వాళ్ళంటేనే ఇష్టం, గెస్ట్ రోల్ కి కూడా పనికిరానా, ఆర్ ఆర్ ఆర్ లో ఎందుకు తీసుకోలేదు, రాజమౌళిని నిలదీసిన ప్రభాస్

First Published | Nov 29, 2024, 10:50 AM IST

దర్శకుడు రాజమౌళిని హీరో ప్రభాస్ పబ్లిక్ లో నిలదీశాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఆర్ ఆర్ ఆర్ చేస్తున్నప్పుడు, నాకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు. కనీసం గెస్ట్ రోల్ అయినా చేసేవాడిని కదా అన్నారు. అందుకు రాజమౌళి సమాధానం ఇదే 
 

RRR Movie

బాహుబలి 2 అనంతరం రాజమౌళి మల్టీస్టారర్ ప్లాన్ చేశాడు. బ్రిటిష్ కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కించారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్ ఆర్ ఆర్ ఆర్. ఈ ఇద్దరు హీరోలు కలిసి మూవీ చేస్తున్నారన్న న్యూస్ అప్పట్లో సంచలనం. 

కొణిదెల-నందమూరి హీరోల మధ్య దశాబ్దాలుగా ఫ్యాన్ రైవల్రీ ఉంది. ఆ రెండు కుటుంబాల హీరోలు స్క్రీన్ షేర్ చేసుకుంటారని ఊహించలేదు. అదే సమయంలో సందేహాలు కూడా తలెత్తాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ లలో ఎవరి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. రాజమౌళి ఎవరి పాత్ర హైలెట్ చేస్తాడనే ఉత్కంఠ నెలకొంది. 

ఏమాత్రం తేడా జరిగినా ఫ్యాన్ వార్స్ పీక్స్ లో ఉంటాయి. అందుకే రాజమౌళి ఇద్దరి పాత్రలకు సమానమైన స్క్రీన్ స్పేస్, ఇంపార్టెన్స్ ఉండేలా జాగ్రత్త పడ్డారు. అయినప్పటికీ వివాదాలు తప్పలేదు. ఆర్ ఆర్ ఆర్ విడుదలై రెండేళ్లు దాటిపోయినా కూడా అప్పుడప్పుడు ఆర్ ఆర్ ఆర్ కేంద్రంగా ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తిట్టుకుంటూ ఉంటారు. 
 


కాగా ఆర్ ఆర్ ఆర్ వరల్డ్ వైడ్ రూ. 1200 కోట్లకు పైగా వసూలు చేసింది. గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులు సొంతం చేసుకుంది. జపాన్ లో ఈ చిత్రానికి విశేష ఆదరణ దక్కింది. వందల రోజులు థియేటర్స్ లో ఆడింది. అయితే ఈ చిత్రంలో తనకు అవకాశం ఇవ్వనందుకు ప్రభాస్ చాలా నొచ్చుకున్నాడట. తన అసహనాన్ని ఒకసారి రాజమౌళి ముందు నేరుగా బయటపెట్టాడు ప్రభాస్. పబ్లిక్ లో అడిగేశాడు. 

రాధే శ్యామ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్-రాజమౌళి ఒక స్పెషల్ చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చరణ్, తారక్... ఇద్దరు సూపర్ స్టార్స్ ని పెట్టుకుని ఆర్ ఆర్ ఆర్ చేస్తున్నారు. నన్ను గెస్ట్ అప్పీరెన్స్ గా చేయమని అడగాలని మీకు అనిపించలేదా?. నేను, చరణ్, తారక్ ముగ్గురు కనిపిస్తే బాగుండేది కదా. 

Prabhas

మీకు ఆ ఆలోచన రాలేదా, నాతో చేయాలని అనిపించలేదా?. మీ ఆర్ ఆర్ ఆర్ విజన్ లో నేను ఎక్కడా కనపడలేదా?.. అని అన్నారు. ఈ ప్రశ్నకు రాజమౌళి సమాధానంగా.. నువ్వు పెద్ద షిప్ లాంటోడివి. ఆ సీన్ లోకి షిప్ వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది అంటే షిప్ ని తీసుకొస్తాం. మనం అడిగితే ప్రభాస్ చేస్తాడు కాబట్టి, నిన్ను పెడితే సినిమా బాగోదు. సినిమాకు నువ్వు కావాలి అనుకుంటే, నిన్ను ఎలాగైనా తీసుకొస్తాను కదా.. అన్నారు. 

ప్రభాస్ మళ్ళీ మాట్లాడుతూ.. నాకంటే నీకు చరణ్, తారక్ అంటే ఎక్కువ ఇష్టం అని అర్థమైంది. గతంలో కూడా తారక్ మీదే మీరు రెండు మూడు కథలు చెప్పేవారు, అన్నారు. ఈ మాటకు రాజమౌళి.. నేను ఏ హీరోలతో సినిమా చేస్తున్నానో అప్పటికి వాళ్లే నాకు అందరి కంటే ఇష్టం, అని అన్నాడు. గతంలో జరిగిన ఈ సంభాషణకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. 

Latest Videos

click me!