మోహన్ బాబు విలన్ పాత్రలతో ఎంత గుర్తింపు పొందారో హీరోగా కూడా అదే స్థాయిలో రాణించారు. పెదరాయుడు, మేజర్ చంద్రకాంత్, అసెంబ్లీ రౌడీ లాంటి అద్భుతమైన చిత్రాలు మోహన్ బాబు కెరీర్ లో ఉన్నాయి. మోహన్ బాబు డైలాగ్ డెలివరీ అద్భుతం అనే చెప్పాలి. డైలాగ్స్ చెప్పడంలో ఆయనది ప్రత్యేకమైన టైమింగ్. బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన అసెంబ్లీ రౌడీ చిత్రంలో హీరోయిన్ విషయంలో ఒక సంఘటన జరిగింది.