మొదటి సినిమాకు లక్ష... ఇప్పుడు 10 వేల కోట్లకు యజమానురాలు, రాయల్‌ లైఫ్‌ని లీడ్‌ చేస్తోన్న ఈ హీరోయిన్‌ ఎవరో తెలుసా?

Published : May 09, 2026, 07:02 PM IST

Asin Networth: తొలి సినిమాకు లక్ష రూపాయల జీతం తీసుకున్న ఓ హీరోయిన్, పెళ్లి తర్వాత ఏకంగా 10 వేల కోట్ల సామ్రాజ్యానికి మహారాణి అయింది. ఆ నటి ఎవరో కాదు, ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలిగిన అసిన్.

PREV
14
అసిన్‌ ఫస్ట్ మూవీ పారితోషికం

కేరళకు చెందిన అసిన్, చాలా చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చింది. `అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి` చిత్రంతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.  ఆ సినిమాకు ఆమె తీసుకున్న పారితోషికం కేవలం లక్ష రూపాయలు. కానీ పెళ్లి తర్వాత ఆమె ఏకంగా 10 వేల కోట్ల ఆస్తికి యజమానురాలైంది.

24
అసిన్‌ చేసిన తెలుగు, తమిళ చిత్రాలు

తెలుగులో అసిన్‌ `శివమణి`, `లక్ష్మీ నరసింహ`, `చక్రం`, `ఘర్షణ`, `అన్నవరం` వంటి చిత్రాల్లో నటించింది. అలాగే తమిళంలో వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. 'గజినీ', 'శివకాశి',  'పోకిరి', 'వేల్' వంటి చిత్రాలు ఆమె మార్కెట్‌ను అమాంతం పెంచేశాయి. ముఖ్యంగా 'దశావతారం' సినిమాలో ఆమె నటనకు గొప్ప ప్రశంసలు దక్కాయి. అసిన్ కెరీర్‌లో ఆమె తండ్రి పాత్ర చాలా కీలకమని, కథల ఎంపికలో ఆయనే జాగ్రత్తలు తీసుకునేవారని చెబుతారు.

34
వ్యాపారవేత్తతో అసిన్‌ పెళ్లి
కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ద్వారా అసిన్‌కు వ్యాపారవేత్త రాహుల్ శర్మ పరిచయమయ్యారు. ఆయన మైక్రోమ్యాక్స్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు, పెద్ద బిజినెస్‌మ్యాన్ అని తెలిశాక అసిన్ ఆశ్చర్యపోయిందట. స్నేహంగా మొదలైన వారి బంధం ప్రేమగా మారింది. ఆ తర్వాత 2016లో ఇరు కుటుంబాల అంగీకారంతో అసిన్, రాహుల్ శర్మ పెళ్లి చేసుకున్నారు.
44
పదివేల కోట్లకు అధిపతి అసిన్‌.

పెళ్లి తర్వాత అసిన్ పూర్తిగా ఫ్యామిలీ లైఫ్‌ పైనే దృష్టి పెట్టింది. స్టార్ హీరోల సరసన అవకాశాలు వచ్చినా, వాటిని ఆమె ఒప్పుకోలేదు. ఈ దంపతులకు ఒక కూతురు ఉంది. కొన్నేళ్ల క్రితం వీరిద్దరూ విడిపోతున్నారని పుకార్లు రాగా, అవన్నీ అబద్ధాలని సోషల్ మీడియా ద్వారా అసిన్ స్పష్టత ఇచ్చి రూమర్లకు ఫుల్‌స్టాప్ పెట్టింది. అయితే ఇప్పుడు అసిన్‌ లగ్జరీ లైఫ్‌ని అనుభవిస్తుంది. ఆమె భర్త వేల కోట్లకు అధిపతి. పది వేలకోట్లకుపైగానే ఆయనకు ఆస్తులుంటాయట. దీంతో అసిన్‌ కూడా రిచ్‌ అయిపోయింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories