అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాల పెళ్లి వేడుక మరో 5 రోజుల్లో జరగబోతోంది. ఆల్రెడీ మ్యారేజ్ సెలెబ్రేషన్ మొదలయ్యాయి. రెండేళ్లుగా ప్రేమించుకుంటున్న చైతన్య, శోభిత వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. పెళ్లి వేడుక అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగనుంది. డిసెంబర్ 5న రాత్రి 8 గంటల 13 నిమిషాలకు పండితులు ముహూర్తం నిర్ణయించారు.
సమంతతో విడిపోయాక చైతు.. శోభిత ప్రేమలో పడ్డాడు. శోభిత కూడా తెలుగు అమ్మాయే. తెనాలిలో పుట్టిన శోభిత వైజాగ్ లో చదువుకుంది. ఆ తర్వాత మోడలింగ్ కోసం ముంబై వెళ్ళింది. ప్రస్తుతం ఆమె సౌత్ తో పాటు బాలీవుడ్ చిత్రాల్లో సైతం నటిగా రాణిస్తోంది. ఇద్దరి మనసులు కలవడంతో పెళ్లి చేసుకుని తమ రిలేషన్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం జరిగింది.
తాజాగా పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులు శోభిత, చైతన్యకి హల్దీ వేడుక నిర్వహించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శోభిత సిగ్గు మొగ్గలేస్తూ ఫుల్ హ్యాపీగా కనిపిస్తోంది. ఆమె ధరించిన రెడ్ కలర్ శారీ చాలా అందంగా ఉంది. నాగ చైతన్య మాత్రం సింపుల్ గా కుర్తా పైజామా ధరించి కనిపిస్తున్నాడు.
కుటుంబ సభ్యులు సంప్రదాయం ప్రకారం వధూవరులకు మంగళస్నానాలు చేయించారు. కుటుంబ సభ్యులు ఇద్దరిపై పూల వర్షం కురిపిస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. చైతన్య కోరిక ప్రకారం పెళ్లి సింపుల్ గా చేయనున్నట్లు నాగార్జున ప్రకటించారు. కానీ చూస్తుంటే పెళ్లి సింపుల్ గా కాదు.. గ్రాండ్ గానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
చైతు శోభిత పెళ్లి వేడుకకి కుటుంబ సభ్యులు, మిత్రులు, సినీ రాజకీయ ప్రముఖులు మొత్తం 300 మంది హాజరు కానున్నారట. చైతూతో పెళ్లి కోసం శోభిత పూర్తి పేరుని లక్ష్మి శోభిత అని నిర్ణయించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. నిశ్చితార్థం జరిగిన తర్వాత శోభిత అక్కినేని ఫ్యామిలిలో బాగా కలిసిపోయింది. ప్రతి ఈవెంట్ లోనూ కుటుంబ సభ్యులతో కనిపిస్తోంది. అక్కినేని నేషనల్ అవార్డ్స్ ఈవెంట్ లో, ఐఎఫ్ఎఫ్ఐ ఈవెంట్ లో శోభిత అక్కినేని ఫ్యామిలీతో కలసి సందడి చేసిన సంగతి తెలిసిందే.