41 ఏళ్ల వయసులో డిగ్రీ కోసం కష్టపడి చదువుతున్న టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?

Published : May 17, 2025, 08:00 AM IST

చదువుకు వయస్సుతో సబంధం లేదు అని నిరూపించాడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో. 40 ఏళ్ళు దాటినా కూడా సినిమాలు చేస్తూనే చదువుకుంటున్నాడు. తనకు నచ్చిన డిగ్రీని కంప్లీట్ చేయడం కోసం.. షూటింగ్ గ్యాప్ లో హోమ్ వర్క్ కూడా కంప్లీట్ చేస్తున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా? 

PREV
15
41 ఏళ్ల వయసులో డిగ్రీ కోసం కష్టపడి చదువుతున్న టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?

అప్పుడప్పుడు వార్తల్లో వింటుంటాం.. ఏజ్ బార్ అయిన వ్యక్తులు కూడా యూనిర్సిటీల నుంచి డిగ్రీలు తీసుకోవడం, లేదా 10వ తరగతి పరీక్షలు రాయడం లాంటి వార్తలు వస్తుంటాయి. అందులో సినిమా సెలబ్రిటీలు కూడా కొంత మంది ఉన్నారు. ఆమధ్య మలయాళ నటుడు 70 ఏళ్ల వయస్సులో 10 క్లాస్ ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యాడు. చాలా మందికి ఆదర్శంగా నిలిచాడు. ఇక తాజాగా ఓ టాలీవుడ్ హీరో 41 ఏళ్ల వయస్సులో డిగ్రీ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నాడు షూటింగ్ గ్యాప్ లో తెగచదివేస్తున్నాడు. ఆ హీరో ఎవరో కాదు హర్షవర్ధన్ రాణే. 

25

టాలీవుడ్‌లో తన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హర్షవర్ధన్ రాణే ఇప్పుడు బాలీవుడ్‌లోనూ విజయవంతంగా ముందుకు సాగుతున్నాడు. సినీ కెరీర్‌తో పాటు వ్యక్తిగత అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న ఈ నటుడు, 41 ఏళ్ల వయసులో డిగ్రీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన రాణే, తన చదువు పట్ల ఉన్న నిబద్ధతను చాటుకున్నాడు.

35
Harshvardhan Rane

హర్షవర్ధన్ ప్రస్తుతం సైకాలజీ ఆనర్స్ డిగ్రీలో రెండవ సంవత్సరం చదువుతున్నాడు. జూన్‌లో పరీక్షలు ఉండటంతో, ఆయన షూటింగ్‌ల మధ్య సమయం దొరికినప్పుడల్లా చదువుకి కేటాయిస్తున్నాడు. ఇటీవలి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఆయన, స్టడీ టేబుల్ దగ్గర నోట్స్ చదువుతున్న ఫోటోల్ని షేర్ చేశాడు. ‘‘సినిమా షూటింగ్ జరుగుతోంది, సైకాలజీ ఆనర్స్ రెండవ సంవత్సరం పరీక్షలు జూన్‌లో ఉన్నాయి,’’ అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

45
Harshvardhan Rane

హర్షవర్ధన్ రాణే కెరీర్‌ను పరిశీలిస్తే, 2010లో ‘తకిట తకిట’ చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేశాడు. తర్వాత ‘నా ఇష్టం’, ‘అవును’, ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘మాయ’, ‘ఫిదా’, ‘బెంగాల్ టైగర్’, ‘అవును 2’, ‘అనామిక’, ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ వంటి సినిమాల్లో నటించి తన నటనా ప్రతిభను నిరూపించాడు.

55

ఇటీవల బాలీవుడ్‌లో విడుదలైన ‘సనమ్ మేరీ కసమ్’ రీ-రిలీజ్ భారీ విజయం సాధించింది. ఈ చిత్రం రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం. ప్రస్తుతం హర్షవర్ధన్ ‘దీవానియాత్’ అనే రొమాంటిక్ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

ఇటువంటి సమయంలోనూ విద్యను ప్రాముఖ్యతనిస్తూ డిగ్రీ చదవడం హర్షవర్ధన్‌ పట్ల అభిమానుల్లో గౌరవాన్ని పెంచింది. నేటి తరానికి మంచి ప్రేరణగా నిలుస్తున్నాడు హర్ష.

Read more Photos on
click me!