భార్యతో పదేళ్ల ప్రేమను సెలబ్రేట్ చేసుకున్న రిషబ్ శెట్టి..బ్యూటిఫుల్ ఫోటోస్ వైరల్

Published : Jan 24, 2026, 10:06 PM IST

డివైన్ స్టార్ రిషబ్ శెట్టి, ప్రగతి శెట్టి తమ పదేళ్ల ప్రేమను సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ప్రత్యేక రోజున రిషబ్, తమ ప్రేమ ప్రయాణాన్ని 'జీవితంలోని అందమైన అద్భుతం', 'అత్యంత అందమైన చిత్రకథ' అని వర్ణించారు.

PREV
17
రిషబ్ శెట్టి, ప్రగతి శెట్టిల ప్రేమకు పదేళ్లు

డివైన్ స్టార్ రిషబ్ శెట్టి, ప్రగతి శెట్టిల ప్రేమకు జనవరి 23తో పదేళ్లు నిండాయి. ఈ వేడుకను రిషబ్ శెట్టి సైలెంట్‌గా జరుపుకున్నారు.

27
భార్య ప్రగతితో కలిసి

భార్య ప్రగతితో కలిసి చిన్న కేక్ కట్ చేసి ఈ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు.

37
అందమైన అద్భుతాల్లో ఒకటి

'సినిమానే జీవిత భాగస్వామి అనుకున్న నాకు, నా మొదటి సినిమా షోలోనే జీవిత భాగస్వామి కలవడం జీవితంలోని అందమైన అద్భుతాల్లో ఒకటి' అని రాసుకొచ్చారు.

47
ఈ బంధం జీవితాంతం

నీతో గడిపిన ప్రతి క్షణం ఒక అందమైన చిత్రకథలా అనిపిస్తుంది. ప్రేమలో పడి 10 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ బంధం జీవితాంతం కొనసాగాలి. అంటూ కొన్ని ఫోటోలు పంచుకున్నారు.

57
ఇద్దరు పిల్లలు

పదేళ్ల ప్రేమ వేడుకలు జరుపుకుంటున్న రిషబ్ శెట్టి, ప్రగతి శెట్టి దంపతులకు రణ్విత్, రాధ్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

67
సోషల్ మీడియాలో వీడియో

జనవరి 23న సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసిన రిషబ్, 'నా కోసం నిలిచిన ప్రేమకు దశాబ్ద కాలం' అని రాసుకొచ్చారు.

77
కాంతార చాప్టర్-1

కాంతార చాప్టర్-1 విజయం తర్వాత రిషబ్ శెట్టి తన దర్శకత్వంలో కొత్త సినిమా ప్రకటించలేదు. నటనపై దృష్టి పెట్టి, జై హనుమాన్, ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమాల్లో నటిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories