Priyanka Jain: ముఖేష్‌ లేకుండా ఊపిరి కూడా తీసుకోలేవు, సెన్స్ లేదు.. వర్షిణికి ప్రియాంక జైన్‌ మాస్‌ వార్నింగ్‌

Published : Nov 04, 2026, 09:22 PM IST

బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌ వర్షిని సౌందరాజన్‌కి మాజీ బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌ ప్రియాంక జైన్‌ మాస్‌ వార్నింగ్‌ ఇచ్చింది. ముఖేష్‌ లేకుండా ఊపిరి కూడా పీల్చుకోలేకపోతున్నావని, నీకు సెన్స్ లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

PREV
13
శివ కుమార్‌పై వర్షిణి కామెంట్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 10వ సీజన్‌ రచ్చ వేరే లెవల్‌ అని చెప్పొచ్చు. 8వ వారం ఎలిమినేషన్‌ అందరికి షాకిచ్చింది. ఈ క్రమంలో 9వ వారం నామినేషన్‌ ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. నామినేషన్ లో కామన్‌గా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తారు. వారి తప్పులను ఎత్తి చూపుతూ నామినేట్‌ చేస్తుంటారు. ఈ క్రమంలో శివ కుమార్‌పై వర్షిణి సంచలన వ్యాఖ్యలు చేసింది. నువ్వు మా అలయెన్స్ ని బ్రేక్ చేయడానికే వచ్చావని చెబుతూ, ఆయన తప్పులను ఎత్తి చూపింది. నామినేట్‌ చేసింది.

23
శివకుమార్‌కి సపోర్ట్ గా ప్రియాంక జైన్‌

ఈ నేపథ్యంలో దీనిపై ప్రియాంక జైన్‌ స్పందించింది. శివకుమార్‌, ప్రియాంక జైన్‌ బుల్లితెరపై కో ఆర్టిస్ట్ లు, లవర్స్. ప్రస్తుతం కలిసే ఉంటున్నారు. సహజీవనం చేస్తున్నారు. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని సమాచారం. ఈ క్రమంలో శివ కుమార్‌ వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెట్టాడు. తనదైన ఆటతో ఆకట్టుకుంటున్నాడు. అదే సమయంలో మంచి ఫైర్‌తో ఉన్నాడు. సర్‌, మేడం అంటూ కూల్‌ చేస్తూనే అదిరిపోయే కౌంటర్‌ ఇస్తున్నాడు. తన మార్క్ ని చూపిస్తున్నాడు. ఆయనకు ప్రియాంక సపోర్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వర్షిణిపై ప్రియాంక జైన్‌ రియాక్ట్ అయ్యింది. మాస్‌ వార్నింగ్‌ ఇచ్చింది.

33
వర్షిణికి ప్రియాంక జైన్‌ మాస్ వార్నింగ్‌

సోషల్‌ మీడియాలో వీడియో పెట్టింది. ఇందులో ఆమె చెబుతూ, `వర్షిణి నీకు సెన్స్ లేదు. నీకు సెన్స్ అనేదే లేదు. ముఖేష్‌ లేకుండా అందులో కనీసం ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నావ్‌. ఈ విషయం చెప్పడానికి నాకు ఎలాంటి షేమ్‌ ఫీలింగ్ లేదు. షేమ్‌గా ఫీలవ్వాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు నాకు ఎప్పుడు కలవకు, నేను కలవను, ఎప్పటికీ నిన్ను చూడను. నీ ఫేస్‌ ఎప్పటికీ నాకు చూపించకు` అంటూ అదిరిపోయే వార్నింగ్‌ ఇచ్చింది ప్రియాంక జైన్‌. ప్రస్తుతం ఆమె కామెంట్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అన్నట్టు ప్రియాంక జైన్‌ 7వ సీజన్‌లో బిగ్‌ బాస్‌ షోలో కంటెస్టెంట్ గా పాల్గొని టాప్‌ 5కి వెళ్లింది ప్రియాంకజైన్‌. ఇక ఇప్పుడు 9వ వారం నామినేషన్‌లో ముఖేష్‌, వంశీ, సుధీర్‌, వర్షిణి, నరేష్‌, దేబ్జానీ, అమన్‌, శివ కుమార్‌, రామ్ ప్రసాద్‌, నీతూ నటరాజ్‌ ఉన్నారు. వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారో చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories