Gunde Ninda Gudi Gantalu Today: ఏం ఫ్యామిలీ రా బాబు... ఒకరికి తెలియకుండా మరకొరు, మంచాలా మనోజ్ కి బాలు చెక్

Published : Dec 23, 2025, 10:26 AM IST

 Gunde Ninda Gudi Gantalu : రవి తన హోటల్ లో బెస్ట్ కపుల్ కాంటెస్ట్ జరుగుతందని, అప్లై చేయమని చెప్పినప్పుడు ఎవరూ ఒకే చెప్పరు. కానీ, తర్వాత అందరూ నెమ్మదిగా మనసు మార్చుకుంటారు. మరి, నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో టీవీ కంటే ముందుగా.... 

PREV
15
Gunde Ninda Gudi Gantalu

బెస్ట్ కపుల్ కాంటెస్ట్ లో గెలిచిన వారికి రూ.లక్ష ప్రైజ్ మనీ అనడంతో మనోజ్ లో ఆశ మొదలౌతుంది. ఎలాగైనా అందులో గెలవాలని అనుకుంటాడు. అదే విషయం రోహిణీతో చెబుతాడు. కానీ, మనం అందులో గెలుస్తామా అని రోహిణీ సందేహం వ్యక్తం చేస్తుంది. ‘ నేను చాలా ఎక్కువ చదివాను. చాలా డిగ్రీలు చేశాను. అక్కడ చాలా చిన్న చిన్న సింపుల్ ప్రశ్నలు మాత్రమే అడుగుతారు. నీకు కూడా జనరల్ నాలెడ్జ్ ఎక్కువ కదా, వాళ్లు అడిగిన ప్రశ్నలు అన్నింటికీ టపా టపా అని ఆన్సర్లు చెబుదాం. ఇంకో జంట ఆప్షన్ కూడా ఇవ్వకూడదు’ అని మనోజ్ అనడంతో రోహిణీ కూడా తప్పక ఒప్పుకుంటుంది. కానీ, ఇంకా రోహిణీ డౌట్ పడుతూ ఉండటంతో.. ‘ నువ్వేమీ ఆలోచించకు.. ఆ బాలు గాడు మనల్ని నెలకు రూ.50 వేలు ఇవ్వమని అన్నాడు కదా.. ఆ రూ.లక్ష గెలిస్తే.. రెండు నెలల డబ్బులు ఇచ్చేయవచ్చు. షోరూమ్ లో వచ్చే డబ్బులు మనకు ప్రాఫిట్ కదా’ అని చెప్పి.. మనోజ్ బ్రతిమిలాడి మరీ రోహిణీని ఒప్పిస్తాడు.‘ ఇంట్లో వాళ్లకు చెబుదామా’ అని రోహిణీ అంటే.. ‘ మనకు కాంపిటేషన్ ఎక్కువగా ఉండకూడదు. అసలు ఆ బాలు, మీనా మనకు కాంపిటీషన్ కాదు కానీ.. రవి, శ్రుతిలకు చెప్పకుండా వెళ్దాం.. గెలిచి చూపిద్దాం. ఆ బాలు గాడు మనల్ని చాలా మాటలు అంటున్నాడు కదా.. మనం గెలిస్తే వాడు ముఖం ఎక్కడ పెట్టుకుంటాడో చూద్దాం... ’ అని మనోజ్ అంటాడు.

25
శ్రుతి కి ఒకే చెప్పిన రవి

శ్రుతి ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఏం ఆలోచిస్తున్నావ్ అని రవి అడిగితే.. ‘ మనం కాంపిటీషన్ లో ఎలా గెలుద్దామా అని ఆలోచిస్తున్నాను’ అని అంటుంది.‘ ఏం కాంపిటీషన్..?’ అని రవి అడిగితే.. ‘ బాసు నీకు స్క్రూ లూజా? కపుల్ కాంటెస్ట్ గురించి ఆలోచిస్తున్నాను’ అని చెబుతుంది. ‘ వాళ్లు ఎవరూ రావట్లేదు కదా.. మనం కూడా వద్దు అనుకున్నాం కదా’ అని రవి అడిగితే...‘ నువ్వు అన్నావ్.. నేను ఇంకా ఆలోచిస్తున్నానే ఉన్నాను, అయినా వాళ్లు రాకపోతే ఏంటి? మనం పార్టిసిపేట్ చేద్దాం.. ప్రైజ్ మనీ ఎందుకు మిస్ అవ్వాలి?’ అని శ్రుతి బదులిస్తుంది. ‘ ఇక్కడే మన మధ్య టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటాం.. అక్కడ ఇంకేం గెలుస్తాం’ అని రవి సెటైర్ వేస్తే.. ‘ అదేమన్నా ఒలిపింక్స్ ఆ.. జస్ట్ బెస్ట్ కపుల్ కాంటెస్ట్ అంతే కదా ’ అని శ్రుతి అంటుంది. ‘ బెస్ట్ కపుల్ అని మనం ఫీల్ అయితే సరిపోదు.. వాళ్లు అనుకోవాలి’ రవి బాధగా ఉంటాడు. కానీ శ్రుతి ఒప్పుకోదు.. మనం బెస్ట్ కపుల్ కాదు అని ఎవరూ అనరు అని.. ఏదో ఒకటి చెప్పి.. ఈ కాంపిటేషన్ లో పార్టిసిపేట్ చేద్దాం అని.. ఒప్పిస్తుంది. దీంతో.. రవి కూడా సరే అంటాడు.

35
లక్షకు టెండర్ పెట్టిన ప్రభావతి

ఇక.. సత్యం నిద్రపోతుంటే.. ప్రభావతి లేపుతుంది. ఏంటి? అని సత్యం అడిగితే.. ‘ లక్ష రూపాయలు అంటే చాలా పెద్ద అమౌంట్ కదండీ.. ’ అని గారాలుపోతూ అడుగుతుంది. ‘ అవును.. మాలాంటి వాళ్లకు పెద్ద అమౌంటే.. నీకు, నీ కొడుక్కి మాత్రం చాలా చిన్న అమౌంట్’ అని అంటాడు. ‘ మీరు అనడం.. నేను పడటం నాకు అలవాటు అయిపోయింది కానీ.. నాకు ఒకటి అనిపిస్తోందండి.. మనం పాతికేళ్ల నుంచి కాపురం చేస్తున్నాం కదా... ఆదర్శ దంపతుల పోటీలో గెలవడానికి మనకంటే ఎక్కువ అర్హత ఎవరికి ఉంటుంది? అక్కడికి వెళితే మనకి కూడా ఆదర్శ దంపతులు అనే గుర్తింపు వస్తుంది కదా ’ అని సిగ్గుపడుతూ అడుగుతుంది. ఆ సిగ్గు పడటం ఆపమని విసుక్కుంటూనే సత్యం.. ‘ అసలు ఆదర్శదంపతులు అంటే నీకు తెలుసా? ఆదర్శమైన భావాలు ఉన్న దంపతులు అని. నీకు ఇది కూడా అర్థం కాలేదు కదా.. ఈ విషయమే తెలియకుండా ఆదర్శ దంపతులు అని ఎలా అనుకుంటావ్?’ అని తిట్టేస్తాడు. కానీ.. ప్రభావతి ఊరుకోదు. ‘ ప్రైజ్ మనీ లక్ష రూపాయలు అనగానే నీకు ఆశ పుట్టింది కదా ..’ అని సత్యం అడిగితే.. ‘ డబ్బు అంటే ఎవరికి మాత్రం ఆశ ఉండదు’ అని ప్రభావతి గోముగా అంటుంది. ఇక... ప్రభావతి గోల తట్టుకోలేక.. సత్యం కూడా ఒప్పుకుంటాడు. పోటీలో పాల్గొనక ముందే.. డబ్బు గెలిచినట్లుగా ప్రభావతి కలలు కంటూ ఉంటుంది.

45
మనోజ్ మీద పగ తీర్చుకోవాలంటే....

ఇక బాలు కూడా ఇదే కాంపిటీషన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఏం ఆలోచిస్తున్నావ్ అని మీనా అడుగుతుంది. ‘ ఆ మంచాల మనోజ్ గాడు.. మనల్ని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నాడు మీనా, వాడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి’ అని చెబుతాడు. దానికి మీనా ‘ అది జరగాలంటే... ముందు మనం పోటీకి వెళ్లాలి. గెలవాలి’ అని చెబుతుంది. ‘ అది మనలాంటి వాళ్ల వల్ల కాదు మీనా’ అని బాలు అంటే.. ‘ మరి ఎలా బుద్ధి చెబుతారు..? గొడవ పడతారా?’ అని అడుగుతుంది. ‘ అదే ఆలోచిస్తున్నాను’ అని బాలు అంటే.. ‘ చూడండి.. మనం ఆ కాంపిటీషన్ లో గెలిస్తే.. మీరు అన్నట్లే ఆ మంచాల మనోజ్ కి.. మనం తక్కువ కాదు అని నిరూపించుకోవచ్చు.’ అని అంటుంది. కానీ బాలు.. ‘ మన లాంటి వల్ల అవుతుందా?బాగా డబ్బు ఉన్న వాళ్లు వస్తారు కదా ’ అని అంటాడు. కానీ.. మీనా కన్విన్స్ చేస్తుంది. ఈ కాంపీటీషన్ లో గెలిస్తే... ఆ డబ్బుతో మనం రూమ్ కట్టించుకోవచ్చు అని మీనా అనడంతో.. బాలు కూడా సరే అంటాడు. ఇద్దరూ కలిసి.. కాంపిటీషన్ ఎలా జరుగుతుంది అని కాసేపు చర్చించుకుంటారు. ఈ పోటీలో మనమే గెలుస్తామని అనిపిస్తుంది అని మీనా అంటే.. ఆ మనోజ్ కోసం అయినా గెలవాలి అని బాలు అంటాడు. ‘ వేరే వాళ్ల కోసం మనం గెలవకూడదు.. మనకోసమే మనం గెలవాలి’ అని మీనా చాలా చక్కగా చెబుతుంది.

55
ఫ్యామిలీ అంతా ఒకే చోటుకి...

మరుసటి రోజు ఉదయాన్నే కాంపిటీషన్ కోసం మీనా రెడీ అవుతూ ఉంటుంది. బాలుకి కూడా ఏం వేసుకోవాలో డ్రెస్ తీసి ఇస్తుంది. ఇద్దరూ రెడీ అయ్యి ఆ రెస్టారెంట్ కి వెళ్లడానికి రెడీ అవుతారు. మరోవైపు ప్రభావతి, సత్యం కూడా రెడీ అవుతారు. ప్రభావతి చీర కట్టుకొని.... భర్త ముందు ర్యాంప్ వాక్ చేస్తుంది. కాసేపు సత్యం కౌంటర్లు వేస్తాడు.

ఇక బాలు... మీనా కోసం ఎదురుచూస్తుంటే.. ఈ లోగా రోహిణీ, మనజ్.. సత్యం, ప్రభావతి రెడీ అయ్యి కిందకు వస్తారు. వాళ్లని చూసి బాలు షాకై ఎక్కడికి అని అడిగితే.. గుడికి అని ప్రభావతి.. షోరూమ్ కి అని మనోజ్ చెబుతారు. ఇక బాలు మీనా కూడా రెడీ అయ్యి బయలుదేరతారు. శ్రుతి, రవి ముందుగానే అక్కడికి వెళ్లతారు. తమ రెస్టారెంటే కాబట్టి.. వచ్చే కపుల్స్ పేర్లు రిజిస్టర్ చేసే పని వాళ్ల మీద పడుతుంది. అక్కడి మనోజ్, రోహిణీ వస్తారు. వాళ్ల తర్వాత ఒక్కొక్కరుగా అక్కడికి వస్తూ ఉంటారు. కామాక్షి కూడా విచిత్రం రెడీ అయ్యి.. తన భర్తతో అక్కడికి వస్తుంది. అక్కడితో ఎపిసోడ్ ముగిసింది.

Read more Photos on
click me!

Recommended Stories