సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరో.. మూడు సపర్ హిట్ సినిమాలతో.. ఏకంగా 18 ప్రభుత్వ చలనచిత్ర అవార్డులను సాధించి, రికార్డు క్రియేట్ చేశాడని మీకు తెలుసా? ఇంతకీ ఎవరా హీరో ?
ఫిల్మ్ ఇండస్ట్రీలో గెలుపోటములు సహజం. కానీ, అపజయాలను దాటి తన శ్రమకు, నాణ్యతకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందడమే అసలైన విజయం. అది సాధించిన హీరోలు చాాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో హీరో సూర్య ఇప్పుడు ఏక్కువ సాధించి రికార్డు కొట్టాడు. .
24
అవార్డుల వేటలో సూర్య 'హ్యాట్రిక్' మ్యాజిక్!
2016-2022 మధ్య వచ్చిన సినిమాలకు తమిళనాడు ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. సూర్య నటించిన మూడు చిత్రాలు 'సూరరై పోట్రు' (7), 'జై భీమ్' (7), '24' (4) కలిసి మొత్తం 18 అవార్డులు గెలుచుకున్నాయి. ఇది సరికొత్త రికార్డు అనిచెప్పాలి.
34
విమర్శలకు సమాధానమిచ్చిన గుర్తింపు
ఇటీవల సూర్య సినిమాలు కలెక్షన్ల పరంగా పెద్దగా ఆడలేదని విమర్శలు వచ్చాయి. కానీ, ఈ 18 అవార్డులు కలెక్షన్లను మించి సూర్య ఎంచుకునే కథల నాణ్యతను, ఆయన అంకితభావాన్ని చాటిచెప్పాయి.
ఈ వార్తతో పాటు, సూర్య తదుపరి చిత్రాలైన 'కర్పు', 'సూర్య 46', జీతూ మాధవన్ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అవార్డులతో పాటు, బాక్సాఫీస్‌ను కూడా సూర్య షేక్ చేస్తాడని కోలీవుడ్ టాక్.