జాట్ 7వ రోజు కలెక్షన్స్
దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన సన్నీ డియోల్ 'జాట్' సినిమా విడుదలైన ఏడవ రోజు అంటే బుధవారం నాడు అతి తక్కువ వసూళ్లు సాధించింది.
`జాట్` 7వ రోజు కలెక్షన్స్
ట్రేడ్ ట్రాకర్ వెబ్‌సైట్ sacnilk.com నివేదిక ప్రకారం, బుధవారం 'జాట్' సుమారు 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సినిమా విడుదలైనప్పటి నుండి ఇంత తక్కువ వసూళ్లు ఏ రోజూ రాలేదు.
జాట్ రోజు కలెక్షన్స్
వీక్ డేస్ కావడంతో ఐదవ రోజు నుంచే సినిమా వసూళ్లలో భారీ పతనం మొదలైంది. సోమవారం ఈ సినిమా ఆదివారం కంటే 48.21 శాతం తక్కువగా 7.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది, అయితే మంగళవారం దాని వసూళ్లు 6 కోట్ల రూపాయలు, ఇది సోమవారం కంటే 17.24 శాతం తక్కువ. ఓవరాల్‌గా ఇప్పటి వరకు ఏడు రోజులకు ఈ మూవీ 58కోట్లు వసూళు చేసింది. ఇవి సన్నీ డియోల్ గత చిత్రం `గదర్2` సినిమా ఒక్క రోజు కలెక్షన్లతో సమానం.
గదర్ 2 కలెక్షన్స్
సన్నీ డియోల్ గత చిత్రం `గదర్ 2` దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ప్రారంభం రోజే అది దుమ్మురేపింది. క్రమంలో పెరుగుతూవచ్చింది. ఈ చిత్రం గురువారం (ఆగస్టు 11) అంటే విడుదలైన రోజు 40 కోట్ల రూపాయలు వసూలు చేసింది. శుక్రవారం (రెండవ రోజు) దాని వసూళ్లు 43 కోట్ల రూపాయలు. శనివారం (మూడవ రోజు) ఆదివారం (నాల్గవ రోజు) వరుసగా 55 కోట్లు , 38 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది.
గదర్ 2- 7వ రోజు కలెక్షన్స్
`గదర్ 2` సినిమా మొత్తం వసూళ్ల గురించి మాట్లాడితే, 7 రోజుల్లో ఇది భారతదేశంలో 228.98 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా సినిమా వసూళ్లు 283.35 కోట్ల రూపాయలు దాటాయి.
గదర్ 2 తారాగణం
`గదర్ 2` సినిమా బడ్జెట్ దాదాపు 60 కోట్ల రూపాయలు అని చెబుతున్నారు. ఇతర తారాగణం గురించి మాట్లాడితే, సన్నీ డియోల్ కాకుండా, ఈ చిత్రంలో అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ, మనీష్ వాధ్వా, సిమ్రత్ కౌర్, గౌరవ చోప్రా, లవ్ సిన్హా కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు.
అనిల్ శర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ రెండేళ్ల క్రితం వచ్చి ఏకంగా 691కోట్ల వసూళ్లని రాబట్టింది. కానీ ఇప్పుడు `జాట్` మూవీ లైఫ్ టైమ్ మొత్తం కనీసం వంద కోట్లకు కూడా రీచ్అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
read more: చిరంజీవి, బాలకృష్ణతో ఇక లైఫ్‌లో సినిమా చేయను, విజయశాంతి సంచలన స్టేట్‌మెంట్.. కారణం ఏంటంటే?