బాలకృష్ణ కెరీర్ లో డిజాస్టర్ మూవీ, ఎన్టీఆర్ కు మాత్రం బాగా నచ్చిన సినిమా ఏదో తెలుసా? ప్లాప్ అవుతుంది, ఆడదు అని చెప్పినా కూడా వినకుండా ఎన్టీఆర్ పట్టుబట్టి చేయించిన సినిమా ఏంటి? ఆ దర్శకుడు ఎవరు?
65 ఏళ్ల వయసులో కూడా వరుస విజయాలతో నందమూరి నట సింహం బాలయ్య దూసుకుపోతున్నాడు. వరుస విజయాలతో డబుల్ హ్యాట్రిక్ కు దగ్గరగా ఉన్నాడు బలకృష్ణ. వరుసగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకూ మహరాజ్, అఖండ2 సినిమాలతో 5 సూపర్ హిట్ లను తన ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య బాబు. ఇక త్వరలో మలీనేని గోపీచంద్ డైరెక్షన్ లో మరో సినిమా సెట్స్ మీదకు వెళ్తబోతోంది. ఈసినిమా కూడా హిట్ అయితే.. నటసింహం ఖాతాలో డబుల్ హ్యాట్రిక్ పడినట్టు అవుతుంది.
25
బాలయ్య కెరీర్ లో డిజాస్టర్లు ఎన్నో..
నందమూరి నటసింహం బాలకృష్ణ కెరీర్ లో విజయాలతో పాటు.. ఎన్నో డిజాస్టర్లు కూడా ఉన్నాయి. ఒక దశలో బాలయ్య కెరీర్ ఆగిపోయింది అనుకున్న టైమ్ లో .. మళ్ళీ వరుస విజయాలు ఆయన్ను ఫామ్ లోకి తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. మాస్ ఆడియన్స్ లో ఎక్కువగా ఫాలోయింగ్ ఉన్న బాలయ్య బాబుకు.. ఫ్యామిలీ ప్రేక్షకుల్లో కూడా అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. అయితే నందమూరి హీరో కెరీర్ లో ఆయన తండ్రి ఎన్టీఆర్ వల్ల వచ్చిన అతి పెద్ద డిజాస్టర్ ఏంటో తెలుసా? ప్లాప్ అవుతుంది అని దర్శకుడు చెప్పినా.. పెద్దాయిన ఎందుకుపట్టుబట్టి ఆ సినిమా చేశారు?
35
బాలకృష్ణకు ఇష్టం లేకుండా చేసిన సినిమా?
బాలయ్య కెరీర్ లో కోందండ రామిరెడ్డి డైరెక్షన్ లో వచ్చిన సినిమా ''తిరగబడ్డ తెలుగు బిడ్డి''. 1988 లో రిలీజ్ అయిన ఈసినిమాలో భానుప్రియ హీరోయిన్ గా నటించగా, హరికృష్ణ ఈసినిమాను నిర్మించారు. ఈ కథను ఎన్టీఆర్ సమకూర్చారు. అప్పట్లో దర్శకుడిగా మంచి ఫామ్ లో ఉన్న కోదండరామిరెడ్డిని పిలిచి.. ఈ కథను బాలకృష్ణతో చేయాలి ఒక్కసారి చూడమన్నారు. అయితే కథను చూసి.. ఆ సినిమా నడుస్తుందో లేదో చెప్పే ట్యాలెంట్ ఉన్న కోదండరామిరెడ్డి. ఈ కథ నడవదని పెద్దాయనకు చెప్పారట. దర్శకుడు ఆ మాట అనేసరికి..ఎన్టీఆర్ కు కోపం వచ్చి.. అలా అంటారా అని తిట్టారట. ఇక దర్శకుడు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తరువాత మళ్లీ కొన్ని రోజుల తరువాత ఎన్టీఆర్ నుంచి ఆయనకు ఫోన్ వచ్చింది.
హైదరాబాద్ లో ఓ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. అప్పటికే ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ నుంచి కోదండరామిరెడ్డికి ఫోన్ వచ్చింది. ఏంటా అని వెళ్తే.. బ్రదర్.. ఈ కథ బాగుంటుంది. నా కోసం చేసి పెట్టండి అని అడిగారట. దాంతో పెద్దాయన అంతలా అంటున్నారుకాబట్టి, పట్టుబడుతున్నారు కాబట్టి చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన అన్నట్టుగానే ఈసినిమా రిలీజ్ అయ్యి.. డిజాస్టర్ అయ్యింది. కానీ ఎన్టీఆర్ కు మాత్రం ఈమూవీ చాలా నచ్చిందట. ప్లాప్ అయినా కానీ.. పెద్దాయన మనసుకు నచ్చింది. ఈ విషయాన్ని డైరెక్టర్ కోదండరామిరెడ్డి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
55
షూటింగ్ ను లైట్ తీసుకున్న బాలకృష్ణ..
''తిరగబడ్డ తెలుగు బిడ్డి'' సినిమా చేయడం.. బాలకృష్ణకు, హరికృష్ణకు కూడా ఇష్టం లేదు. ఈ కథ విన్నవెంటనే వారు.. నచ్చలేదు, ఆడదు అన్నారట. కానీ ఎన్టీరామారావు ఇష్టపడి చెప్పడంతో చేశారు. అయితే బాలకృష్ణ మాత్రం షూటింగ్ ను లైట్ తీసుకున్నట్టు దర్శకుడు వెల్లడించారు. ఒక షాట్ బాలేదు.. మళ్లీ చేద్దాం అంటే.. ఎందుకు సార్.. ప్లాప్ అయ్యే సినిమా కోసం ఇదే ఎక్కువ అనేవారట. అలా 'తిరగబడ్డ తెలుగు బిడ్డి సినిమా చేయడం.. ప్లాప్ అవ్వడం జరిగిపోయింది.