Sivaji: సామాన్లు కనపడేలా బట్టలు వేసుకోకండి... అమ్మాయిల దుస్తులపై శివాజీ షాకింగ్ కామెంట్స్

Published : Dec 23, 2025, 01:08 PM IST

Sivaji: దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా నటుడు శివాజీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ముఖ్యంగా అమ్మాయిల దుస్తులపై ఆయన చేసిన కామెంట్స్ పై చాలా మంది మండిపడుతున్నారు.

PREV
14
Actor Sivaji

హీరో శివాజీకి పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు హీరోగా చాలా సినిమాలు చేసి ఆకట్టుకున్న ఆయన తర్వాత బ్రేక్ తీసుకున్నారు. చాలా గ్యాప్ తర్వాత 90's అనే వెబ్ సిరీస్ చేసి ప్రేక్షకులకు మళ్లీ చేరువయ్యారు. అది విడుదలయ్యే సమయంలోనే ఆయన బిగ్ బాస్ కి వెళ్లడంతో మళ్లీ తిరిగి ఫామ్ లోకి వచ్చారు. ఈ బిగ్ బాస్ సీజన్ 7 తర్వాత ఆయన క్రేజ్ చాలా పెరిగిపోయిందనే చెప్పొచ్చు. వరసగా సినిమాలు చేయడం కూడా మొదలుపెట్టారు. కోర్టు మూవీలో మంగపతి అనే పాత్రకు ఆయన నటనకు గాను చాలా ప్రశంసలు అందుకున్నారు.

24
దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్...

ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో దండోదర అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు. బెదరులంక 2012 లాంటి ఫీల్ గుడ్ చిత్రాన్ని అందించిన లౌక్య ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నిర్మాత రవీంద్ర బెనర్జీ ఈ దండోరా చిత్రాన్ని ఈ రోజు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. శివాజీ తో పాటు నవదీప్, రవికృష్ణ, మౌనికా రెడ్డి, బిందు మాధవి లాంటి వారందరూ కలిసి నటించారు. మంగళవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురాగా.. సోమవారం ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో శివాజీ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.

ముందుగా యాంకర్ స్రవంతి డ్రెస్సింగ్ స్టైల్ గురించి శివాజీ మాట్లాడారు. ఆమె చీర కట్టుకొని ఉండటంతో.. చీర కట్టుకొని చాలా చక్కగా ఉన్నావ్ అని పొగిడారు. ఆ తర్వాత... హీరోయిన్లు, బయట ఆడ పిల్లల డ్రెస్సింగ్ స్టైల్ గురించి మాట్లాడుతూ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. ముందుగా సినిమాలో నటించిన పాత్రల గురించి చాలా గొప్పగా మాట్లాడిన ఆయన చివర్లో అమ్మాయిల దుస్తుల గురించి మాట్లాడి.. కాంట్రవర్సీలో చిక్కుకున్నారు.

34
అలాంటి దుస్తులు వేసుకోకండి...

‘ఇంకో విషయం చెబుతున్నా.. అమ్మాయిలు, హీరోయిన్లు.. ఏ బట్టలు పడితే అవి వేసుకుంటే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తుందమ్మా.. ఏం అనుకోవద్దు. హీరోయిన్లు అందరూ... మీరు ఏం అనుకున్నా పర్వాలేదు. లాగి పీకుతాం.. అది వేరే విషయం. కానీ, మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లో ఉంటుంది కానీ, సామాన్లు కనిపించే దానిలో ఏమీ ఉండదు. అవి వేసుకున్నంత మాత్రాన.. చాలా మంది ఎదురుగా నవ్వుతూ మాట్లాడతారు కానీ, మనసులో దరిద్రపు ముండ.. ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకున్నావ్.. ? బానే ఉంటావ్ కదా..? ఇలాంటి మాటలు అనాలనిపిస్తది లోపల. అనలేం. అంటే.. స్త్రీ స్వాతంత్రం లేదా? స్వేచ్ఛ లేదా అని అంటారు. స్త్రీ అంటే ప్రకృతి. ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుంది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా స్త్రీ అంటే మా అమ్మ... చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడుతుంది. సావిత్రమ్మ కానీ, సౌందర్య కానీ. ఈ జనరేషన్ లో కూడా చాలా మంది ఉన్నారు రష్మిక. చాలా మంది అమ్మాయిలు ఉన్నారు.. వీళ్లంతా ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి.. చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలి. నేను ఎవరు ఇవన్నీ చెప్పడానికి.. మళ్లీ రేపు పొద్దున చాలా మంది బయలుదేరతారు స్త్రీ కి స్వేచ్ఛ లేదా అని . స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛను కోల్పోవద్దు. మనకు గౌరవం ఎప్పుడు పెరుగుతుంది అంటే.. మన వేష, భాషలతోనే గౌరవం పెరుగుద్ది. అందులో.. ప్రపంచ వేధికలపైన కూడా చీరలు కట్టుకున్న వారికే విశ్వ సుందరి కిరీటాలు వచ్చాయి’ అని శివాజీ అన్నారు.

44
మండిపడుతున్న అమ్మాయిలు...

ప్రస్తుతం శివాజీ చేసి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. సామాన్లు అంటూ ఆయన వాడిన పదాలు చాలా మందిని హర్ట్ చేసినట్లు తెలుస్తోంది. కొందరు శివాజీ చెప్పింది కరెక్ట్ అని కామెంట్స్ చేస్తుంటే.. మరి కొందరు మాత్రం విమర్శిస్తున్నారు. యాంకర్ స్రవంతిని డ్రెస్సింగ్ సెన్స్ బాగుంది అని శివాజీ అనగానే.. కింద క్రౌడ్ లో ఉన్న చాలా మంది ఈలల వేస్తూ.. ‘ మంగపతి’ అంటూ అరవడం, తర్వాత సామాన్లు అన్న మాట వాడినప్పుడు విజిల్స్ లాంటి వేస్తూ శివాజీ మాటలను ఎంకరేజ్ చేయడం కూడా చాలా మందికి నచ్చడం లేదు. దీనికి సంబంధించి చాలా మంది మహిళలు సోషల్ మీడియాలో వీడియోలు కూడా షేర్ చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories