Oscar 2026: ఆస్కార్ బరిలో హోంబలే ఫిల్మ్స్ హవా: 'ఉత్తమ చిత్రం' విభాగం జాబితాలో 'కాంతార-1', 'మహావతార నరసింహ' సినిమాలు ఉన్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి.
భారతీయ సినిమా రంగంలో గర్వించదగ్గ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ మరో మైలురాయిని నెలకొల్పింది. 'కాంతార: చాప్టర్ 1', 'మహావతార నరసింహ' చిత్రాలు ఆస్కార్ 'ఉత్తమ చిత్రం' విభాగంలో జనరల్ ఎంట్రీ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాయి.
26
ఉత్తమ చిత్రం విభాగం
ఈ రెండు చిత్రాలు ఆస్కార్ అత్యంత కీలక విభాగమైన 'ఉత్తమ చిత్రం' (Best Picture) అవార్డుకు పోటీ పడేందుకు అర్హత సాధించాయి. ఇది హోంబలే ఫిల్మ్స్ కథల బలానికి, ప్రపంచ స్థాయి నాణ్యతకు దక్కిన గౌరవం.
36
యానిమేషన్ ప్రపంచంలో విప్లవం
'మహావతార నరసింహ' ఉత్తమ చిత్రంతో పాటు, 'ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్' విభాగంలోనూ పోటీ పడుతోంది. ఈ విభాగంలో ఎంపికైన తొలి భారతీయ యానిమేషన్ చిత్రంగా చరిత్ర సృష్టించింది.
ఈ ఏడాది ఆస్కార్ జనరల్ లిస్ట్‌లో ఉన్న ఐదు భారతీయ చిత్రాల్లో రెండు హోంబలే సంస్థకు చెందినవి కావడం విశేషం.
56
సంచలనం సృష్టించిన సినిమా
రిషబ్ శెట్టి 'కాంతార: చాప్టర్ 1' సాంస్కృతిక మూలాలతో, అశ్విన్ కుమార్ 'మహావతార నరసింహ' దృశ్య వైభవంతో ఆకట్టుకున్నాయి. ఈ రెండు చిత్రాలు ఉత్తమ దర్శకత్వం, నటుడు, సినిమాటోగ్రఫీ, స్క్రీన్‌ప్లే విభాగాల్లోనూ పోటీ పడనున్నాయి.
66
భారత్ నుంచి ఎంపికైన సినిమాలు
1. కాంతార: ఎ లెజెండ్ - చాప్టర్ 1
2. మహావతార నరసింహ
3. తన్వి ది గ్రేట్
4. సిస్టర్ మిడ్‌నైట్ (భారతీయ నేతృత్వంలోని అంతర్జాతీయ చిత్రం)