ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో హిట్ సినిమాలు చేసి స్టార్‌డమ్‌ను అందుకున్నప్పటికీ, వ్యక్తిగత జీవితంలో మాత్రం కొందరు హీరోయిన్లు వివాహ బంధానికి దూరంగా ఉండిపోతుంటారు. అలాంటి వారిలో స్టార్ నటి నగ్మా ఒకరు. ఆమె 50 ఏళ్లు దాటినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. అయితే ఆమెపై లవ్ రూమర్లు మాత్రం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాయి.
నగ్మా ఒకప్పుడుఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా వెలిగింది. బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ సరసన 1990లో విడుదలైన బాగీ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె, ఆ వెంటనే సౌత్ సినిమాల్లోకి కూడా ప్రవేశించింది. మరీ ముఖ్యంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరితో నటించి హిట్ సినిమాలు చేసింది నగ్మ.
తెలుగుతో పాటు సౌత్ లో తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ క్రేజ్ సంపాదించింది. తెలుగులో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో నటించిన నగ్మా, భాషా, రిక్షావోడు, రౌడీ అల్లుడు వంటి బ్లాక్‌బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది.