రాజమౌళి కే సవాల్ విసురుతున్న అనిల్ రావిపూడి. ఈ డైరెక్టర్ ఖాతాలో ఎన్ని రికార్డ్ లు ఉన్నాయో తెలుసా..?

Published : Jan 19, 2025, 06:49 PM IST

తక్కువోడు కాదు అనిల్ రావిపూడి.. సైలెంట్ గా చేసేది చేసుకుంటూ వెళ్లుతున్నాడు. అరుదైన రికార్డ్స్ సాధిస్తూ.. రాజమౌళికే సవాల్ విసురుతున్నాడు. ఇంతకీ అనిల్ రావిపూడి సైలెంట్ గా  సాధిస్తున్న ఘనతలు ఏంటో తెలుసా..?   

PREV
17
రాజమౌళి కే సవాల్ విసురుతున్న అనిల్ రావిపూడి.  ఈ డైరెక్టర్ ఖాతాలో ఎన్ని రికార్డ్ లు ఉన్నాయో తెలుసా..?

చూడ్డానికిమామూలుగా ఉంటాడు కాని.. అనిల్ రావిపూడి తక్కువోడు కాదు. చాలా చిన్న బడ్జెట్ తో.. నిర్మాతలకు భారీ లాభాలు చూపిస్తున్నాడు. వరుసగా హిట్ సినిమాలు చేస్తూ.. హీరోలకు కూడా నమ్మకం కలిగిస్తున్నాడు. ఏకంగా రాజమౌళికే సవాల్ విసురుతున్నాడు అనిల్ రావిపూడి. సినిమాల విషయంలో రేర్ రికార్డ్స్ ను తన సొంతం చేసుకుంటున్నాడు అనిల్. 

27

మీడియా బడ్జెట్ తో స్టార్ హీరోలతో సినిమాలు తీసి వరుస హిట్స్ ఇస్తున్నాడు అనిల్ రావిపూడి. 2005 టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్రదర్శకుడు దాదాపు 10 ఏళ్లు ఇండస్ట్రీలో ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశాడు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో సిన్సియర్ గా పనిచేసి.. మూడేళ్లలో అసోషియేట్ డైరెక్టర్ అయ్యాడు.  2008 శౌర్యం సినిమాకి అసోసియేట్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 

37

ఇండస్ట్రీలో అనిల్ బ్రాండ్ అప్పుడే పడిపోయింది. సినిమాలకు రచయితగా, అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసి 2015లో అసలు దర్శకుడిగా అవతారం ఎత్తాడు. ఎన్టీఆర్ తో సినిమా చేద్దామని కథరాసుకున్న అనిల్ కు  కళ్యాణ్ రామ్ అవకాశం ఇచ్చాడు. దాంతో అప్పటి వరకూ ప్లాప్స్ చూస్తూ వస్తున్న నందమూరి హీరోతో పటాస్ సినిమా డైరెక్ట్ చేసి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. 

47

అప్పటివరకు వరుస ఫ్లాప్స్ లో ఉన్న కళ్యాణ్ రామ్ కు పటాస్ సినిమాతో మంచి హిట్ ఇచ్చి కళ్యాణ్ రామ్ సెకండ్ ఇన్నింగ్స్ ను కానుకగా ఇచ్చాడు అనిల్.  పటాస్ తర్వాత సాయి ధరమ్ తేజ్ తో సుప్రీమ్, రవితేజతో రాజా ది గ్రేట్, వెంకటేష్ – వరుణ్ తేజ్ లతో F2,  F3, ఈరెండు సినిమాల మధ్యలో మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరూ,  బాలకృష్ణతో భగవంత్ కేసరి, ఇప్పుడు వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో వరుసగా 8 హిట్స్ కొట్టాడు అనిల్. 
 

57
Anil Ravipudi - Rajamouli

ఈ కాలంలో ఉన్న దర్శకులో  రాజమౌళి తర్వాత  వరుసగా 8 హిట్స్  కొట్టిన దర్శకుడిగా అనిల్ రావిపూడి నిలిచిపోయాడు. ఈ విషయంలో జక్కన్నకే పోటీ వచ్చేలా ఉన్నాడు. రాజమౌళికే సవాల్ విసురుతున్నాడు అనిల్ రావిపూడి. తన ప్రతీ సినిమాలో కామెడీని మోయిన్ గా చేసుకుని... ఎంటర్టైన్మెంట్ తో పాటు ఒక మెసేజ్ కూడా ఇస్తూ..ముందుకు వెళ్తున్నాడు అనిల్.  ఒక వైపు ఆడియన్స్ కు కావల్సిన  ఎంటర్టైన్మెంట్ అందిస్తూనే.. ఏదో ఒక మెసేజ్ ఇస్తూ.. వారిని  ఆలోచింపచేస్తున్నాడు అనిల్ రావిపూడి. 

67

8 హిట్స్ కొట్టడమే కాదు అన్ని సినిమాలు నిర్మాతలకు లాభాలు కూడా తెచ్చిపెట్టాయి ఆ సినిమాలు. అలాగే వరుసగా 5 సినిమాలు 100 కోట్ల గ్రాస్ దాటాయి. F2 నుంచి సంక్రాంతికి వస్తున్నాం వరకు అన్ని సినిమాలు 100 కోట్ల గ్రాస్ దాటాయి. అలాగే అమెరికాలో వరుసగా అయిదు సినిమాలు 1 మిలియన్ డాలర్స్ దాటాయి. ఈ జనరేషన్ లో రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడి కే ఈ రికార్డులు సాధ్యమయ్యాయి.
 

77

ఇప్పటికే మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరూ సినిమాతో 200 కోట్ల గ్రాస్ తో పాటు.. యూఎస్ లో  2 మిలియన్ డాలర్స్ ను అవలీలగా సాధించాడు. ఇక ఇప్పుడు మరోసారి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 200 కోట్ల గ్రాస్, 2 మిలియన్ డాలర్స్ దాటించబోతున్నాడు. ఇప్పుడున్న దర్శకులలో రాజమౌళి తర్వాత అన్నివిధాలుగా 100 శాతం సక్సెస్ రేట్ ఉన్న దర్శకుడిగా అనిల్ రావిపూడి నిలిచారు.

ఇక ముందు ముందు ఏం చేయబోతున్నాడో తెలియదు కాని..మెగా హీరోలతో సినిమాలు మాత్రం వరుసగా అనిల్ కోసం ఎదరు చూస్తున్నాయి. మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నాడు. మరి ఆ మెగా ఇమేజ్ ఎలా క్యారీ చేస్తాడో చూడాలి. వెంకీ , బాలయ్య, మహేష్ ను హ్యాండిల్ చేసిన అనిల్ చిరును ఎలా మేనేజ్ చేస్తాడో చూడాలి. 

Read more Photos on
click me!

Recommended Stories