నివేదా థామస్ తెలుగులో నాని జెంటిల్ మాన్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నివేదా నటించింది. నిన్ను కోరి, జై లవకుశ, బ్రోచేవారెవరురా, 118, వకీల్ సాబ్ లాంటి హిట్ చిత్రాల్లో నివేదా నటించింది. హద్దులు దాటేలా నివేదా ఎప్పుడూ గ్లామర్ ప్రదర్శించలేదు. తన బ్యూటిఫుల్ లుక్స్, నటనతోనే ఫ్యాన్స్ ని మెప్పిస్తూ వచ్చింది. చివరగా నివేదా '35 చిన్న కథ కాదు' అనే చిత్రంలో నటించింది.