విజయ్ హీరోగా రూపొందుతున్న సినిమా 'జననాయకన్'. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ జూన్ నెలతో పూర్తవుతుందని అంచనా. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్, పూజా హెగ్డే, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, నరేన్, ప్రియమణి, మమిత బైజు వంటి తారాగణం నటిస్తుంది.