Suriya: ఏకంగా మూడుసార్లు సూర్యను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా ? కారణం ఏంటి?

Published : Nov 05, 2026, 08:06 AM IST

Suriya: హీరోలలో జెంటిల్ మెన్ ఇమేజ్ ఉన్న అతి కొద్దిమందిలో సూర్య ఒకరు. ఆయనతో సినిమా అంటే హీరోయిన్లు ఎగిరి గంతేస్తుంటారు. అటువంటి హీరోతో సినిమా ఆఫర్ వస్తే ఏకంగా మూడు సార్లు రిజెక్ట్ చేసింది ఓ హీరోయిన్. ఇంతకీ ఎవరామె? కారణం ఏంటి?

PREV
13
హీరో సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన సినిమాల విషయమై ఎప్పుడూ ప్రయోగాత్మక కథలతో ముందుకెళ్తూ ప్రేక్షకులను అలరిస్తుంటారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆయన తాజాగా నటించిన చిత్రం 'సీన్'. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా సూర్య పంచుకున్న కొన్ని ఆసక్తికర విషయాలు ప్రస్తుతం సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజిమ్‌తో తన అనుబంధం గురించి, ఆమె తన సినిమాలను రిజెక్ట్ చేసిన సందర్భం గురించి ఆయన స్వయంగా వెల్లడించారు.

23
సూర్య సినిమాను మూడుసార్లు రిజెక్ట్ చేసిన నజ్రియా

సాధారణంగా స్టార్ హీరోల సరసన నటించే అవకాశం వస్తే ఏ నటి అయినా వెంటనే అంగీకరిస్తారు. కానీ, నజ్రియా మాత్రం హీరో సూర్య నటించవలసిన సినిమాల ఆఫర్లను గతంలో ఏకంగా మూడు సార్లు సున్నితంగా తిరస్కరించినట్లు సూర్య తెలిపారు. గత 12 ఏళ్ల కాలంలో తమిళ పరిశ్రమలో పలు ప్రాజెక్ట్‌ల కోసం ఆమెను సంప్రదించినప్పటికీ, వివిధ వ్యక్తిగత - కథా పరమైన కారణాల వల్ల ఆమె ఆ అవకాశాలను అంగీకరించలేదని ఆయన గుర్తుచేసుకున్నారు.

అయితే, మంచి కథలను ఎంచుకోవడంలో నజ్రియా చూపించే ఆత్మవిశ్వాసాన్ని, స్పష్టతను సూర్య ఎంతగానో ప్రశంసించారు. కేవలం అవకాశాలు పోతాయని తొందరపడకుండా, తనకు నచ్చిన పాత్రలకే ఇంపార్టెన్స్ ఇవ్వడం వెనుక ఉన్న ఆమె నిర్ణయాలను సూర్య మెచ్చుకున్నారు. ఇక ఎట్టకేలకు నాలుగో ప్రయత్నంలో ఆమె తమ తాజా ప్రాజెక్ట్ 'సీన్' సినిమా చేయడానికి అంగీకరించిందని సూర్య సంతోషం వ్యక్తం చేశారు.

33
నజ్రియా స్పందన ఇదే

ఈ అంశంపై స్వయంగా నజ్రియా కూడా స్పందిస్తూ పలు ఆసక్తికర విషయాలను మాట్లాడారు. సుమారు 12 ఏళ్ల తర్వాత తాను మళ్లీ తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టడానికి ప్రధాన కారణం హీరో సూర్యగారే అని ఆమె వెల్లడించారు. గతంలో ఆయనతో నటించే అవకాశాలు వచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల వాటిని తిరస్కరించాల్సి వచ్చిందని, కానీ ఈసారి మాత్రం కథ నచ్చడంతో పాటు సూర్యతో కలిసి నటించే అవకాశం రావడంతో సంతోషంగా అంగీకరించినట్లు ఆమె తెలిపారు.

హ్యాట్రిక్ హిట్ కోసం సూర్య వెయింటింగ్

జీతూ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సూర్య సరసన నజ్రియా నజిమ్ నటిస్తోంది. అగరం స్టూడియోస్ , 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై జ్యోతిక, సూర్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. డిఫరెంట్ కథతో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రెండు సూపర్ హిట్లు చూసిన సూర్య.. ఈ సినిమాతో ఎలాగైనా హ్యాట్రిక్ హిట్ కొట్టాలని గట్టిగా ట్రై చేస్తున్నాడు. మరి ఈమూవీ ఎలాంటి రిజెల్ట్ చూపిస్తుందో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories