Prime Video: ఒక్కసారిగా అందరినీ తొక్కిపడేసిన అడివి శేష్.. ప్రైమ్ వీడియోలో టాప్ 5 మూవీస్ ఇవే

Published : May 09, 2026, 06:11 PM IST

ప్రైమ్ వీడియోలో అడివి శేష్ నటించిన 'డెకాయిట్' సినిమా భారీ వ్యూస్‌తో టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రంతో పాటు గ్లోబల్ హిట్ సిరీస్ 'ది బాయ్స్ సీజన్ 5', క్రైమ్ డ్రామా 'మట్కా కింగ్' వంటి ఆసక్తికరమైన సిరీస్ లు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

PREV
16
ప్రైమ్ వీడియోలో టాప్ 5 మూవీస్

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ బాక్సాఫీస్ వద్దే కాదు, ఓటీటీలో కూడా సత్తా చాటుతున్నాడు. రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఆయన చిత్రం 'డెకాయిట్' (Dacoit) భారీ వ్యూస్‌తో దూసుకుపోతోంది. దీంతో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు కూడా ఇప్పుడు ప్రైమ్‌లో ట్రెండ్ అవుతున్నాయి.

26
డెకాయిట్ (Dacoit: A Love Story)

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ గ్రిప్పింగ్ యాక్షన్ డ్రామా ఇప్పుడు టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ఒక భారీ దోపిడీ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. శేష్ మార్క్ స్క్రీన్ ప్లే, ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. థియేటర్స్ లో పర్వాలేదనిపించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. వచ్చీ రాగానే అన్ని సినిమాలని వెనక్కి నెట్టి ప్రైమ్ వీడియోలో టాప్ ట్రెండింగ్ లోకి వెళ్ళింది.

36
ఎల్ఐకె (L.I.K - Love Insurance Kompany)

ప్రదీప్ రంగనాథన్ హీరోగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ యువతను బాగా ఆకట్టుకుంటోంది. భవిష్యత్తులో ప్రేమకు కూడా ఇన్సూరెన్స్ ఉంటే ఎలా ఉంటుంది అనే వెరైటీ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. కృతీ శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఫన్ అండ్ ఎంటర్టైనింగ్‌గా సాగుతుంది.

46
మట్కా కింగ్ (Matka King)

విజయ్ వర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ క్రైమ్ డ్రామా సిరీస్ ఇప్పుడు హాట్ టాపిక్. 1960ల నాటి ముంబై నేపథ్యంలో, జూదం (Matka) సామ్రాజ్యాన్ని ఒక సామాన్యుడు ఎలా ఏలాడు అనే కథాంశంతో ఇది రూపొందింది. రా అండ్ రస్టిక్ గా ఉండే ఈ సిరీస్ క్రైమ్ థ్రిల్లర్ ఇష్టపడే వారికి బెస్ట్ ఛాయిస్.

56
సప్నే వర్సెస్ ఎవ్రీవన్ (Sapne Vs Everyone)

రియలిస్టిక్ డ్రామా అంటే ఇష్టపడే వారికి ఈ సిరీస్ ఒక వరం. మధ్యతరగతి కుర్రాళ్ల కలలు, వారు ఎదుర్కొనే సవాళ్లు, సమాజంతో చేసే పోరాటాన్ని చాలా ఎమోషనల్‌గా చూపించారు. యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సిరీస్, ఇప్పుడు ప్రైమ్ లో కూడా మంచి వ్యూయర్ షిప్ సంపాదిస్తోంది.

66
ది బాయ్స్ - సీజన్ 5 (The Boys)

ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది అభిమానులు ఎదురుచూస్తున్న 'ది బాయ్స్' సీజన్ 5 ఇప్పుడు ప్రైమ్ వీడియోలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సూపర్ హీరోల ముసుగులో ఉన్న అసలు విలన్లను ఎదిరించే ఈ సిరీస్, దాని వైల్డ్ యాక్షన్, ట్విస్టులతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories