రష్మీ గౌతమ్ కి లైఫ్ ఇచ్చింది జబర్దస్త్. హీరోయిన్ కావాలన్న ఆమె కల నెరవేర్చింది. తెలుగులో టాప్ యాంకర్స్ లో ఒకరిగా ఎదగడానికి దోహదం చేసింది. 2013లో జబర్దస్త్ కామెడీ షో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. రోజా, నాగబాబు జడ్జెస్ట్ గా, అనసూయ యాంకర్ గా షో మొదలైంది.
రోలర్ రఘు, ధనాధన్ ధన్ రాజ్, వేణు వండర్స్ , అదిరే అభి, రాకెట్ రాఘవ, చమ్మక్ చంద్ర, షకలక శంకర్ అనే టీమ్స్ ఉండేవి. షో ఊహకు మించిన సక్సెస్ అయ్యింది. గ్లామరస్ యాంకర్ గా అనసూయ పాప్యులర్ అయ్యింది. కొన్ని ఎపిసోడ్స్ అనంతరం అనసూయ జబర్దస్త్ నుండి తప్పుకుంది.
Jabardasth Anasuya Bharadwaj
అనసూయ స్థానంలోకి రష్మీ గౌతమ్ వచ్చింది. అది రష్మీ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అయ్యింది. అనసూయను మరిపిస్తూ రష్మీ గౌతమ్ తన మార్క్ యాంకరింగ్, గ్లామర్ షోతో క్రేజ్ రాబట్టింది. రష్మీ వచ్చాక జబర్దస్త్ టీఆర్పీ మరింత పెరిగింది. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది వంటి టాలెంటెడ్ కమెడియన్స్ జబర్దస్త్ కి వచ్చారు.
రోజా, నాగబాబు, అనసూయ, హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను వంటి స్టార్స్ వెళ్లిపోగా జబర్దస్త్ షోకి ఆదరణ తగ్గింది. కొత్తగా వచ్చిన కమెడియన్స్, టీమ్ లీడర్స్ పెద్దగా ప్రభావం చూపడం లేదు. దీంతో జబర్దస్త్ నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎక్స్ట్రా జబర్దస్త్ రద్దు చేశారు. రెండు ఎపిసోడ్స్ జబర్దస్త్ పేరుతో రెండు వారాలు ప్రసారం అవుతాయని ప్రకటించారు.
ఈ క్రమంలో కొత్త టీమ్స్ తో ఎక్స్ట్రా జబర్దస్త్ స్టార్ట్ చేశారు. అనసూయ రీ ఎంట్రీ ఇవ్వగా జబర్దస్త్ కి అనసూయ, ఎక్స్ట్రా జబర్దస్త్ కి రష్మీ యాంకర్స్ గా వ్యవహరిస్తూ వచ్చారు. జబర్దస్త్ యాంకర్ గా వచ్చిన క్రేజ్ తో రష్మీకి హీరోయిన్ ఆఫర్స్ వచ్చాయి. పలు చిత్రాల్లో ఆమె నటించారు.
Rashmi Gautam
దీంతో మనస్తాపానికి గురైన రష్మీ గౌతమ్ ఆత్మహత్యాయత్నం చేసిందట. ఎక్స్ట్రా జబర్దస్త్ రద్దు చేసిన క్రమంలో తన జాబ్ పోయిందని ఆమె విషం తాగే ప్రయత్నం చేసిందట. ఈ విషయాన్ని ఆటో రాంప్రసాద్ బయటపెట్టాడు.
అయితే ఇది కామెడీ కోసమే. లేటెస్ట్ జబర్దస్త్ ఎపిసోడ్లో రామ్ ప్రసాద్ రష్మీ మీద పంచ్ వేశాడు. ఎక్స్ట్రా జబర్దస్త్ రద్దు చేయడంతో విషం తాగబోయిన రష్మీ, జబర్దస్త్ రెండు ఎపిసోడ్స్ కి నువ్వే యాంకర్ అని చెప్పడంతో విషం పక్కన పెట్టి విస్కీ తాగింది' అని పంచ్ వేశాడు. రామ్ ప్రసాద్ జోక్ కి సెట్ లోని వారందరూ గట్టిగా నవ్వేశారు.