విభిన్న భాషల చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు చేరువ చేస్తూ అన్నపూర్ణ స్టూడియోస్ పంపిణీ రంగంలో విస్తరిస్తోంది. సెప్టెంబర్‌లో ఐ యామ్ గేమ్, సర్దార్ 2, ఎపిక్ సహా పలు చిత్రాలు లైనప్‌లో ఉన్నాయి.
సినిమా పంపిణీ రంగంలో అన్నపూర్ణ స్టూడియోస్ తన కార్యకలాపాలను క్రమంగా విస్తరిస్తోంది. వివిధ భాషలకు చెందిన విభిన్నమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు చేరువ చేయడంపై సంస్థ ప్రత్యేక దృష్టి పెట్టింది. కథ, కంటెంట్‌కు ప్రాధాన్యం ఉన్న సినిమాలకు విస్తృత థియేట్రికల్ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో అన్నపూర్ణ స్టూడియోస్ తన డిస్ట్రిబ్యూషన్ పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తోంది.
25
ఇప్పటికే పలు భాషల చిత్రాల పంపిణీ
అన్నపూర్ణ స్టూడియోస్ ఇప్పటికే పలు చిత్రాల పంపిణీ ద్వారా తన ఉనికిని విస్తరించింది. మలయాళ చిత్రాలు ఎకో, బాలన్ ది బాయ్‌తో పాటు సూర్య నటించిన తమిళ చిత్రం కరుప్పును తెలుగు ప్రేక్షకులకు వీరభద్రుడు పేరుతో విడుదల చేసింది. అలాగే నాగార్జున తనయుడు అఖిల్ నటించిన లెనిన్ చిత్రాన్ని నిర్మించి రిలీజ్ చేశారు. విభిన్నమైన సినిమాలను ఆదరిస్తూ వాటికి మరింత విస్తృత థియేట్రికల్ రీచ్ కల్పించాలనే అన్నపూర్ణ స్టూడియోస్ ప్రయత్నాన్ని ఈ కార్యక్రమాలు ప్రతిబింబిస్తున్నాయి.
35
సెప్టెంబర్‌లో భారీ చిత్రాల లైనప్
సెప్టెంబర్ నెలకు అన్నపూర్ణ స్టూడియోస్ ఆసక్తికరమైన చిత్రాల లైనప్‌ను సిద్ధం చేసింది. దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ఐ యామ్ గేమ్, కార్తీ నటించిన సర్దార్ 2, ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ చిత్రాలు సంస్థ సెప్టెంబర్ విడుదలల జాబితాలో ఉన్నాయి. వీటిలో ఐయామ్ గేమ్, రంభ ఊర్వశి మేనకా ఆల్రెడీ రిలీజ్అయ్యాయి. ఈ చిత్రంలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంతో పాటు పంపిణీ బాధ్యతల్లోనూ భాగస్వామ్యం అవుతోంది.
అన్నపూర్ణ స్టూడియోస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ సినిమాలను ఎంతో అభిమానించే వారని, భాషతో సంబంధం లేకుండా మంచి సినిమాలను ఆదరిస్తారని తెలిపారు. ప్రేక్షకులకు కంటెంట్ కనెక్ట్ అయినప్పుడు సినిమాకు భాషాపరమైన అడ్డంకులు ఉండవని పేర్కొన్నారు. తాము నిజంగా పెద్ద తెరపై చూడదగినవిగా భావించే చిత్రాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా ప్రేక్షకులకు అందించాలనేదే తమ పంపిణీ కార్యక్రమం లక్ష్యమని ఆమె వివరించారు. అదే సమయంలో పారదర్శకమైన, స్థిరమైన పంపిణీ వ్యవస్థను నిర్మించడంపై కూడా దృష్టి పెట్టినట్లు తెలిపారు.
55
కమిషన్ ఆధారిత పంపిణీ
అన్నపూర్ణ స్టూడియోస్ విస్తరిస్తున్న పంపిణీ నెట్‌వర్క్ సంస్థ దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా కొనసాగుతోంది. కమిషన్ ఆధారిత పంపిణీ విధానాన్ని తిరిగి బలోపేతం చేయడంతో పాటు కథకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు మరింత మెరుగైన థియేట్రికల్ అవకాశాలు కల్పించాలన్నది సంస్థ లక్ష్యం. వివిధ భాషల నుంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు మార్కెట్‌కు తీసుకురావడంతో పాటు, పారదర్శకమైన పంపిణీ వ్యవస్థను అభివృద్ధి చేయాలనే పెద్ద లక్ష్యంలో భాగంగానే అన్నపూర్ణ స్టూడియోస్ ఈ విస్తరణను కొనసాగిస్తోంది.