షకీలా రాత్రి పడుకోవడానికి వేణు మాధవ్‌ రూమ్‌కి వెళితే, ఆయన చేసిన పనికి నిద్ర లేని రాత్రి

Published : Sep 28, 2025, 04:21 PM IST

ఒకప్పుడు తనదైన కామెడీతో టాలీవుడ్‌ ని శాసించిన కమెడియన్లలో వేణు మాధవ్‌ ఒకరు. ఓ రోజు ఆయన చేసిన పనికి నిద్ర లేని రాత్రి గడిపినట్టు వెల్లడించింది షకీలా.  

PREV
15
షకీలాకి బెస్ట్ ఫ్రెండ్‌ వేణు మాధవ్‌

షకీలా పేరు చెబితే వ్యాంప్‌ రోల్సే గుర్తుకు వస్తాయి. అంతేకాదు బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలే చక్కర్లు కొడుతుంటాయి. అయితే ఇప్పుడు వాటికి దూరంగా ఉంటోంది. క్లీన్‌ రోల్స్ చేస్తోంది.  కాకపోతే ఇప్పుడు ఆమెకి ఆఫర్లు కూడా తగ్గాయని చెప్పొచ్చు. పాజిటివ్‌ రోల్స్ చేస్తోంది. ఆ మధ్య బిగ్‌ బాగ్‌ షోలోనూ సందడి చేసిన విషయం తెలిసిందే. కాకపోతే ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. అయితే షకీలా.. ఒకప్పటి స్టార్‌ కమెడియన్‌ వేణు మాధవ్‌ తో మంచి స్నేహబంధం ఉంది. ఇండస్ట్రీలో తనకు బెస్ట్ ఫ్రెండ్‌ వేణు మాధవ్ అని చాలా ఇంటర్వ్యూలో చెప్పింది షకీలా. అంతేకాదు ఆయన చనిపోయినప్పుడు ఆమె చాలా బాధపడింది. బెస్ట్ ఫ్రెండ్‌ని కోల్పోయినట్టు తెలిపింది. తన సంతోషాలు, బాధలు అన్నీ ఆయనతో పంచుకునేదాన్ని అని  వెల్లడించింది.

25
వేణు మాధవ్‌ ఎలాంటివాడో బయటపెట్టిన షకీలా

ఇదిలా ఉంటే షకీలాకి సంబంధించిన ఒక ఇంటర్వ్యూ వైరల్‌ అవుతుంది. ఇందులో వేణు మాధవ్‌ గురించి ఆమె ఆసక్తికర విషయాలను పంచుకుంది. వేణు మాధవ్‌ నిజ స్వరూపం బయటపెట్టింది. ఓ సినిమా షూటింగ్‌ లో జరిగిన సంఘటన పంచుకుంటూ. సినిమా కోసం ఔట్‌ డోర్‌ షూట్‌కి వెళ్లారట. అందులో షకీలాతోపాటు వేణు మాధవ్‌ కూడా ఉన్నారు. అయితే రాత్రి తన రూమ్‌లో అందరు వచ్చి గోల గోల చేశారు, చెత్త చెత్తగా తయారైంది. అందులో పడుకోవడం షకీలాకి నచ్చలేదు.  వేణు మాధవ్‌కి ఫోన్‌ చేసి అరేయ్‌ రాత్రి పడుకోవడానికి నీ రూమ్‌కి వస్తాను అని చెప్పిందట. దీంతో వేణు మాధవ్‌ కూడా మరో మాట లేకుండా షకీలాని ఆహ్వానించారు. ఆయన రూమ్‌కి వెళ్లింది. కాసేపు మాట్లాడుకున్నారు.

35
వేణు మాధవ్ ఆ రాత్రి చేసిన పనేంటంటే?

ఇక పడుకునే సమయంలో ఆ రూమ్‌లో ఉన్నది ఒక్కటే బెడ్‌. దీంతో వేణు మాధవ్‌ వెళ్లి బెడ్‌పై ఏదో చేస్తున్నాడు. అది టీవీలో షకీలాకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఆమెకి ఏదో డౌట్‌ కొడుతుంది. చాలా డిస్టర్బెన్స్ గా అనిపిస్తుంది. అనంతరం వేణు మాధవ్‌.. షకీలా వద్దకు వచ్చి ఒక మాట అడగనా, ఓ విషయం అడుగుతాను, ఒప్పుకుంటావా? అని అన్నాడట. హస్కీ వాయిస్‌తో అడగడంతో షకీలాకి మనసులో తేడా కొడుతుంది. ఫ్రెండ్‌ అని వచ్చానే అని భయం పట్టుకుందట. ఏదైనా తప్పుగా అడిగితే ఈ ఫ్రెండ్‌షిప్‌ ఉండదు. ఛ అనవసరంగా వచ్చానే అని మనసులో అనుకుందట. ఇష్టం లేకపోయినా సరే అడిగి సావు అన్నదట. ఇదిగో నువ్వు ఒప్పుకోవాలి అన్నాడట. విసిగిస్తుంటే ఏందిరా నీ ప్రాబ్లమ్‌ అని అంటే.. బెడ్‌పై తనకు, షకీలాకి మధ్యలో పిల్లోస్‌ పెడుతున్నాడట. ఏందీరా ఇది అంటే ఏం లేదు, నాకు పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు తెలుసుకదా అన్నాడట. ఆ తెలుసు, వాళ్లు బాగుండాలంటే నేను బతికి ఉండాలి. తెలుసురా అని షకీలా అన్నదట. ఏం లేదు నువ్వు పడుకుని నీ కాలు నా మీద వేస్తే నేను సచ్చి ఊరుకుంటాడు. తర్వాత పెద్ద రచ్చ అయిపోతుందన్నాడట. ఆ పని మాత్రం చేయకు, అందుకే ఇలా చేస్తున్నా అన్నాడట. 

45
వేణు మాత్రం చేసిన పనికి రాత్రంతా నిద్రకరువు

ఆ దెబ్బకి షకీలాకి రాత్రంతా నిద్ర లేదట. ఆ రాత్రి మొత్తం నవ్వుతూనే ఉందట. రాత్రి మాత్రమే కాదు నెక్ట్స్ డే కూడా నవ్వుతూనే ఉందట. ఈ విషయం బ్రహ్మానందం, రఘుబాబు ఇలా అందరికి చెప్పిందట. అంతా నవ్వులే నవ్వులు. అది తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన అని తెలిపింది షకీలా. ఐడ్రీమ్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని చెప్పింది. వేణు మాధవ్‌ ఎంత మంచి వాడో తెలిపేందుకు ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. బేసిక్‌గా షకీలాపై ఒక ముద్ర ఉంది. అలాంటిది షకీలా ఒక రాత్రి తమ రూమ్‌కి వచ్చిందంటే ఎవరైనా అడ్వాంటేజ్‌ తీసుకుంటారు. కానీ వేణు మాధవ్‌ మాత్రం ఆమెని ఒక అక్కలా భావించాడు. తన మంచి తనమే కాదు అందులోనూ తన హ్యూమర్‌ని జోడించాడు. ఆ రోజు షకీలాకి జీవితంలో మర్చిపోలేని మెమోరీని అందించాడు.

55
వేణు మాధవ్‌ ని తలచుకుని కన్నీళ్లు

ఇక వేణు మాధవ్‌ 2019 సెప్టెంబర్‌ 25న కన్నుమూశారు. కిడ్నీ, లివర్‌ సమస్యలతో బాధపడుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.  వేణు మాధవ్‌ మరణించినప్పుడు షకీలా స్పందిస్తూ, తన జీవితంలో ఆల్‌ టైం గుడ్‌ ఫ్రెండ్‌ అనేవారు ఎవరూ లేరని, చాలా మందితో కలిసి పనిచేశాను, అయినా తనకు ఎవరూ స్నేహితులు కాలేదని, వారి నెంబర్లు కూడా తాను తీసుకోలేదని తెలిపింది. తాను ఇండస్ట్రీలో ముగ్గురితోనే క్లోజ్‌గా ఉంటానని, అందులో అలీ ఒకరు, రెండు నటి గీతాంజలి, మూడు వేణు మాధవ్‌ అని తెలిపింది షకీలా. వేణు తనకు తమ్ముడి లాంటి వాడు అని, అక్కా తిన్నావా అని ఫోన్‌ చేసి అడిగే ఏకైక వ్యక్తి అతనే అని, ఇప్పుడు వాడే లేడని ఎమోషనల్‌ అయ్యింది. ఇదిలా ఉంటే నేడు కమెడియన్‌ వేణు మాధవ్‌ 56వ జయంతి(1969, సెప్టెంబర్‌ 28) కావడం విశేషం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories