రోజుకు 5 సిగరెట్లు తాగే హీరోయిన్ ఎవరో తెలుసా..? స్వయంగా వెల్లడించిన బాలీవుడ్ బ్యూటీ...?

First Published Apr 27, 2024, 3:32 PM IST

ప్రపంచం ఎంత అడ్వాన్స్అయినా.. మన దగ్గర ఆడవారు సిగరెట్ తాగితే విచిత్రంగానే చూస్తారు. సామాన్యులైనా.. సెలబ్రిటీలు అయినా.. ఎవరు సిగరెట్ తాగినా.. పక్కన వారికి అది వింతే. అయితే ఓ బాలీవుడ్ హీరోయిన్ ఓ సందర్భంలో రోజుకు 5 సిగరెట్లకు పైగా తాగేసిందట. కారణం ఏంటంటే..? 

సిగరెట్ తాగడం పురుష లక్షణమేమి కాదు. అలా అని ఆడవారు కూడా అందరు స్మోక్ చేస్తారు అని లేదు. కాని ప్రస్తుత సమాజంలో.. మగవారికి పోటీగా ఆడవారు కూడా స్మోక్ చేయడం చూస్తూనే ఉన్నాం. చాలామంది సెలబ్రిటీలు స్మోక్ చేస్తుంటారు. కొంత మంది సీక్రేట్ గా మెయింటేన్ చేస్తే.. మరికొంత మంది మాత్రం పబ్లిక్ గానే స్మోక్ చేస్తుంటారు. ముఖ్యంగా బాలీవుడ్ తారలు ఈ విషయంలో ముందుంటారు. 
 

అయితే చాలామంది హీరోయిన్లకు స్మోకింగ్ అలవాటు లేకపోయినా.. సినిమాల కోసం కొన్నిసార్లు స్మోక్ చేయాలసి వస్తుంది. బాగా స్మోకింగ్ చేయడం వచ్చినవారు చేసినట్టుగా ఆహీరోయిన్లు కూడా నటించాల్సి వస్తుంది. అందుకోసం స్మోకింగ్ ప్రాక్టీస్ చేయక తప్పదు. అలాంటి పరిస్థితులు ఎంత ఇబ్బంది పెడతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి  ఇబ్బందికర పరిస్థితి బాలీవుడ్  నటి విద్యా బాలన్ కు వచ్చిందట. 
 

రాణిలా రమ్మకృష్ణ లైఫ్ స్టైల్, 53 ఏళ్ల వయస్సులో శివగామి ఆస్తులు అన్ని కోట్లా...?

స్మోకింగ్ చేయడం ఇష్టం లేకపోయినా, అలవాటు లేకపోయినా.. కథ డిమాండ్‌ చేస్తే  సిగరెట్‌ తాగాల్సి ఉంటుంది. మద్యం తాగే సీన్లను కూల్ డ్రింక్ లతో  ఎలాగోలా మేనేజ్‌ చేయవచ్చు.  కానీ సిగరెట్‌ సీన్లు అలా చేయడం కష్టమనే చెప్పాలి. అందుకే కష్టమైన సినిమాల కోసం దమ్ము కొట్టాల్సిందే.  ఓ సినిమా విషయంలో హీరోయిన్  విద్యాబాలన్‌కు కూడా ఇలాంటి పరిస్థితే వచ్చింది. సిగరెట్ తాగడం తప్పని సరి అయ్యిందాట. దాంతో ఆమె చేసేది లేకు గట్టిగా ప్రాక్టీస్ చేసింద. 
 

vidya balan

ఈ విషయం ఓ సందర్భంలో వెల్లడించింది విద్యా బాలన్. ఆమె మాట్లాడుతూ.. సిగరెట్‌ ఎలా తాగుతారో తెలుసు కానీ నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు. డర్టీ పిక్చర్‌ సినిమాలో నా పాత్ర  సిగరెట్‌ తాగుతుంటుంది. ఉత్తినే తాగుతున్నట్టుగా నటిస్తే సీన్‌ బాగా రాదు. అందుకే సిగరెట్‌ అలవాటు చేసుకున్నా. సినిమా తర్వాత సిగరెట్‌ మానలేకపోయాను. రోజుకు రెండు మూడు సిగరెట్లు కాలిస్తే తప్ప మనసు ప్రశాంతంగా ఉండేది కాదు. ఆ రోజుల్లో మహిళలు సిగరెట్ తాగుతుంటే అదోలా చూసేవారు. అదో పెద్ద నేరంగా భావించేవారు. 

కాని ఇప్పుడు అలా కాదు. నిజానికి సిగరెట్‌ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదని ఎవరైనా చెప్పి ఉంటే ఇప్పటికీ ఆ అలవాటును మానుకునేదాన్ని కాదు. ఇప్పుడైతే సిగరెట్లు తాగడం లేదు. కాలేజ రోజుల్లో బస్‌స్టాప్‌లో సిగరెట్ తాగేవారి పక్కన కూర్చున్నప్పుడు ఆ పొగను ఆస్వాదించేదాన్ని. ఆ వాసన నాకు బాగా నచ్చేది' అని విద్యాబాలన్‌ చెప్పుకొచ్చారు. 

ప్రస్తతం ఈ వాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయంలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సిగరెట్ స్మెల్ ను ఆస్వాదించడం ఏంటీ అంటూ మండిపడుతున్నారు. కొంత మంది విద్యాబాలన్‌ కామెంట్లను సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే.. విద్య బాలన్   నటించిన లేటెస్ట్‌ సినిమా  దో ఔర్‌ దో ప్యార్‌  థియేటర్లలో  ఉంది. 

click me!