సినిమాలు, టీవీ షోలు, ప్రకటనల ద్వారా అమితాబ్ బచ్చన్ చాలా రకాలుగా సంపాదిస్తున్నారు. ఇవే కాకుండా స్థిరాస్తి, వివిధ పెట్టుబడుల ద్వారా అమితాబ్ కు భారీగా సంపాదన ఉంది. దేశంలోని అత్యంత సంపన్న నటుల్లో ఒకరైన అమితాబ్ బచ్చన్ ఆస్తుల విలువ 3100 కోట్లు ఉంటుందని అంచనా. అమితాబ్ ముంబైలో విలాసవంతమైన బంగ్లాలు, లగ్జరీ కార్లు మరియు వ్యక్తిగత జీవితంతో రాయల్ లైఫ్ ను అనుభవిస్తున్నారు.