ఈ ఫోటో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి ఆందోళన కలిగించేలా చర్చనీయాంశం అయింది. అందుకు కారణం ఎన్టీఆర్ షాకింగ్ లుక్ లో కనిపించడమే. తారక్ చాలా బక్క పలచకగా మారిపోయి కనిపిస్తున్నారు. ముఖంలో మార్పులు కనిపిస్తున్నాయి. దీంతో ఎన్టీఆర్ కి ఏమైంది అంటూ ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది. కొన్ని పుకార్లు కూడా మొదలయ్యాయి.
తారక్ బరువు తగ్గడం కోసం ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా ? మెడిసిన్ వాడుతున్నారా? అనే చర్చ మొదలైంది. మరికొందరైతే తారక్ సన్నగా అవడం కోసం ఓజెంపిక్ మెడిసిన్ వాడుతున్నారు అంటూ రూమర్స్ క్రియేట్ చేశారు. దీనితో తారక్ ఫ్యాన్స్ ఈ రూమర్స్ ని తిప్పి కొడుతున్నారు. ఎన్టీఆర్ టీం నుంచి కూడా క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది.