`పోకిరి` సినిమాని రిజెక్ట్ చేసిన బాలీవుడ్‌ హీరో ఎవరో తెలుసా? పవన్‌, రవితేజతోపాటు చివరికి ఆయన కూడా

Published : Sep 28, 2025, 06:00 PM IST

`పోకిరి` మూవీ మొదట రవితేజ, పవన్‌ కళ్యాణ్‌ వద్దకు వెళ్లింది. వాళ్లు నో చెప్పడంతో మహేష్‌ బాబుతో చేశాడు పూరీ జగన్నాథ్‌. కానీ మధ్యలో ఓ బాలీవుడ్‌ స్టార్‌ వద్దకు కూడా వెళ్లిందట. 

PREV
15
మహేష్‌ బాబు ఇండస్ట్రీ హిట్‌ ఇచ్చిన `పోకిరి`

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా వచ్చిన `పోకిరి` మూవీ ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్‌గా నటించింది. ప్రకాష్‌ రాజ్‌ విలన్‌గా నటించగా, షియాజీ షిండే, నాజర్‌, అజయ్‌ ముఖ్య పాత్రలు పోషించారు. 2006 ఏప్రిల్‌ 28న ఈ చిత్రం విడుదలైంది. సినిమాపై అంచనాలు ఓ మోస్తారుగానే ఉన్నాయి. కానీ విడుదలయ్యాక మాత్రం బాక్సాఫీసుకి పూనకాలు తెప్పించింది. థియేటర్లకి జనం క్యూ కట్టారు. మహేష్‌ బాబు క్యారెక్టరైజేషన్‌ అదిరిపోయింది. ప్రారంభం నుంచి పోకిరిలా కనిపిస్తూ చివరికి వచ్చిన తన పాత్రలోని ట్విస్ట్ వాహ్‌ అనిపించింది. క్లైమాక్స్ సినిమాని నెక్ట్స్ లెవల్‌ కి తీసుకెళ్లింది. ఆ క్లైమాక్స్ కోసమే ఆడియెన్స్ రిపీటెడ్‌గా ఈ మూవీని చూశారంటే అతిశయోక్తి కాదు.

25
`పోకిరి` చేయాల్సిన హీరోలు

అయితే ఈ మూవీ మహేష్‌ బాబు వద్దకు రావడానికి ముందే చాలా మంది హీరోల వద్దకు వెళ్లింది. రవితేజని దృష్టిలో పెట్టుకుని ఈ కథని రెడీ చేశారని అంటుంటారు. కానీ తాను దర్శకుడు కాకముందే ఈ కథని సిద్ధం చేసుకున్నాడట పూరీ జగన్నాథ్‌. ఆ తర్వాత హీరో కమిట్‌ అయ్యాక ఆయనకు తగ్గట్టుగానే తన కథల్లో మార్పులు చేసుకున్నారట. అలా మొదట ఈ కథని రవితేజకి చెబితే ఆయన `నా ఆటోగ్రాఫ్‌` కోసం ఈ మూవీని పక్కన పెట్టారు. తర్వాత చేస్తామని చెప్పాడు, కానీ వర్క్ కాలేదు. రవితేజ రిజెక్ట్ చేయడంతో పవన్‌ కళ్యాణ్‌ వద్దకు వెళ్లింది. ఆయన కూడా ఆసక్తి చూపించలేదు. చిరంజీవి పేరు కూడా వినిపిస్తుంటుంది. కానీ చివరికి మహేష్‌ బాబు చేశారు. ఆయన ఇండస్ట్రీ హిట్‌ కొట్టారు. ఈ మూవీతోనే తిరుగులేని సూపర్‌ స్టార్‌ అయ్యారు మహేష్‌.

35
`పోకిరి`ని రిజెక్ట్ చేసిన అభిషేక్‌ బచ్చన్‌

అయితే మహేష్‌ కంటే ముందే, పవన్‌ కళ్యాణ్‌, రవితేజలతోపాటు ఈ మూవీ మరో హీరో వద్దకు వెళ్లిందట. అది తెలుగు హీరో కాదు, బాలీవుడ్‌ స్టార్‌ కావడం విశేషం. ఆయనే బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ తనయుడు అభిషేక్‌ బచ్చన్‌. అప్పుడప్పుడే హీరోగా రైజ్‌ అవుతున్నాడు అభిషేక్‌. ఆయనకు ఈకథ పడితే అదిరిపోతుందని భావించారు పూరీ. వెళ్లి కథ చెబితే తనకు నచ్చలేదన్నాడట. అమితాబ్‌ బచ్చన్‌ కి కూడా ఈ కథని వినిపించారట. కానీ పెద్దగా ఇంట్రెస్ట్‌ చూపించలేదట. ఈ విషయాన్ని పూరీ 99 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇలా వరుసగా రిజెక్షన్‌కి గురైన `పోకిరి` చివరికి మహేష్‌ బాబు వద్దకు వచ్చింది. అయితే ఈ సినిమాకి ముందు అనుకున్న టైటిల్ `పోకిరి` కాదు, మహేష్‌ సలహా మేరకు మార్చేశారు.

45
మహేష్‌ బాబు కోసం టైటిల్‌, బ్యాక్‌ డ్రాప్‌ని మార్చిన పూరీ

`పోకిరి`కి మొదట అనుకున్న టైటిల్‌ `ఉత్తమ్‌ సింగ్‌`. ఇందులో సిక్కు బ్యాక్‌ డ్రాప్‌లో హీరో పాత్ర ఉంటుందట. కానీ మహేష్‌ కి అది నచ్చలేదు, మార్పులు చేస్తే సినిమా చేస్తానని కండీషన్‌ పెట్టాడట. మహేష్‌ చెప్పింది పూరీ విన్నాడు. ఆయన మార్పులు చేసుకుని వచ్చారు. టైటిల్‌ని కాస్త `పోకిరి`గా మార్చేశారు. దీంతో సినిమాని ఓకే చేశాడు మహేష్‌ బాబు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత ఈ ఇద్దరు కలిసి `బిజినెస్‌ మేన్‌` చిత్రం చేశారు. ఇది కూడా మంచి ఆదరణే పొందింది. కానీ ఆ తర్వాత మరోసారి ఈ కాంబోలో మూవీ అనుకున్నారు. జనగణమన` చేయాలనుకున్నారు. కానీ వర్కౌట్‌ కాలేదు.

55
`పోకిరి` మూవీ కథ ఇదే

`పోకిరి` కథేంటనేది చూస్తే. హైదరాబాద్‌ సిటీలో దుబాయ్‌ బేస్డ్ గ్యాంగ్‌ స్టర్‌ అలీ భాయ్‌ తన కార్యకలాపాలు నడుపుతుంటాడు. ఇక్కడ ఆయనకు ఒక గ్యాంగ్‌ ఉంటుంది. పండు(మహేష్‌ బాబు) మనీ కోసం చిన్న చిన్న దందాలు చేస్తుంటారు. కొట్టడాలు, కిడ్నాప్‌ చేయడం, చివరికి చంపేయడం కూడా చేస్తుంటాడు. మొదట ఓ గ్యాంగ్‌ వద్ద పనిచేస్తాడు. ఆ తర్వాత అలీ భాయ్‌ గ్యాంగ్‌లో చేరతాడు. వీరికి అపోసిట్‌ గ్యాంగ్స్ అన్నింటిని లేపేస్తారు. పండు తండ్రి సూర్యనారాయణ. ఆయన మాజీ పోలీస్‌ అధికారి. అలీ భాయ్‌ గ్యాంగ్‌కి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని చెప్పి, ఆయన్నే లేపేస్తారు అలీ భాయ్‌ గ్యాంగ్‌. అంతకు ముందు నుంచే అలీ భాయ్‌ గ్యాంగ్‌తో పండుకి గొడవలు అవుతాయి. వారికి దూరంగా ఉంటాడు. సూర్యనారాయణ కొడుకు డిపార్ట్ మెంట్‌లో ఉన్నాడని, అతను తమకి ప్రమాదకరంగా మారుతున్నాడని తెలుసుకున్న అలీ భాయ్ గ్యాంగ్‌ తండ్రి సూర్యనారాయణని చంపితే అతను వస్తాడని భావించి తండ్రిని చంపేస్తారు. దీంతో తండ్రిని చూసేందుకు వస్తాడు పండు. కాకపోతే ఆయన పండుగా కాదు, కృష్ణ మనోహర్‌ ఐపీఎస్‌గా. పండు కాస్త పోలీస్‌ ఆఫీసర్‌గా ఎంట్రీ ఇవ్వడమే ఇందులో పెద్ద ట్విస్ట్. అదే థియేటర్లో గూస్‌ బంమ్స్ తెప్పిస్తుంది. అనంతరం అలీ భాయ్‌ గ్యాంగ్‌ని లేపేయడమే క్లైమాక్స్. ఇందులో మధ్యలో ఇలియానాతో లవ్‌ ట్రాక్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అది మరో లేయర్‌లో సాగుతుంటుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories