Pawan Kalyan: మెగా ఫ్యామిలీలో కుర్ర హీరోలను ఒక ఆట ఆడుకున్నాడు వవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రామ్ చరణ్ తో పాటు వరుణ్ తేజ్ కూడా బ్లాక్ మెయిట్ చేసి ఆయన ఏం చేసేవాడో తెలుసా? రీసెంట్ గా మెగా ప్రిన్స్ చెప్పిన సీక్రేట్ ఎంటి?
చిరంజీవి స్టార్ హీరో అయిన తరువాత తన తమ్ముళ్లు వాళ్ల పిల్లలు, తన తనయుడితో పాటు కూతుర్లను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. దాంతో అతి పెద్ద సి నిమా కుటుంబంగా మెగా ప్యామిలీ టాలీవుడ్ లోపేరు తెచ్చుకుంది. అయితే వీళ్లంతా సినిమాల్లోకి రాకముందు చెన్నైలో ఉన్న టైమ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ గ్రూప్ కు లీడర్ గా ఉండేవారు. పవన్ కూడా హీరో అవ్వకముందు చిరంజీవి ఇంట్లోనే ఉంటూ చదువుకునేవారు. అప్పుడు రామ్ చరణ్, వరుణ్ తేజ్, సుస్మిత, వీళ్లంతా చాలా చిన్న పిల్లలు కావడంతో పవన్ వారిని ఒక ఆట ఆడుకునేవారట బ్లాక్ మెయిల్ కూడా చేసేవారట.
24
వరుణ్ తేజ్ తో కాళ్లు పట్టించుకున్న పవన్ కళ్యాణ్..
రీసెంట్ గా వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు మూవీ ఈవెంట్ ఒకటి జరిగింది. దానికి చిరంజీవి ముఖ్య అథిదిగా హాజరయ్యారు. ఈవెంట్ లో వరుణ్ చిన్ననాటి పోటో ఒకటి స్క్రీన్ పై చూపించారు. అందులో పవన్ కళ్యాన్ కాళ్లు పట్టుకుని వరుణ్ తేజ్ కనిపించారు. పవన్ అభయంఇస్తున్నట్టు కనిపించారు. ఈ ఫోటోగురించి మాట్లాడుతూ.. ''పవన్ బాబాయ్ ఏదో ఒక అవసరం కోసం ఇలా బ్లాక్ మెయిట్ చేసేవారు. డబ్బులు కావచ్చు.. ఏదైనా కావచ్చు..మేం కూడా ఏదో అవసరం కోసంమే అలా కాళ్లు పట్టేవాళ్లు.. అప్పుడు చాలా సరదాగా ఉండేది'' అని వరుణ్ తేజ్ అన్నారు. వరుణ్ ను మాత్రమే కాదు గతంలో రామ్ చరణ్ ను కూడా పవన్ కళ్యాణ్ ఇలానే బ్లాక్ మెయిల్ చేసేవారు. గతంలో ఈ విషయాన్ని ఇంటర్యూలో పవన్ కళ్యాణ్ స్వయంగా ఒప్పుకున్నారు.
34
రామ్ చరణ్ దగ్గర పవన్ కళ్యాణ్ అప్పు..
పవన్-చరణ్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. హీరోలు కాకముందు బాబాయ్ అబ్బాయిలా కాకుండా మంచి ఫ్రెండ్స్ లా ఉండేవారట వీరు. పవన్ కళ్యాణ్ ఒకప్పుడు రామ్ చరణ్ దగ్గర అప్పు తీసుకున్నాడు! ఇది నిజమే. కానీ ఈ సంఘటన చాలా రోజుల క్రింతం జరిగింది. అప్పటికి పవన్ సినిమాల్లోకి రాలేదు, రామ్ చరణ్ అయితే ఇంకా చిన్నవాడు. మెగా కుటుంబం చెన్నైలో ఒకే ఇంట్లో నివసిస్తుండగా, పవన్ ఖాళీగా ఉండేవారు, పాకెట్ మనీ కోసం చిరంజీవి మీద ఆధారపడేవారు. చిరంజీవి ఇచ్చిన డబ్బులు అయిపోతే, చరణ్‌కు ఇచ్చిన పాకెట్ మనీ నుంచి ఏదో ఒక కథ చెబుతూ డబ్బులు అడిగేవాడట.వడ్డీతో కలిపి ఇస్తానని చెప్పి చరణ్ దగ్గర డబ్బులు తీసుకునేవాడట పవన్. డబ్బులు ఎక్కువ వస్తాయి కదా అని చరణ్ కూడా ఇచ్చేసేవాడట. కాని ఆతరువాత డబ్బులు అడిగితే ఏదో ఒక మాయచేసేవారని వారు నవ్వుతూ గుర్తు చేసుకున్నారు. ఇది పవన్ స్వయంగా రామ్ చరణ్‌తో కలిసి పంచుకున్న జ్ఞాపకం.
చిన్నతనంలో చరణ్, వరుణ్ ఇద్దరు ఏదైనా అవసరం వస్తే పవన్ బాబాయ్ దగ్గరకు వెళ్లేవాడట. తమ తండ్రులతో ఏదైనా చెప్పే ధైర్యం లేకపోతే పవన్ ను అడిగేవారట. అయితే పవన్ కళ్యాణ్ ఊరికే సాయం చేయకుండా.. వారి దగ్గర డబ్బులు వసూలు చేసేవారట. అంతే కాదు చిన్న చిన్న పనులు చేయించుకోవడం లేదా ఆటపట్టించడం చేసేవారట.
వరుణ్ తేజ్ చిన్నప్పుడు చాలా పొడుగ్గా, బొద్దుగా ఉండేవాడు. వరుణ్ ఏవైనా అల్లరి పనులు చేసినా లేదా చెప్పిన మాట వినకపోయినా.. "నువ్వు సరిగ్గా చదువుకోకపోతే లేదా అల్లరి చేస్తే నిన్ను రౌడీలకు ఇచ్చేస్తా, లేదా హాస్టల్‌కు పంపించేస్తా" అని పవన్ కళ్యాణ్ భయపెట్టేవారట.
చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత , రామ్ చరణ్ మధ్య చిన్న చిన్న తగువులు కూడా పెట్టేవారట పవన్ . ఇద్దరికి ఒకరికి ఇంకొకరికి చాడీలు చెపుతూ గొడవలు పెట్టి నవ్వుకునేవాడట. అలా చిన్నతనంలో పవన్ కళ్యాణ్ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఈ విషయాలన్నీ ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మెగా ఫ్యామిలీలో తెరపై కనిపించే మాస్ ఇమేజ్ వెనుక చాలా సరదా సన్నివేశాలు చాలా ఉన్నాయి.