Ram Charan, Mahesh Babu
Ram Charan and Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో SSMB29 చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ పాన్ వరల్డ్ చిత్రంగా తెరకెక్కుతోంది. మహేష్ బాబుతో ఎక్కువగా వర్క్ చేసిన దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. వీరిద్దరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా, గుంటూరు కారం చిత్రాలు తెరకెక్కాయి.
ఖలేజా చిత్రం మహేష్ అభిమానులకు పెద్ద డిజప్పాయింట్మెంట్ ఇచ్చింది. అప్పట్లో భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం వర్కౌట్ కాలేదు. ఖలేజా గురించి ఒక షాకింగ్ విషయాన్ని మహేష్ బాబు రివీల్ చేశారు. రాంచరణ్ నటించిన ఒక బ్లాక్ బస్టర్ చిత్ర ప్రభావం ఖలేజాపై పడిందట. ఆ మూవీ ఇంకేదో కాదు ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ మగధీర. అప్పట్లో మహేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. యాంకర్ నుంచి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.
టాలీవుడ్ లో ఫస్ట్ కౌబాయ్ అంటే సూపర్ స్టార్ కృష్ణ మాత్రమే. నాన్నగారి తర్వాత గుర్రం పేటెంట్స్ మీవే కదా.. కానీ ఖలేజా చిత్రంలో ఇంట్రడక్షన్ ఫైట్ లో గుర్రంపై వెళ్లకుండా బైక్ పై ఎందుకు వెళ్లారు. అది ఫ్యాన్స్ కి నిరాశగా అనిపించింది అని యాంకర్ అడిగారు. దీనితో మహేష్ బాబు నిజాయతీగా సమాధానం ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ కూడా పాల్గొన్నారు. త్రివిక్రమ్ అనుమతితో దాని గురించి మొత్తం చెప్పేస్తున్నా సార్ అని అన్నారు.
Mahesh Babu
వాస్తవానికి గుర్రాలతోనే ఆ సీన్ డిజైన్ చేశాం. హీరో ఫైట్ చేశాక వాటర్ తీసుకుని గుర్రంపై జంప్ చేసి వెళ్ళిపోతాడు. అక్కడ గుర్రాలతో ఛేజింగ్ ఉంటుంది. కానీ అప్పుడే మగధీర చిత్రం రిలీజ్ అయింది అని మహేష్ బాబు అన్నారు. వెంటనే త్రివిక్రమ్ స్పందిస్తూ గుర్రం పేటెంట్స్ మారిపోయాయి అని సరదాగా అన్నారు. మహేష్ మాట్లాడుతూ మగధీర అన్ బిలీవబుల్ మూవీ. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అది అందరం అంగీకరించాలి. ఆ మూవీలో గుర్రాల సన్నివేశం అద్భుతంగా ఉంటుంది.
Ram Charan
నేను వెంటనే త్రివిక్రమ్ గారికి ఫోన్ చేసి ఇప్పుడు మనం కూడా గుర్రాల సన్నివేశం పెడితే బాగోదు. దానిని మార్చుదాం అని చెప్పా. దానికోసం ఏం చేద్దాం అని ఆలోచిస్తుండగా.. సార్ నేను గుర్రం పై జంప్ చేయడానికి ట్రై చేసి కిందపడిపోతాను. గుర్రం వెళ్ళిపోతుంది. అప్పుడు హీరోకి ఇసుకలో బైక్ హ్యాండిల్ కనిపిస్తుంది. ఆ బైక్ తో హీరో పారిపోతాడు అని చెప్పా. అది త్రివిక్రమ్ కి బాగా నచ్చిందట. వెంటనే అప్పటికప్పుడు ఒక కొత్త బైక్ కొని దానిని పాత దానిలాగా మార్చేశాం అని త్రివిక్రమ్ అన్నారు.