bhanupriya
Bhanupriya : భానుప్రియ ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలిగిన నటి. `సితార`గా తెలుగు ఆడియెన్స్ హృదయాల్లో స్థానం సంపాదించారు. ఇప్పుడున్న సీనియర్ టాప్ హీరోలందరితోనూ కలిసి నటించారు. ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. గ్లామరస్‌గానూ, ట్రెడిషనల్‌గానూ చేసి మెప్పించారు. ఎక్కువగా సంప్రాదాయలకు పెద్ద పీఠ వేస్తూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు.
bhanupriya
భానుప్రియ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కథా బలం ఉన్న చిత్రాలు, తన పాత్రకు ప్రయారిటీ ఉన్న మూవీస్ మాత్రమే చేస్తుంది. అది కూడా అరుదుగా. అయితే కొన్ని సినిమాలు చేసి తప్పు చేశానని తెలిపారు భాను ప్రియ. ఆ సినిమాల విషయంలో తనకు చెప్పిందొకటి చేసిందొకటని, తన పాత్రకు ప్రయారిటీ లేదని చెప్పింది. వాటిని ఇష్టం లేకపోయినా చేశానని తెలిపింది.
natyam movie
భానుప్రియ చేసి తప్పు చేశానని బాధపడిన మూవీ ఇటీవల వచ్చిన `నాట్యం`(2021). రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించిన ఈ మూవీలో క్లాసికల్ డాన్సర్ సంధ్యా రాజు ప్రధాన పాత్ర పోషించారు. సినిమాని నిర్మించారు. ఇందులో సంధ్యారాజు తల్లి పాత్రలో భాను ప్రియ నటించారు.
కానీ తన పాత్రకు పెద్దగా ప్రయారిటీ లేదని, కథ చెప్పినప్పుడు పాత్ర బాగుంటుందని,ఇలా అలా అని చాలా చెప్పారని, తీర సెట్‌కి వెళితే తన పాత్రను చూసుకుని ఆశ్చర్యపోయినట్టు తెలిపింది.