Ram Charan: పెద్ది చూశాను, అది చాలా తప్పు అంటూ దుమ్మెత్తిపోసిన తమిళ నటి.. కారణం ఒక్కటే

Published : Aug 12, 2026, 12:26 PM IST

తమిళ నటి అదితి బాలన్ పెద్ది మూవీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక అంశంలో పెద్ది తనకు అస్సలు నచ్చలేదని పేర్కొన్నారు. ఆమె పెద్ది మూవీ విషయంలో ఎందుకు నిరాశ చెందారో ఈ కథనంలో తెలుసుకుందాం.

PREV
15
Aditi Balan

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన పెద్ది మూవీ జూన్ లో విడుదలై మంచి విజయం సాధించింది. రాంచరణ్ నటనకు ప్రశంసలు దక్కాయి. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ సంస్థ నిర్మించింది. లోకల్ గా తెలుగు రాష్ట్రాల్లో పెద్ది చిత్రం తిరుగులేని విజయం అందుకుంది కానీ.. ఓవర్సీస్ లో నిరాశ పరిచింది. ఈ చిత్రం రిలీజ్ అయినప్పుడు జాన్వీ కపూర్ పాత్ర ప్రజెంటేషన్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి.

25
జాన్వీ కపూర్ పాత్రపై విమర్శలు

జాన్వీ కపూర్ పాత్రని చూపించిన విధానం ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇబ్బంది కలిగించేలా ఉందని చాలా మంది అభిప్రాయపడ్డారు. దీనితో దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు చెప్పి జాన్వీ కపూర్ అభ్యంతరకర సన్నివేసాలని ట్రిమ్ చేశారు. తాజాగా తమిళ నటి అదితి బాలన్ పెద్ది మూవీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

35
అదితి బాలన్ సినిమాలు

అదితి బాలన్ రీసెంట్ గా ఎక్జామ్ అనే వెబ్ సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే. ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతున్న ఈ సిరీస్ కి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. అంతకు ముందు అదితి బాలన్ శాకుంతలం, కెప్టెన్ మిల్లర్, సరిపోదా శనివారం లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది.

45
జాన్వీ కపూర్ అని అలా చూపించడం చాలా తప్పు

అదితి రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహిళా నటీమణుల పాత్రల గురించి ఓపెన్ అయింది. నేను రీసెంట్ గా పెద్ది మూవీ చూశాను. అందులో జాన్వీ కపూర్ పాత్రని ఎందుకు రాశారో, అలా ఎలా రాశారో అర్థం కావడం లేదు. అసలు హీరోయిన్లకు అలాంటి పత్రాలు మాత్రమే ఇవ్వాల్సిన అవసరం ఏముంది ? జాన్వీ కపూర్ పాత్రని ఇంకా బాగా రాసి ఉండాల్సింది. ఆమెకి కూడా నటించే అవకాశం ఇచ్చి ఉండాల్సింది.

55
సమంత మా ఇంటి బంగారం బావుంది

జాన్వీ కపూర్ పాత్రని అలా చూపించడం చాలా పెద్ద తప్పు. హీరోయిన్ పాత్రని కేవలం సాంగ్స్ లో డ్యాన్స్ కోసం వచ్చి వెళ్లే విధంగా తీర్చిదిద్దకూడదు అని అదితి బాలన్ దుమ్మెత్తి పోశారు. సమంత మా ఇంటి బంగారం కూడా చూశాను. మహిళలకు కూడా అలాంటి పాత్రలు రాయడం సంతోషం. మహిళలకు కూడా స్టంట్స్, యాక్షన్ చేసే అవకాశం ఇస్తున్నారు అంటూ అదితి బాలన్ అభిప్రాయపడ్డారు.

Read more Photos on
click me!

Recommended Stories