స్టార్ హీరోతో మూవీ నిర్మించాలనుకుని అతడినే అల్లుడిగా చేసుకున్న డైరెక్టర్ కూతురు..ఆ సంఘటన తెలిసినప్పటికీ..

Published : Jul 12, 2025, 12:53 PM IST

ఒకప్పటి రచయిత, దర్శకుడు డివి నరసరాజు ఎన్నో అద్భుతమైన చిత్రాలకు పనిచేశారు. నరసరాజు కుటుంబంతో క్రేజీ హీరో సుమన్ కి అనుబంధం ఉంది.

PREV
15

ఒకప్పటి రచయిత, దర్శకుడు డివి నరసరాజు ఎన్నో అద్భుతమైన చిత్రాలకు పనిచేశారు. దర్శకుడిగా కంటే ఆయన రచయితగానే ఎక్కువ గుర్తింపు పొందారు. అప్పట్లో యుగంధర్, యమగోల, గుండమ్మ కథ, రంగులరాట్నం, రాజమకుటం, రాముడు భీముడు లాంటి చిత్రాలకు నరసరాజు రచయితగా పనిచేశారు.

నరసరాజు కుటుంబంతో క్రేజీ హీరో సుమన్ కి అనుబంధం ఉంది. నరసరాజు మనవరాలినే సుమన్ వివాహం చేసుకున్నారు. సుమన్ భార్య పేరు శిరీష తల్వార్. ఆమె నరసరాజు కుమార్తె బిడ్డ. శిరీష సుమన్ వివాహం చాలా డ్రమాటిక్ గా జరిగింది.

25

నరసరాజు కుమార్తె కవిత.. సుమన్ హీరోగా ఒక చిత్రం నిర్మించాలనుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా సుమన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అప్పటికే నాకు నరసరాజు గారితో పరిచయం ఉంది. నా కుమార్తె నీతో సినిమా నిర్మించాలని అనుకుంటోంది. ఒకసారి మీ ఇంటికి వస్తుంది మాట్లాడు అని ఆయన చెప్పారు. నేను ఓకే చెప్పాను. ఆమె మా ఇంటికి వచ్చి ఇలా తనతో సినిమా నిర్మించాలని ఉన్నట్లు చెప్పారు. తప్పకుండా చేస్తాను కానీ దర్శకుడిని మీరే ఎంచుకోండి అని చెప్పాను.

35

ఆ విధంగా కొన్ని రోజులపాటు సినిమా గురించి మా మధ్య చర్చలు జరిగాయి. నేను వాళ్ళ ఇంటికి వెళ్లడం.. వాళ్లు మా ఇంటికి రావడం జరుగుతూ ఉండేది. సినిమా అయితే ఆలస్యం అవుతూనే ఉంది కానీ మా రెండు కుటుంబాల మధ్య అనుబంధం బాగా పెరిగింది. అదే టైంలో కవిత తన కుమార్తె శిరీషకి వివాహం చేయాలని అనుకుంటున్నారు.

45

నా గురించి వాళ్ళకి తెలుసు.. కాబట్టి శిరీషని నాకే ఇచ్చి చేయాలని అనుకున్నారు. పెళ్లి ప్రపోజల్ వాళ్ల నుంచే వచ్చింది. అప్పటికి శిరీష తో నాకు ఎలాంటి పరిచయం లేదు. నా జీవితంలో జరిగిన జైలు సంఘటన గురించి కూడా వాళ్లకి తెలుసు. నేను ఏ తప్పు చేయలేదని వాళ్లు నమ్మారు. అందుకే శిరీష ని నాకు ఇచ్చే వివాహం చేయాలని అనుకున్నారు. మంచి కుటుంబం కావడంతో నేను కూడా ఓకే చెప్పాను అని సుమన్ అన్నారు.

55

ఆసక్తికర విషయం ఏంటంటే సినిమా కోసం మా ప్రయాణం మొదలైంది. కానీ ఆ సినిమా అసలు ప్రారంభంకానే లేదు. ఆమె కుమార్తెతో పెళ్లి మాత్రం జరిగింది. నాతో సినిమా నిర్మించాలని అనుకున్న కవిత గారు నన్ను అల్లుడుగా చేసుకున్నారు అని సుమన్ తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories