Bigg Boss Telugu 9: ఆ కేసులో సంజనాకి బిగుసుకుంటున్న ఉచ్చు, ఎలిమినేట్ కాకుండానే హౌస్ నుంచి బయటకి రాక తప్పదా ?

Published : Sep 28, 2025, 04:37 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో కంటెస్టెంట్ గా పాల్గొంటున్న సంజనా గల్రాని తాజాగా సుప్రీం కోర్టు నుంచి మాదక ద్రవ్యాల కేసులో నోటీసులు అందుకుంది. మరోవైపు యూట్యూబర్ ఆదిరెడ్డి సంజనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. 

PREV
15
బిగ్ బాస్ హౌస్ లో సంజనా హంగామా 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆసక్తికరంగా సాగుతోంది. బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా దివ్యని హౌస్ లోకి పంపారు. ఆ తర్వాత మిడ్ వీక్ ఎలిమినేషన్ పేరుతో సంజన విషయంలో పెద్ద హై డ్రామా క్రియేట్ చేశారు. ఎలిమినేట్ చేసినట్లు నమ్మించి తిరిగి ఆమెని హౌస్ లోకి పంపారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభం అయినప్పటి నుంచి సంజనా బాగా హైలైట్ అవుతున్నారు. తనతో పెట్టుకున్న ఎవ్వరినీ ఆమె వదలడం లేదు. పేస్ టూ పేస్ కౌంటర్ ఇచ్చేస్తోంది. సంజన గల్రాని గతంలో నటిగా రాణించారు. ఆ తర్వాత మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయ్యారు. బిగ్ బాస్ షోతో తిరిగి గుర్తింపు పొందే ప్రయత్నం చేస్తున్నారు. 

25
సంజనాకి సుప్రీం కోర్టు నోటీసులు 

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సంజనాకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆమెని మాదకద్రవ్యాల కేసు వెంటాడుతోంది. తాజాగా సంజనకి మాదకద్రవ్యాల కేసులో సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. 2020లో మాదకద్రవ్యాల కేసు కన్నడ చిత్ర పరిశ్రమని కుదిపేసింది. ఆ సమయంలో రాగిణి దిగ్వేది తో పాటు సంజనాని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో సంజన 14వ నిందితురాలిగా ఉన్నారు. 

35
సంజనా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి రావలసిందేనా ?

 కొన్ని నెలల తర్వాత సంజనా బెయిల్ పై విడుదలయ్యారు. కొకైన్, ఎండీఎం ఏ లాంటి మత్తు పదార్థాలని సంజన వినియోగించడంతో పాటు కొందరికి పంపిణీ చేసింది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కొన్ని సాంకేతిక కారణాల వాళ్ళ కర్ణాటక హైకోర్టు ఈ కేసుని రద్దు చేసింది. ఆ తీర్పుని సవాల్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. దీనితో సుప్రీం కోర్టు తాజాగా సంజనకి నోటీసులు పంపారు. దీనితో మరోసారి మాదకద్రవ్యాల కేసులో సంజనాకి చిక్కులు మొదలైనట్లు అనిపిస్తోంది. ఈ కేసు మరింత తీవ్రతరం అయితే సంజనా బిగ్ బాస్ హౌస్ ని వీడాల్సిన పరిస్థితి ఉంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. 

45
సంజనాపై ఆదిరెడ్డి సంచలన వ్యాఖ్యలు 

మరోవైపు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, యూట్యూబర్ ఆది రెడ్డి సంజనా గల్రాని విషయంలో వివాదంలో చిక్కుకున్నారు. బిగ్ బాస్ రీసెంట్ ఎపిసోడ్స్ గురించి ఆదిరెడ్డి రివ్యూ ఇస్తూ సంజనాని వ్యక్తిగతంగా దూషించినట్లు తెలుస్తోంది. ఆమె ఫ్యామిలీపై కూడా ఆది రెడ్డి కామెంట్స్ చేశారట. సంజనాతో పాటు ఆమె భర్తపై కూడా ఆది రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారట. దీనితో సంజనా పీఆర్ టీం రియాక్ట్ అయి ఆది రెడ్డికి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏఈ మేరకు సంజనా టీం పేరుతో ఒక లెటర్ కూడా విడుదలైంది.

55
సంజనా ఫ్యామిలీని అవమానించేలా కామెంట్స్ 

వెంకట ఆది నారాయణ రెడ్డి అలియాస్ ఆదిరెడ్డి అనే యూట్యూబర్ సంజనా గల్రానిపై అవమానకరమైన కామెంట్స్ చేశారు. దీని వల్ల ఆమె ఫ్యామిలీ, అభిమానులు ఎంతగానో బాధపడుతున్నారు. సాధారణంగా సద్విమర్శ చేయడానికి, వ్యక్తిగతంగా కించపరచడానికి చాలా తేడా ఉంది. సంజనా ప్రతిష్టకి నష్టం కలిగించే విధంగా ఆది రెడ్డి ఇకపై విమర్శలు చేయరు అని ఆశిస్తున్నట్లు ఆమె పీఆర్ టీం లేఖలో పేర్కొంది.   

సంజన గల్రాని తెలుగులో సర్దార్ గబ్బర్ సింగ్, అవును 2, 2 కంట్రీస్, లవ్ యు బంగారం, దుశ్శాసన లాంటి చిత్రాల్లో నటించింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో సంజన తరచుగా ఏదో ఒక వివాదంతో ఆమె హైలైట్ అవుతున్నారు. దాదాపు ప్రతి ఎపిసోడ్ లో సంజనకి స్క్రీన్ టైం ఎక్కువగా లభిస్తోంది. మరి రానున్న ఎపిసోడ్స్ లో సంజన ఎలా పెర్ఫామ్ చేస్తుంది ? ఆమె మాదక ద్రవ్యాల కేసు ఏమవుతుంది అనేది ప్రేక్షకుల్లో ఆసక్తిగా మారింది. 

Read more Photos on
click me!

Recommended Stories