నాగబాబు, పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా చిరంజీవి (Chiranjeevi) పరోక్షంగా ప్రకాష్ రాజ్ కి సంపూర్ణ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో అతడు జనసేన పార్టీలో చేరి... ఆ పార్టీలో కీలక నేతగా మారనున్నాడని కూడా వార్తలు వచ్చాయి. గతంలో రాజకీయంగా పవన్ (Pawan kalyan) పై విమర్శలు గుప్పించిన ప్రకాష్ రాజ్ జనసేనకు దగ్గర కావడం, పవన్ లో పరివర్తన వచ్చిందని చెప్పడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరింది.