Chiranjeevi: చిరంజీవి సినిమా గాలి తీసిన నటుడు, ఇదేమన్నా భీమవరం అనుకున్నావా..ప్రొడ్యూసర్ స్ట్రాంగ్ వార్నింగ్

Published : Aug 27, 2026, 03:30 PM IST

చిరంజీవి నటించిన ఓ రీమేక్ మూవీ వర్కౌట్ కాదు అని నటుడు రాజా రవీంద్ర ముందే చెప్పారు. ఆ సినిమా గాలి తీసినంత పని చేశారు. ఇంతకీ రాజా రవీంద్ర ఏమన్నారో ఈ కథనంలో తెలుసుకుందాం.

PREV
15
Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో వివిధ జోనర్లకు చెందిన సినిమాలు చేశారు. మాస్ చిత్రాలతో పాటు కుటుంబ కథా చిత్రాలు, సెంటిమెంట్ మూవీస్ అన్నీ చేశారు. ఓ మూవీ విషయంలో చిరంజీవికి ఆసక్తికర అనుభవం ఎదురైంది. తమిళ సినిమా చూసి ఆ కథ నచ్చడంతో చిరంజీవి రీమేక్ చేశారు. ఆ మూవీలో మెగాస్టార్ ప్రాణం పెట్టి నటించారు అనే చెప్పాలి. ఇంతకీ ఆ మూవీ ఏంటంటే.. స్నేహం కోసం.

25
చిరంజీవి స్నేహం కోసం మూవీ

తమిళ స్టార్ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో స్నేహం కోసం మూవీ తెరకెక్కింది. 'నట్ పుక్కగా' అనే తమిళ చిత్రానికి ఇది రీమేక్. తమిళ వర్షన్ కి కూడా కేఎస్ రవికుమారే దర్శకుడు. ఈ చిత్రం గురించి ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజా రవీంద్ర ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజా రవీంద్ర మాట్లాడుతూ.. కేఎస్ రవికుమార్ తో నాకు బాగా చనువు ఉంది. నన్ను తమిళంలో నటుడిగా పరిచయం చేసింది ఆయనే. ఆయన దర్శకత్వంలో చాలా సినిమాల్లో నటించాను.

35
రాజా రవీంద్ర కామెంట్స్

స్నేహం కోసం సినిమా షూటింగ్ కి ఆయన హైదరాబాద్ వచ్చారు. నన్ను పిలిచారు. హైదరాబాద్ నాకు కొత్త. షూటింగ్ లొకేషన్ కి నువ్వు తోడుగా రా అని పిలిస్తే వెళ్ళాను. చిరంజీవి సినిమా గురించి చెప్పారు. తమిళ వర్షన్ కి కూడా నేనే దర్శకుడిని. ఆ మూవీ చూశావా అని అడిగితే లేదు అని చెప్పా. దీనితో డివిడి ఇచ్చి చూడమని చెప్పారు. సినిమా చూశాను.. నాకు నచ్చలేదు. చిరంజీవి గారికి అస్సలు ఈ మూవీ వర్కౌట్ కాదు అని అనిపించింది.

45
అసలు చిరంజీవి ఎలా ఒప్పుకున్నారు

రవికుమార్ తో నాకు ఉన్న చనువుతో ఇష్టం వచ్చినట్లు తిట్టేశా. తమిళంలో రజినీకాంత్ సూపర్ స్టార్.. తెలుగులో చిరంజీవి సూపర్ స్టార్. అంత పెద్ద హీరోని పెట్టుకుని ఎలాంటి సినిమా చేస్తున్నావ్ ? తమిళంలో శరత్ కుమార్ నటించిన మూవీని చిరంజీవితో చేయడం ఏంటి ? అసలు ఆయన ఈ మూవీకి ఎలా ఒప్పుకున్నారు అని ఇష్టం వచ్చినట్లు అడిగేశా. ఆ మ్యాటర్ చిరంజీవి వరకు వెళ్ళింది. ఆయన లంచ్ టైంలో నన్ను పిలిచారు. డైరెక్టర్ తో ఏమన్నావ్ నువ్వు అని అడిగారు. మొహమాట పడుతుంటే పర్వాలేదు చెప్పు అన్నారు. నాకు అనిపించింది చెప్పా అని చిరంజీవి గారితో అన్నాను.

55
చిరంజీవి చేతులు కట్టుకుని నిలబడడం నచ్చదు

ఈ మూవీ ఎందుకు వర్కౌట్ కాదు అని చిరంజీవి గారు అడిగారు. ఆ మూవీలో విజయ్ కుమార్ దగ్గర హీరో చేతులు కట్టుకుని నిలబడే సీన్లు చాలా ఉంటాయి. విజయ్ కుమార్ చెప్పులు కూడా మోయాలి. చిరంజీవి గారు మాకు మెగాస్టార్. ఆయన్ని అలా చూడలేం. ఒకరి దగ్గర చేతులు కట్టుకుని నిలబడితే అభిమానులకు నచ్చదు. ఇదే విషయాన్ని చిరంజీవి గారికి చెప్పా. ఆ తర్వాత ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు నన్ను పిలిచారు. ఇదేమన్నా భీమవరం అనుకుంటున్నావా ? మేము కోట్లు పెట్టి సినిమా చేస్తుంటే ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు అంటూ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక నేను చెప్పిందే నిజం అయింది. స్నేహం కోసం జస్ట్ పర్వాలేదనిపించే సక్సెస్ మాత్రమే అందుకుంది. చిరంజీవి క్రేజ్ కి తగ్గ విజయం సాధించలేదు. ఈ విషయాన్ని చిరంజీవి గారు కూడా ఓ ఇంటర్వ్యూలో అంగీకరించారు.

Read more Photos on
click me!

Recommended Stories