2008లో అరంగేట్రం చేసి మొదటి సినిమాతోనే విజయం సాధించినప్పటికీ, ఆ తర్వాత సరైన ప్రాజెక్ట్‌లను ఎంచుకోవడంలో విఫలమయ్యానని అంగీకరించింది. తాను ఇండస్ట్రీని నిందించనని, తన ఎంపికలోనే లోపమని తెలిపింది. ప్రస్తుతం మంచి అవకాశాలు వస్తే, వెబ్ సిరీస్‌లు, వెబ్ మూవీస్, లేదా సినిమాలలో మళ్లీ నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని మాధవీలత స్పష్టం చేసింది.